సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రియాంక, రాజమౌళి.. ఈ ముగ్గురు కలిసొ ఒక్క మెట్టెక్కితే వెయ్యికోట్లు వాళ్ల ఎకౌంట్లో పడ్డట్టే... అలాంటివి ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా పది మెట్లెక్కేందుకు ఈ ముగ్గురు రెడీ అయిపోయారు. ఇంతకి అంత కాస్ట్ లీ మెట్లెక్కడున్నాయి.. ఎందుకు వాటిని ఎక్కితే వీళ్లకు వెయ్యికోట్లు దక్కుతాయి... అదే మ్యాజిక్... రాజమౌళికి మాత్రమే అర్ధమైందా? లేదంటే తనే కనిపెట్టాడా? కాదంటే, ఇందులో తనే ఎక్స్ పర్టా..? సింపుల్ గా చెప్పాలంటే, పాన్ ఇండియా సినిమా తీయటం ఎలానో తనకంటే సీనియర్లు కూడా నేర్పించాడు రాజమౌళి. ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీ ని ఎలా తీయాలో... ఎలా సేల్ చేయాలో కూడా తనే సెలబస్ తయారు చేస్తున్నాడు. కేవలం అంటే కేవలం పది మెట్లెక్కితే, పదివేలకోట్ల సినిమా తీయొచ్చని కనిపెట్టాడు.. అదే ఇప్పుడు నిజం చేయబోతున్నాడు. సూపర్ స్టార్ గా ఉన్న మహేశ్ ని గ్లోబల్ సూపర్ స్టార్ గా మార్చబోతున్నాడు.. ఇంతకి పది వేలకోట్లు ఇచ్చే, ఆ కాస్ట్ లీ పది మెట్ల కథేంటి?
మొన్న మెక్సికో... ఇప్పుడు పారీస్.. ఎళ్లుండి ఎక్కడ..? వారనాసి ప్రమోషన్ కోసం ఒక్కో మెట్టెక్కుతోంది ఫిల్మ్ టీం. పాన్ వరల్డ్ సినిమా అన్నాక, మెక్సికో, పారిస్, ఆప్రికా, యూరప్ ఇలా ప్రపంచం మొత్తం చెక్కర్లు కొట్టాలి తప్పదు.. కాని ఏం చేస్తే ఒక్కో ప్లేస్ లో 1000 కోట్లు చొప్పున పది ఏరియాల్లో 10 వేల కోట్లొస్తాయి.. అదే రాజమౌళి రాజ రహస్యంగా మారుతోంది.మెక్సికోలో మొన్న వారణాసి మూవీ ప్రమోషన్ జరిగింది. అక్కడ టీజర్ స్క్రీనింగ్ జరిగింది. ఒక్క ఫ్రేమ్ కూడా బయటకి లీక్ కాకుండా, అక్కడి సినీ జనాలకు, డిస్ట్రిబ్యూటర్లకు టీజర్ ని టేస్ట్ చేయించారు.. సో అక్కడ ఏమాత్రం డిస్ట్రిబ్యూటర్లు, లోకల్ ఆడియన్స్ కి ఈ మూవీ టీజర్ నచ్చినా, మెల్లి మెల్లిగా మన సినిమా ఎక్కడొ మొదలయ్యేఛాన్స్ ఉంది.
సో ఏప్రిల్ లో రిలీజ్ అయ్యేనాటికి మెక్సికో, లాటిన్ అమెరికాలో వారణాసి మీద ఒక చిన్న బజ్ క్రియేట్ అవ్వొచ్చు.. కట్ చేస్తే నెక్ట్స్ టార్గెట్ పారిస్...అంటే యూరప్ లోని బిగ్ కంట్రీ అయిన ఫ్రాన్స్ లో వారణాసి టీజర్ ని, అక్కడి మార్కెట్ లో, ప్రివ్యూలరూపంలో డిస్ట్రిబ్యూటర్లుకు, సినీ జనాలకు చూపించబోతున్నారు. అదే జరిగితే మెల్లిగా జర్మనీ, స్పేయిన్, ఇలా యూరప్ అంతా వారణాసి మీద లోకల్ మీడియాలో, ప్రచారం పెరుగుతుంది. వన్ ఇయర్ లో వారణాసి రీచ్ పెరిగే ఛాన్స్ఉంది.ఇవన్నొ కాస్ట్ లీ మెట్లు...మెక్సికో ప్రచారం వల్ల, లాటిన్ అమెరికా దేశాల మార్కెట్ నుంచి 1000 కోట్లు,.. యూరప్ లో వారణాసి ప్రమోషన్ వల్ల అక్కడ కనీసం రెండు వేలకోట్లు.. అమెరికా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, సౌత్ ఆసియా...అందులో కొరియా, ఇండోనేషియా.. ఇలా లెక్కేస్తే.. ప్రపంచంలో పది ప్రత్యేక మార్కెట్లతో వారణాసి కనీసం వెయ్యికోట్ల చొప్పున రాబడితే, 10 వేల కోట్ల వసూల్లు అసలు అసాద్యమే కాదు... అందుకే రిలీజ్ కి ఏడాది ముందు నుంచే. మెక్సికో, పారిస్, న్యూ యార్క్, సియోల్ , షాంగై ఇలా ఒక్కో మెట్టు ఎక్కుతోంది వారణాసి టీం.
నిజానికి పాన్ ఇండియా సినిమా అంటే ఒకప్పుడు ఒక భాషలో తీసి, ఐదారు భాషల్లో రిలీజ్ చేయటం... రాజమౌళి కూడా ఇదే చేశాడు.. కాని మణిరత్నం అండ్ కో కంటే కూడా రాజమౌలికే పాన్ ఇండియా ట్రెండ్ సెట్టర్ గా పేరొచ్చింది. ఎందుకంటే, కేవలం తను దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో సినిమాను రిలీజ్ చేయటం కాదు, కేవలం అన్ని ప్రాంతాల్లో ప్రమోట్ చేయటమే కాదు... సినిమా సోసోగా ఆడినా, పెట్టిన పెట్టుబడికి కనీసం ఐదురెట్లు రాబడి వచ్చేలా, పాన్ ఇండియా మార్కెట్ గల్లాపట్టుకున్నాడు.. అదెలా సాధ్యమైందో తనకే తెలియాలి... అందుకే తనకి ఫెల్యూర్స్ లేవు... కాబట్టే తనే పాన్ ఇండియా దారి చూపించిన మార్గదర్శి అని మణిరత్నం కూడా అన్నాడు.. సో ఇలానే పాన్ వరల్డ్ అంటే, ప్రపంచ భాషల్లో మన సినిమా ను రిలీజ్ చేయటం కాదు.. అక్కడి జనం మన మూవీకోసం ఎగబడేలా చేయాలి.. అదే మార్కెటింగ్... అక్కడే ఒక్కో మెట్టు ఎక్కుతున్న రాజమైళి, 10వేలకోట్ల కొట్లాటకు సిద్ధమయ్యాడు.