5000 కోట్ల సునామీకోసం ఇప్పడు మూడు మూవీలు క్యూ కట్టాయి. ఎవరూ కూడా 2 వేల కోట్ల దంగల్ రికార్డుని లెక్కలోకి తీసుకోవట్లేదు. అలాని ఆ రికార్డుని ఇంతవరకు ఏ మూవీ బ్రేక్ చేయలేదు. బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేసే పనిలో ధురందర్ 2 ఉన్నా, అది 1850 కోట్ల రికార్డుని బ్రేక్ చేస్తుందో లేదో తేలాలంటే మరో వారం టైం పడుతుంది. ఐతే 5 వేల కోట్ల వసూళ్లే టార్గెట్ గా వారణాసి రాబోతోంది. అంతకుముందు 4 వేల కోట్ల రామాయనాన్ని 5 వేల కోట్ల కమర్శియల్ కావ్యంగా మార్చే పనిలో రణ్ బీర్ కపూర్ అండ్ కో ఉన్నారు. మధ్యలో స్పిరిట్ తో హిస్టరీ సెట్ చేసేందుకు సందీప్ రెడ్డి కూడా భారీ దండయాత్రనే ప్లాన్ చేస్తున్నాడు.. ఐతే వారనాసి టార్గెట్ పదివేలకోట్లయ్యుండొచ్చు.. కాని ముందు మాత్రం అందరి లక్ష్యం 5 వేల కోట్లు.. అది దాటినవాళ్లకే పదివేల కోట్ల పండగ.. ఇంతకి ఇంత ఖచ్చితంగా 5 వేల కోట్లు కొల్లగొడతామని ఎలా ఫిక్స్ అయ్యారు? ఆ నెంబర్ ఎందుకు పాన్ వరల్డ్ మార్కెట్ లో ఈ సినిమాల స్థాయి పెంచుతుందనే మాటలు వినిపిస్తున్నాయి... ? నిజంగా ఈ మూడు మూవీలకే ఈ స్థాయి ఉందని ఎలా నమ్ముతున్నారు?
100 కోట్ల వసూళ్లు ఒకప్పుడు చాల పెద్ద రికార్డు.. వెయ్యికోట్ల వసూళ్లంటే చాలా పెద్ద అత్యాశ... కట్ చేస్తే 1000 కోట్లు కామనైపోయాయి.. ఇప్పుడు 2 వేల కోట్లు అంతకంటే కామన్ గా మారబోతున్నాయా? అందరి టార్గెట్ 5 వేల కోట్లే... వారణాసి, రామాయణం, స్పిరిట్ ఇలా ఏ మూవీని చూసినా 5 వేలకోట్ల నెంబరే టార్గెట్ గా ముందడుగులు పడుతున్నాయి.1400 కోట్లు పెట్టిన వారణాసి వరల్డ్ వైడ్ గా 5 వేల కోట్ల మినిమమ్ టార్గెట్ గా పెట్టుకుంది. 10 వేల కోట్ల వసూళ్ల అంచనాలను అందుకుంటోంది. కట్ చేస్తే రాజమౌళికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ లేని నితిష్ తీవారి ఎకౌంట్ లో 2 వేల కోట్ల దంగల్ రికార్డు ఉంది. కాబట్టే రణ్ బీర్ కపూర్ తో తను తీస్తున్న రామాయణం మీద 5 వేల కోట్ల అంచనాలున్నాయి. 4 వేల కోట్లు రెండు బాగాలకు పెట్టుబడిగా పెడుతున్నారంటే, అందుకు డబుల్ పది వేలకోట్లు వచ్చి తీరాలి.
కాబట్టి ఈజ్ పార్ట్ కి 5 వేల కోట్లనేది నార్మల్ టార్గెట్. నిజంగా 500 కోట్ల వసూల్లని రీచ్ అవటానికి బాహుబలి వచ్చే వరకు వేయిట్ చేసిన బాలీవుడ్ కూడా, ఇప్పుడు 5 వేల కోట్ల ఆశలు పెట్టుకుంటోంది. రాజమౌళి అంటే, బాహులబలితో 500 కోట్లు, బాహుబలి 2 తో 1850 కోట్లు కొల్లగొట్టాడు. షోకి 12 కోట్ల మంది వెలితే, ఆతర్వాత 10 కోట్లు ఫుట్ ఫాల్స్ తో బాహుబలి 2 రికార్డు క్రియేట్చేసింది. అలాంటి రికార్డులు త్రిబుల్ ఆర్ తో గ్లోబల్ గుర్తింపు.. నాటు పాటకి ఆస్కార్.ఇవన్నీ రాజమౌళి సినిమాకు బ్రాండ్ ఇమేజ్ తెచ్చాయి. మార్కెట్ ని క్రియేట్ చేశాయి.. కాబట్టే 1850కోట్ల సునామీ తెచ్చిన వాడే, 5 వేల కోట్లు రాబడతాడంటే ఈజీగా నమ్మేస్తున్నారు.
వారణాసి లాంటి మైథాలజీ ప్లస్ సాహసాల మూవీకి 5 వేల కోట్ల వసూల్లు లెక్కే కాదనేంత కాఫ్ఫిడెన్స్ కనిపిస్తోంది. ఏమాత్రం వారణాసికి హిట్ టాక్ వచ్చినా, 5 వేల కోట్ల వసూళ్ల అంచనాలు కాస్త 10 వేలకోట్ల కు రీచ్ అవ్వొచ్చు.ఇక సందీప్ రెడ్డ వంగలాంటి దర్శకుడి మేకింగ్ లో ప్రభాస్ లాంటి కటౌట్ సినిమా అంటే, జస్ట్ యావరేజ్ టాక్ వస్తేనే రెండు మూడు వేల కోట్లొస్తాయి.. అలాంటిది హిట్ టాక్ వస్తే 5 వేలకోట్ల లెక్కలు వరల్డ్ మార్కెట్ లో పెద్ద విషయం కాదు. అసలు ఇండియన్ మార్కెట్ లోనే అంత ఎమౌంట్ రావొచ్చు కూడా.. ఏదేమైనా 5 వేల కోట్ల వసూల్లని చాలా నార్మల్ కలెక్షన్స్ గా మార్చేందుకు వారణాసి, రామాయణం, స్పిరిట్ తో పాటు డ్రాగన్ మూవీకూడా వచ్చేస్తోంది.