వారణాసి మూవీ వరల్డ్ వైడ్ గా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అనగానే, ఆ వార్త వైరలైంది. తర్వాత ఇదంతా ఉత్తుత్తి వార్తే అన్న మాటల దాడి పెరిగింది. కట్ చేస్తే 42 వేల థియేటర్స్ లో హిందీ రామాయణం రిలీజ్ చేయబోతున్నారు. అందులో పాతిక వేల థియేటర్స్ చైనాలో బుక్ అవుతున్నాయి. ఇక్కడే వారణాసి టీం 55 వేల థియేటర్స్ లెక్క రియలిస్టిక్ గా అనిపిస్తోంది. నిజమే అని తెలుస్తోంది. ఒక ఇండియన్ మూవీ వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు 20 వేల థియేటర్స్ మించిరిలీజ్ కాలేదు. అందుకు డబుల్ నెంబర్ లో రామాయణం, అంతకంటే మరో 15 వేలు ఎక్కువగా థియేటర్స్ లో వారణాసి విడుదల కాబోతోంది... ఇది వరల్డ్ మార్కెట్ లో చిన్న విషయం కాదు. 40 వేల థియేటర్స్ లో ఏమాత్రం టాక్ కిక్ ఇచ్చినా 30 రోజుల్లో 10 వేల కోట్లు చాలా చిన్న టార్గెట్.. ఈ నెంబర్ అంతకు మించొచ్చు.. ఆలెక్కన 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యే వారణాసి పరస్థితేంటి? నిజంగా ఎక్కువ థియేటర్స్ లోరిలీజ్ చేసినంత మాత్రాన వరల్డ్ ఆడియన్స్ చూసేస్తారా? ఏనమ్మకంతో ఇన్ని థియేటర్స్ ని టార్గెట్ చేస్తున్నారు? మూడు సినిమాలో ఏ మూవీతో బాక్సాఫీస్ కి మూడేలా ఉంది.
వారణాసి 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అంటే అప్పట్లో అంత సీన్ లేదన్నారు. ఈమూవీ కాన్సెప్ట్ గ్లింప్స్ ని భారీ స్క్రీన్ లో రిలీజ్ చేస్తూ చేసిన ఈవెంట్ టైంలో , 55 వేల థియేటర్స్ లో వచ్చే సినిమా అంటే ఎవరూ నమ్మలేదు. కాని ఇప్పడు 55 వేల థియేటర్స్ లో కాదు, ఆ నెంబర్ 70 వేలకు పెంచే ప్రయత్నం జరుగుతోందంటే మాత్రం నమ్మాల్సి వస్తోంది.. అసలు రాజమౌళి ఏదో భూమి బద్దలయ్యేలా తుఫానే క్రియేట్ చేసేలా ఉన్నాడనే మాటే వినిపిస్తోంది.వరల్డ్ వైడ్ గా హిందీ మూవీ రామాయణమే 42 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతోందన్న వార్త వైరలయ్యాకే, వారణాసి 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అవుతుందన్న పాత వార్త నిజమని నమ్మే పరిస్థితి వచ్చింది. నిజానికి హిందీ రామాయణం మూవీని, హాలీవుడ్ సంస్త వార్నర్ బ్రదర్స్ తోపాటు చైనా ఫిల్మ్ గ్రూప్స్ సాయంతో భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.
వరల్డ్ ప్లాట్ ఫాంలో రామాగా, ఇండియన్ స్క్రీన్స్ మీద మాత్రం రామయణంగా రిలీజ్ కాబోతున్న ఈసినిమా, అమెరికాలో 4500 థియేటర్స్ లోరిలీజ్ కాబోతోంది. ఒక్కచైనాలో 20 వేల స్క్రీన్స్ దక్కించుకుంటోంది. ఇక యూరప్, కొరియా లాంటి దేశాల్లో 10 వేలకు పైనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతోంది. ఐమ్యాక్స్ స్క్రీన్స్ లో కూడా 60శాతం కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది. సో వరల్డ్ వైడ్ గా ఎలాంటి బ్రాండ్ ఇమేజ్ లేకున్నా, నితిష్ కుమార్, రణ్ బీర్ కపూరే ఇలా 42 వేల థియేటర్స్ మీద దాడి చేస్తే, రాజమౌళి ఇంకెంత చేయొచ్చు.
ఒకవైపు నెట్ ఫ్లిక్స్ తో బలమైన సంబంధాలు, వార్నర్ బ్రదర్స్ తోపాటు స్టీవెన్ స్పిల్ బర్గ్ సంస్త డ్రీమ్ వర్క్స్ తో మంచి రిలేషన్ షిప్ ఉంది. అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ సపోర్ట్ ఎలాగూ ఉంది. బాహుబలి, త్రిబుల్ ఆర్ తో జపాన్, రష్యా, జర్మనీ, అమెరికాలో మంచి బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ అయ్యింది. అందుకే 55 వేల థియేటర్స్ లో వారణాసి రావటం పెద్ద వింతేం కాదు.. అలానే 55 వేల థియేటర్స్ లో యావరేజ్ టాక్ తోవారణాసి వస్తేనే, మొదటి రోజే వెయ్యికోట్ల ఓపెనింగ్స్ రావొచ్చు..
ఫస్ట్ వీకెండ్ 3500 కోట్లు వసూళ్లు వచ్చే చాన్స్ ఉంది. ఇక మొదటి పదిరోజుల్లో కనీసం 12 వేల కోట్ల వరదొచ్చే అవకాశం ఉంది.ఇదంతా యావరేజ్ టాక్ కే.. అదే హిట్ టాక్ అయితే 20 వేల కోట్లు, 30 వేల కోట్లు లాంటి హాలీవుడ్ సినిమా కలెక్షన్స్ తాలూకు రికార్డుల నెంబర్స్ వినిపించేచాన్స్ఉంది. ఇలాంటి టైంలో ఏకంగా 55 వేల థియేటర్స్ ని కాస్త 70 వేల స్క్రీన్స్ గా మార్చే ప్రయత్నం జరుగుతోంది. వరల్డ్ వైడ్ గా ఉన్న దాదాపు 2 లక్షల థియేటర్స్ లో 70 వేల స్క్రీన్స్ అంటే, 40 శాతం వరకు ప్రపంచాన్ని ఈ సినిమా చుట్టేసినట్టే అవుతుంది. సినీ సునామి వస్తుంది.