200 కోట్లు.. 300 కోట్లు.. 600 కోట్లు.. 5గురు మొనగాళ్లు…!

200 కోట్లు, 300 కోట్లు లేదంటే 400 కోట్లు కాదంటే 600 కోట్లు.. ఇవి ఏదో సినిమా వసూల్లు కాదు.. కనీసం ఇంకేదో మూవీ బడ్జెట్ కాదు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్మాసెస్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ లెక్కలు.

Post Published By: dialnews
Updated : 29 April 2026, 7:15 PM IST

200 కోట్లు, 300 కోట్లు లేదంటే 400 కోట్లు కాదంటే 600 కోట్లు.. ఇవి ఏదో సినిమా వసూల్లు కాదు.. కనీసం ఇంకేదో మూవీ బడ్జెట్ కాదు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, మ్యాన్ ఆఫ్మాసెస్ ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ లెక్కలు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వరకు, ఇప్పుడు 100 కోట్ల నుంచి 200 కోట్లు దాటిన బ్యాచ్ అంటే ఐదుగురే... తమిళ సూపర స్టార్ రజినీకాంత్, కన్నడ రాకింగ్ స్టార్ యష్ కూడా ఇంతవరకు 300 కోట్ల నెంబర్ ని రీచ్ కాలేదు.. కాని టాలీవుడ్ లో మహేశ్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ ఆ నెంబర్ ని దాటేశారు.. చరణ్ కూడా ఆల్ మోస్ట్ 300 కోట్ల రెమ్యునరేషన్ ని అందుకునేందుకు సిద్దమౌతున్నాడు.. ఎటొచ్చి, పవన్ అండ్ కో మాత్రం ఇంతవరకు ఈ నెంబర్ రేంజ్ కి రీచ్ కాలేదు.. అంటే సౌత్ నుంచి 300 కోట్ల రేంజ్ రెమ్యూనరేషన్ మించింది ఈ నలుగురేనా? ఐదో వాడిగా చరణ్ ఎంట్రీ ఎప్పుడు? వీల్లకే అదెలా సాధ్యం?

సూపర్ స్టార్ ఇంతవరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు. డైరెక్ట్ గా పాన్ వరల్డ్ ఫిల్మ్ వారణాసితో ఎటాక్ చేయబోతున్నాడు. ఐతే తన రెమ్యునరేషన్ ఈ సినిమాతో ఎక్కడికి చేరిందో తెలుసా? 600 కోట్ల నుంచి 1000 కోట్ల స్థాయి.. ఇది ఆల్ మోస్ట్ రియలిస్టిక్ నెంబరే.. ఇలాంటి నెంబర్స్ మరో ముగ్గురి సొంతమయ్యాయి. 580 కోట్లతో సెకండ్ ప్లేస్ లో ప్రభాస్ ఉంటే..470 కోట్ల నుంచి 500 కోట్ల మధ్య రెమ్యూనరేషన్ అందుకోబోతు మూడో స్థానంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఉన్నాడు. అంటే ఎవరూ కూడా ఇంతవరకు అంత రెమ్యునరేషన్ అందుకోలేదు.. ఆవివరాల్లోకి వెళ్లేముందు.. పాన్ ఇండియా లెవల్లో 300కోట్లకు దగ్గర్లోలేదేంటే అంతకంటే ఎక్కవు రెమ్యునరేషన్ అందుకున్న,అందుకుంటన్న స్టార్స్ అంతా తెలుగుహీరోలే.

మహేశ్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ ఈ నలుగురు 300కోట్ల రెమ్యునరేషన్ ని దాటేశారు. ఇక రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ కి 100 కోట్లు అందుకున్న తర్వాత, గేమ్ ఛేంజర్ కి ఏకంగం 220 కోట్లు తీసుకున్నాడని ప్రచారం జరిగింది. అంటే పెద్ది హిట్టైతే 300 కోట్ల పారితోషికం అందుకునే స్టార్ గా తను మారే ఛాన్స్ఉంది. నిజానికి ఇంకా 150 కోట్లు దాటకుండా, ఈ లిస్ట్ లో వెనకబడింది మాత్రం పవర్ స్టార్ పవన్ కళ్యాణే.లైగర్ నుంచి వరుసగా ఫ్లాపులు పడకపోయుంటే, విజయ్ దేవరకొండ కూడా ఈ లిస్ట్ లో చేరేవాడు. కాని అడ్రస్ లేకుండా పోయాడు.. సరే ఈ పేర్లు పక్కన పెడితే, మహేవ్, ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ ఈ నలుగురికి ప్రాఫిట్ లో షేర్ ప్రకారంగానే, 300 కోట్ల నుంచి 600 కోట్లు తీసుకునే రేంజ్ దక్కింది. అలా చూస్తే సూపర్ స్టార్ రజినీ కాంత్ సినమాలు 550 కోట్లకుమించలేదు కాబట్టే, తను 200 కోట్ల రెమ్యునరేషన్ దగ్గరే ఆగాడు. తమిల విజయ్, కన్నడ యష్ కూడా 200 కోట్ల లోపు పారితోషికంతోనే సరిపెట్టుకున్నారు.. అంటే వాళ్లు కూడా రామ్ చరణ్ స్టేజ్ లోనే ఉన్నట్టు లెక్క.

ఏదేమైనా డ్రాగన్ కి ఎన్టీఆర్ ప్రాఫిట్స్ లో షేర్, అలానే రైట్స్ మీద డీల్ ప్రకారం 470 కోట్లకు పైనే దక్కించుకున్నాడంటున్నారు. డ్రాగన్ ఏమాత్రం 1000 కోట్ల క్లబ్ లో చేరినా, మరో వందకోట్ల వరకు అదనంగా తనకు దక్కేలా ఉంది. ఇక వారణాసి, స్పిరిట్ విషయంలో కూడా ప్రాఫిట్ షేర్ ప్రాసెస్ వల్లే తెలుగు హీరోలు, దేశంలో మరే హీరో తీసుకోలేనంత.. అది కూడా హాలీవుడ్ స్టార్స్ అందుకునేంత భారీ మొత్తాలు సొంతం చేసుకుంటున్నారు. 300 కోట్ల నుంచి 600 కోట్ల రేంజ్ కి ఎదిగిపోయారు.

Published : 
  • 29 April 2026, 7:15 PM IST