"ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ గ్లోబల్ అడ్వెంచర్ 'వారణాసి' గురించి ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న ప్రియాంక చోప్రా తీసుకుంటున్న పారితోషికం వింటే ట్రేడ్ వర్గాలే షాక్ అవుతున్నాయి! రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న ఈ పాన్-వరల్డ్ మూవీలో ప్రియాంక చోప్రా 'మందాకిని' అనే కీలక పాత్రలో నటిస్తోంది. దాదాపు ఆరేళ్ల తర్వాత ఆమె ఇండియన్ స్క్రీన్ పైకి రీ-ఎంట్రీ ఇస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రియాంక చోప్రా ఈ సినిమా కోసం ఏకంగా 30 కోట్లు పారితోషికం డిమాండ్ చేసింది. ఇప్పటివరకు ఇండియన్ సినిమాల్లో దీపికా పదుకొణె కల్కి కోసం 20 కోట్లు), ఆలియా భట్ RRR కోసం 9 కోట్లు అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లుగా ఉండగా, ఇప్పుడు ప్రియాంక వారందరినీ వెనక్కి నెట్టి హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్ట్రెస్‌గా నిలిచింది.
ఆమెకి ఉన్న ఇంటర్నేషనల్ క్రేజ్ మరియు హాలీవుడ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు అంత పెద్ద మొత్తానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రియాంక ఒక ఆసక్తికర విషయం బయటపెట్టింది. రాజమౌళి ఈ పాత్ర కోసం ఆమెను అడిగినప్పుడు, ఆమె ఒకే ఒక కండిషన్ పెట్టిందట. "చాలా కాలంగా నేను ఇండియన్ సినిమాల్లో డ్యాన్స్ చేయలేదు, కాబట్టి ఈ సినిమాలో నాకు ఒక అదిరిపోయే డ్యాన్స్ నంబర్ ఉండాలి" అని కోరిందట. రాజమౌళి ఆమె కోరిక మేరకు మహేష్ బాబుతో కలిసి ఒక సెన్సేషనల్ సాంగ్ ని ప్లాన్ చేశాడు. ఇప్పటికే హైదరాబాద్ లో ఈ పాట షూటింగ్ కూడా పూర్తయిందని మహేష్ బాబు స్వయంగా కన్ఫర్మ్ చేశాడు.
ఇక్కడ విశేషం ఏంటంటే, ప్రియాంక 30 కోట్లు తీసుకుంటుంటే, మహేష్ బాబు మరియు రాజమౌళి మాత్రం ముందస్తుగా ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట.సినిమా 1,300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది కాబట్టి, సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే లాభాల్లో 40% వాటాను వీరు తీసుకోబోతున్నారు. అంటే సినిమా హిట్ అయితే వీరిద్దరికీ వందల కోట్లలో లాభం వచ్చే అవకాశం ఉంది. "మొత్తానికి 'వారణాసి'తో రాజమౌళి గ్లోబల్ బాక్సాఫీస్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మహేష్ బాబు 'రుద్ర'గా, ప్రియాంక చోప్రా 'మందాకిని'గా ఎలా మెప్పిస్తారో చూడాలంటే, ఏప్రిల్ 7, 2027 వరకు ఆగాల్సిందే.