Dragon Warrior… మరి Raman.?

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నిజంగా పాన్ ఆసియా సినిమానా? పాన్ వరల్డ్ మూవీనా? ఎందుకు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ గా క్లారిటీ ఇవ్వట్లేదు. మొన్న హీరో లుక్ పోస్టర్ ని వదిలాడు... గ్లింప్స్ రాబోతోందని తేల్చాడు.ఎన్టీఆర్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు

Post Published By: dialnews
Updated : 25 April 2026, 7:50 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ డ్రాగన్ మూవీ నిజంగా పాన్ ఆసియా సినిమానా? పాన్ వరల్డ్ మూవీనా? ఎందుకు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ గా క్లారిటీ ఇవ్వట్లేదు. మొన్న హీరో లుక్ పోస్టర్ ని వదిలాడు... గ్లింప్స్ రాబోతోందని తేల్చాడు.ఎన్టీఆర్ బర్త్ డేకి గిఫ్ట్ రెడీ చేస్తున్నాడు. ఐతే ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రపంచాన్ని కాంకర్ చేయబోతున్నట్టు ఇచ్చిన ఇంగ్లీష్ స్టేట్ మెంట్ తో ఇది పాన్ వరల్డ్ మూవీగానే ఫోకస్ అవుతోంది. కాని కథ కనెక్షన్ మాత్రం ఎక్కువగా పాన్ ఆసియానే అనంటున్నారు. ఈ కన్ ఫ్యూజన్ డ్రాగన్ గ్లింప్స్ వచ్చే వరకు పోదా? అల్లు అర్జున్ రాకా కూడా పాన్ వరల్డ్ కాదంటున్నారా? వారణాసి తోపాటు స్పిరిట్ పరిస్థితేంటి? వారణాసి వరల్డ్ సినిమా అని అంతా కన్ఫామ్ చేసుకుంటున్నారు. కాని స్పిరిట్ విషయంలో అలాంటి క్లారిటీ లేదు.. ఇంతకి మొదటి పాన్ వరల్డ్ మూవీ ఏది? డ్రాగన్ వారియర్ గా ఎన్టీఆర్ దండెత్తేది ఏ మార్కెట్ ని?

డ్రాగన్ మూవీ పాన్ ఆసియా ప్రాజెక్ట్ అని మొదట్నుంచి ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో ప్రపంచాన్ని గెలిచేందుకు వస్తున్న వారియర్ అంటూ ప్రశాంత్ నీల్ సడన్ గా ఎన్టీఆర్ కొత్త లుక్ ని రివీల్ చేయటంతో, ఇది పాన్ ఆసియా కాదు పాన్ వరల్డ్ మూవీగా కన్ఫామ్ చేసుకున్నారు. కట్ చేస్తే, ఇప్పుడు పాన్ ఆసియా ప్రాజెక్టే ఇది అనేలా మరో థియరీ వినిపిస్తోంది.నిజానికి డ్రాగన్ పాన్ వరల్డ్ సినిమానే.. కాని మేయిన్ టార్గెట్ మాత్రం పాన్ ఆసియా... ప్రజెంట్ పాన్ వరల్డ్ లెవల్లో మన సినమాలు ఆడాలంటే, హాలీవుడ్ రేంజ్ లో మన సినిమాకు ఓ క్రెడిబిలిటి, క్రేజ్ ఉండాలి.. అది ఒక్కరోజులో, ఒక్క సినిమాతో అయ్యేది కాదు.. కాని ఒకే సినిమాతో మాత్రం ఒక అడుగు ముందుకేయొచ్చు... అందుకే కథబలం ఎటువైపు ఉంటే, అటు వైపు డ్రాగన్ ని రిలీజ్ చేయాలనే ఫిక్స్అయ్యింది ఫిల్మ్ టీం.

అందుకే ముందు డ్రానగ్ ని చైనా, జపాన్, కొరియా, ఇండోనేషియా,మలేషియా ఇలా సౌత్ ఆసియా ఆడియన్సే టార్గెట్ గా తీస్తున్నారు. రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు. పనిలో పనిగా యూరప్, అమెరికాలో కూడా రిలీజ్ చేస్తారు కాని, మేయిన్ టార్గెట్ మాత్రం సౌత్ ఆసియా దేశాలే... యూఎస్, యూరప్ లో ఏమాత్రం వర్కవుట్ అయినా అది బోనస్ గానే అనుకుంటున్నారట.ఇక డ్రాగన్ ఏమాత్రం వర్కవుట్ అయినా, డ్రాగన్ 2 మాత్రం పాన్ వరల్డ్ మూవీగా మార్చటం ఈజీ... రీచ్ కూడా పెరుగుతుంది. ఇండియా, పాన్ ఆసియా మార్కెట్లో డ్రాగన్ 2 కి డిమాండ్ పెరుగుతంది. కాబట్టి అప్పుడు అమెరికా, యూరప్ లో సీక్వెల్ ని మరింత స్ప్రెడ్ అయ్యేలా చేయొచ్చు. అందుకే డ్రాగన్ పాన్ ఆసియా టూ పాన్ వరల్డ్ ప్లాన్ చేసిన సినిమా అంటున్నారు.

ఇక స్పిరిట్ కథ పరంగాయూరోపియన్స్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ అని, ఫ్రాన్స్ లో జరిగిన ఒక సంఘటన ప్రేరణతో తీస్తున్న సినిమా అవటంతో, యూరప్ మార్కెట్ ని మేయిన్ టార్గెట్ గా ప్లాన్ చేస్తోంది సందీప్ రెడ్డి టీం. ఆతర్వాతే కల్కీ 2 రాబోతోంది. అది మాత్రం పాన్ వరల్డ్ ప్రాజెక్టే అని తెలుస్తోంది. ఇక వారాణాసి కూడా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ అవటానికి రీజన్, హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ ఫ్లేవర్ తో ఈసినిమా తీయటం... ఇదంతా బానేఉంది. కాని, అల్లు అర్జున్ రాకా పరిస్థితేంటి? ఇది పాన్ ఇండియా సినిమానేనా?కథాంశం చూస్తుంటే బీస్ట్ మూవీలు హాలీవుడ్ లో కొత్తేం కాదు... ఆసియాకు కల్చరల్ గా ఇలాంటి జోనర్ కి క్రేజ్ ఉండదు..మరి హాలీవుడ్ స్టైల్లో వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేస్తున్న రాకా టీం, అత్యాశకు పోతుందా? లేదంటే ఆరేంజ్ లో కంటెంట్ అందులో ఉందా అన్నది టీజర్ వస్తేనే చెప్పొచ్చు.. కాకపోతే డ్రాగన్, స్పిరిట్ కి ముందు పాన్ ఇండియా మార్కెట్, అలానే పాన్ ఆసియా, పాన్ యూరప్ మార్కెట్ లో సేప్ జోన్లు... మిగత ప్రపంచ మార్కెట్ బోనస్ గా మారే ఛాన్స్ఉంది. కాని రాకా మూవీకే ఇలాంటి పరిస్థితి కనిపించట్లేదు. సేఫ్ జోన్ కనిపించట్లేదు.

Published : 
  • 25 April 2026, 7:50 PM IST