సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైం.. 25 నిమిషాల్లో అరాచకం…!

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైం వచ్చిందా? నిజంగా ఆటైమే వస్తే, వారణాసి మూవీ రిలీజ్ అయ్యుండాలి.. కాని దానికి ఇంకా ఏడాది పైనే టైముంది...

Post Published By: dialnews
Updated : 17 February 2026, 8:50 PM IST

సూపర్ స్టార్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే టైం వచ్చిందా? నిజంగా ఆటైమే వస్తే, వారణాసి మూవీ రిలీజ్ అయ్యుండాలి.. కాని దానికి ఇంకా ఏడాది పైనే టైముంది... అలాంటప్పుడు సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ వచ్చే ఛాన్స్ ఇప్పడప్పుడే లేనట్టు.. కాని సూపర్ పండక్కి ఎంతో టైం లేదని తేల్చేస్తున్నాడు మహేశ్ బాబు. ఎందుకంటే రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న వారణాసి 50శాతం షూటింగ్ పూర్తి చేసుకోవటమే కాదు.. అంతకుమించిన అప్ డేట్ ఒకటి రెడీ అయ్యింది. అదే 70శాతం గ్రాఫిక్స్ వర్క్ పూర్తవటం. ఈ సినిమాలో మైండ్ బెండ్ చేసే గ్రాఫిక్స్ అవసరమున్న సీన్ల షూటింగ్ ఎప్పుడో పూర్తి చేశారు... ఆ సీన్ల గ్రాఫిక్స్ వర్క్ కూడా 70శాతం పూర్తైంది... ఇక మిగిన 30శాతం మే ఎండ్ కల్లా పూర్తువుతంది. జూన్ లోగా పెండింగ్ టాకీ పార్ట్ పూర్తవటం పక్కా... అంటే స్కూల్లు, కాలేజీలు తెరిచే జులై సీజన్ నుంచే వారణాసి వరాలు మొదలౌతాయా? ఈ ఉగాది నుంచే ప్రమోషన్ లో ఎమోషన్ కాదు, సెన్సేషన్ ని యాడ్ చేయబోతున్నారా?

సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఇంకా ఏడాది వరకు వేయిట్ చేయాల్సిన పనిలేదు.. మహేశ్ లో రాజమౌళి తీస్తున్న సినిమా టీం ఇక నుంచి షాకుల మీద షాకులిచ్చేందుకు సిద్దమైంది. ఇంతవరకు లోకల్ మీడియా, నేషనల్ మీడియాని పట్టించుకోని రాజమౌళి, అప్ డేట్ల సునామీకి సిద్దమయ్యాడు. ఆల్రెడీ అమెరికన్ రిపోర్టర్లకు ఇస్తున్న యూ ట్యూబ్ ఇంటర్వూల్లో బాంబుల మీద బాంబులు పేల్చాడు..ఇక మీదట కేవలం మాటలు కాదు, ఈ పాన్ వరల్డ్ సినిమా తాలూకు అసలు సిసలు అప్ డేట్ల సునామీ రాబోతోంది. ఇంతవరకు ఈ మూవీ కాన్సెప్ట్ గ్లింప్సే తప్ప, అసలు విజువల్స్ లో గ్లింప్స్ రాలేదు. డైలాగ్ ఎలా ఉంటయో తెలియలేదు... అదే ఇప్పుడు తేలబోతోంది. ముందు గ్లింప్స్, తర్వాత టీజర్, ఆతర్వాత మేకింగ్ వండర్స్ ఇలా వరుసగా ఓ స్పెషల్ ప్యాకేజీనే రాబోతోంది.

