సూపర్ స్టార్ మహేశ్ బాబు పాన్ వరల్డ్ మూవీ వారణాసి 300 కోట్ల మ్యాటర్ వైరలౌతోంది. ఒకే ఒక్క ఎపిసోడ్ కి అన్ని కోట్లు పెట్టారనే మాట తూటాలా దూసుకెళుతోంది. నిజంగా ఇన్ని కోట్లు పెట్టరా? కేవలం ఇది ప్రచారంలో భాగంగా, అదిగో పులి అంటే ఇదిగో తోక అనంటున్నారా? ఇలాంటి డౌట్లు మరే దర్శకుడి సినిమాకో వస్తే వ్యాలిడ్ పాయింట్ అనుకోవచ్చు.. కాని క్వాలిటీ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గని రాజమౌళి, తీశాడు కాబట్టి, 300 కోట్లు పెడితే పెట్టొచ్చని అనుకోవచ్చు.. కాని ఒక విషయం ఆలోచించండి... త్రిబుల్ ఆర్ బడ్జెట్ తో వారణాసిలో కేవలం అంటే కేవలం ఒకే ఒక్క సీన్ తీశాడా? అంటేనే సినిలో ఇలాంటివి ఒక మూడు నాలుగుంటే, ఆలెక్కన ఇదినాలుగైదు త్రిబుల్ ఆర్ మూవీలతో సమానమా? కనీసం నాలుగు బాహుబలులంత బడ్జెట్ తో ఈ మూవీ వస్తున్నట్టా? అంతగా ఆ సీన్ లో ఏముంది? ఎందుకంట ఖర్చవుతోంది?
వారణాసి మూవీలో ఒకే ఒక్క సీన్ కి 300 కోట్లన్న వార్త వైరలైంది. 1359 కోట్ల బడ్జెట్ లో 300 కోట్లు కేవలం ఒకే ఒక్క సీన్ కోసం ఖర్చుచేశారనే వార్తే నిజమైతే, డైనెసార్ల భారీ సీన్ కోసం 500 కోట్లు ఖర్చుపెట్టారనే వార్త సంగతేంటి? విషయం ఏంటంటే, ఈ రెండు కూడా నిజాలే అని తెలుస్తోంది. బాహుబలి 2 ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్లని సీన్లంటే కూడా రెండే రెండు..అవే బాహుబలి 2 ఇంటర్వెల్ సీన్, అలానే బాహుబలి 2 క్లైమాక్స్ సీన్.. ఈరెండే బాహుబలి 2 ని 1850 కోట్ల వసూళ్లు సినిమాగా మార్చింది.. త్రిబుల్ ఆర్ లో కూడా ఇలాంటి సీన్లే పడ్డాయి.. హీరోలిద్దరి ఇంట్రడక్షన్ సీన్లతో పాటు, క్లైమాక్స్ లో రాముడిగా చరణ్ సీన్.. అలానే ఇంటర్వెల్ బ్యాంగ్ లో పులులు, చిరుతలతో ఎన్టీఆర్ ల్యాండ్ అయ్యే టెర్రిఫిక్ సీన్..
ఖచ్చితంగా రాజమౌళి సినిమా అంటే, ఇలా రోమాలు నిక్కబొడిచేసీన్లు తన సినిమాలో కనీసం రెండు భారీ ఎత్తునే ప్లాన్ చేసుకుంటాడు. అవి అయితే ఇంటర్వెల్ బ్యాంగ్ లోనో లేదంటే క్లైమాక్స్ లోనో కనిపించటం కామన్.. అలాంటి ఇంటర్వెల్ సీన్ కోసమే 300 కోట్లు ఖర్చుచేశారని తెలుస్తోంది. రామాయణ యుద్ధం గట్టం సీన్ 25 నిమిషాల నిడివి ఉంటుందని, దాని మేకింగ్ అలానే గ్రాఫిక్స్ కోసం అంత ఖర్చైంది. అంటే ఆ ఒక్క సీన్ బడ్జెట్ తో బాహుబలి రెండు భాగాలు, లేదంటే త్రిబుల్ ఆర్ మొత్తం మూవీ తీయొచ్చు..ఇదే షాకింగ్ న్యూస్ అంటే క్లైమాక్స్ లో డైనోసార్ల సీన్ కోసం 500 కోట్లు ఖర్చుచేస్తున్నట్టు ఎప్పడో బయటికొచ్చింది.
ఎక్కడా రాజమౌళి టీం ఈ వార్తను ఖండించలేదు.. సపోర్ట్ చేయలేదు. అందుకు అది కూడా నిజమనే అనుకునే పరిస్తితి ఉంది. త్రిబుల్ ఆర్ లో పులు సింహాలను వాడిన రాజమౌలి, వారణాసి లో ఏకంగా డైనోసార్లనే రంగంలోకి దింపుతున్నాడు.వారానాసి వరల్డ్ వైడ్ గా ఆడియన్స్ ని ఆకట్టుకోవాలంటే, డైనోసార్లే ఈజీవే అనుకొని కాదు... అలా కథ కుదిరిందని తెలుస్తోంది. మొత్తానికి డైనోసార్లతో హీరో ఫైట్ అంటే అతిలా అనిపించొచ్చు..కాని డైనోసార్లతో హీరో ఫైట్ చేస్తాడా? లేదంటే వాటి నేపథ్యంలో ఇంకెవరితోనైనా ఫైట్ చేస్తాడా తేలాలి.. కాని ఈ 30నిమిషాల క్లైమాక్స్ కి 500 కోట్లు, రామాయణం సీన్ కి 300 కోట్లు మొత్తంగా ఈ రెండు సీన్లకోసమే 800 కోట్లు ఖర్చవుతున్నాయట. ఇక మిగిలిన 549 కోట్లలో వందకోట్లు ప్రమోషన్ కి తీసేస్తే, రెమ్యూనరేషన్లు, మేకింగ్ ఖర్చులన్నీ 459 కోట్లలో కంప్లీట్ చేస్తారని తెలుస్తోంది.