నిజానికి 1359 కోట్ల బడ్జట్ తో ఇండియాలో తెరకెక్కుతున్న ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీ వారణాసి. అంతేకాదు ఐమ్యాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ సినిమా కూడా ఇదే. 30 భాషలు, 120 దేశాల్లో 100 కోట్ల మంది చూసేలా 55 వేల థియేటర్స్ లో ఘనంగా రిలీజ్ చేసి, హాలీవుడ్ కి కూడా సాధ్యం కాని రికార్డు క్రియేట్ చేసే పనిలో పడ్డాడు రాజమౌళి. ఇలాంటదేదైనా చేస్తేనే వరల్డ్ మార్కెట్ లో హైప్ వస్తుంది. వరల్డ్ మీడియా అటెన్షన్ ఇటు వైపు పడుతుందిఆల్రెడీ బాహుబలి, త్రిబుల్ ఆర్ తో రాజమౌళి టేకింగ్ కి వరల్డ్ వైడ్ గా కాస్త గుర్తింపు దక్కింది. ఇప్పుడు అంతకుమించేలా పాన్ వరల్డ్ మార్కెట్లోకి మన సినిమాను తీసుకెళుతున్నాడు రాజమౌళి. అందుకోసమే అమెరికన్ యూ ట్యూబ్ చానల్స్ కి వరుసగా ఇంటర్వూలిస్తూ, అక్కడి ఆడియన్స్ లోకి మన సినిమాను తీసుకెళ్లేందుకు, నిదానంగా ప్రమోషన్ మొదలు పెట్టాడు.

అయితే ఇవన్నీ ఎంతగా పేయిడెడ్ ఇంటర్వూలే అయినా, టీజరో, గ్లింప్సో, ట్రైలరో వస్తే కాని మన సినిమాల గురించి తెలియని అమెరికన్లు, యూరోపియన్లు రియాక్ట్ కారు.. అందుకే వరుస అప్ డేట్లకు టైం అయ్యిందని తెలుస్తోంది. ఆల్రెడీ సినిమా షూటింగ్ 50శాతం పూర్తైంది. గ్రాఫిక్స్ హెవీగా అవసరం ఉండే, సీన్లన్నీ ముందే పూర్తి చేసిన రాజమౌలి, ఆఖరికి రామాయణ యుద్దం ఘట్టం కూడా పూర్తి చేశానన్నాడు. ఇక గ్రాఫిక్స్ వర్క్ కూడా 70శాతం పూర్తైంది. మే, జూన్ లోగా పెండింగ్ గ్రాఫిక్సే కాదు, పెండింగ్ 50శాతం టాకీ పార్ట్ కూడా పూర్తవుతుంది. ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పెద్దగా ఉండకపోవచ్చు.. అప్పటికే గ్రాఫిక్స్ పనులు పూర్తయ్యాయంటే, ఇక మిగిలింది ప్రమోషనే.. అంటే జూన్ ఎండ్ నుంచి షూటింగ్ కి గుమ్మడికాయకొట్టడంతో పాటు, ప్రమోషన్ తో బిజీ కాబోతోంది ఫిల్మ్ టీం.ఈ ఉగాదికి గ్లింప్స్ పేలొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఇక జూన్ లో టీజర్ ని రిలీజ్ చేసి, అమెరికా, యూరప్ మీడియాలో సినిమా ప్రమోషన్ బిజీ కాబోతోంది ఫిల్మ్ టీం. సూపర్ స్టార్ మహేశ్ బాబు కనీసం 6 నెలలు వరల్డ్ టూర్ వేయబోతున్నాడు. యూరప్, అమెరికా, సౌత్ అమెరికా, ఆఫ్రికా, సౌత్ ఏసియా ని కవర్ చేసేలా100 దేశాల్లో ఈ సినిమా ను ప్రమోట్ చేసేందుకు టోటల్ టీం వరల్డ్ టూర్ ప్లాన్ చేస్తోంది. అంటే ఉగాది నుంచే అసలు సిసలు అప్ డేట్లు, టీజర్లు, సాంగ్స్, మేకింగ్ వీడియోలతో దుమ్ముదులపటం ఖాయంగా కనిపిస్తోంది.

Published : 
  • 17 February 2026, 8:50 PM IST