సూపర్ స్టార్ మహేశ్ బాబు వారణాసి విడుదలకు ముందే వండర్స్ చేసేలా ఉంది. ఆల్రెడీ గతంలో 1000 కోట్ల ఓటీటీ ఆఫర్ వచ్చిందన్నారు. దానికే దర్శక ధీరుడు రాజమౌలి ఒప్పుకోలేదు... అలా ఆ న్యూస్ నేషనల్ లెవల్లో హాట్ టాపిక్ అయ్యింది. కట్ చేస్తే, అందుకు డబుల్ అంటే అక్షరాల 2 వేల కోట్ల ఆఫర్ ని వారణాసి టీం ఎక్స్ పెక్ట్ చేస్తోందన్న మాట, తూటాలా దూసుకెళుతోంది. ఇంతవరకు రాజమౌళి ఫేట్ మార్చిన బాహుబలి 2నే 1850 కోట్లు రాబట్టింది. అంటే 2 వేల కోట్ల దంగల్ రికార్డుని ఎవరూ టచ్ చేయలేకపోయారు. అలాంటిది 1400 కోట్ల తన కొత్త సినిమా వారణాసికి 2 వేలకోట్ల ఆఫర్ ని ఎక్స్ పెక్ట్ చేయటం డెవినెట్ గా అత్యాశే.. ఎక్కడ కూడా ప్రాక్టికల్ గా అనిపించట్లేదు.. కాని టార్గెట్ అదే.. ఇందులో సగం ఇచ్చినా చాలంటోంది 4 వేలకోట్లు తగలేస్తున్న హిందీ సినిమా రామాయణం.. టీజర్ పేలుతూనే తూలటంతో వాళ్లు వారణాసిని చూపి వాతలు పెట్టుకుంటున్నారా?
వారణాసి ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉందా? ఈ డౌట్ కి హిందీ మూవీ రామాయణమే కారాణం. ఈ సినిమాకు ఓటీటీ డీల్ 700 కోట్లంటూ వార్తలు వైరలౌతున్నాయి. 700 కోట్ల డీల్ కి నితీన్ తీవారిటీం రెడీగా లేదని తెలుస్తోంది. కనీసం 1000 కోట్ల డీల్ అయితేనే ఒప్పుకుంటామంటోంది.. ఇక్కడే వారణాసి రేంజ్ పెరిగింది.ఎందుకంటే ఎగ్జాక్ట్ గా రెండు నెలల ముందు వారణాసి మూవీకి 1000 కోట్లఓటీటీ ఆఫర్ వచ్చింది. దానికి రాజమౌళి టీం సింపుల్ గా నో చెప్పేసింది. వీళ్లు దేనికైతే నో చెప్పారో, అదే 1000 కోట్ల డీల్ కి రామాయణం టీం ఓకే చెప్పేలా ఉంది. అందుకే వాళ్లు 700 కోట్ల ఓటీటీ డీల్ కి నో చెప్పారు.. అంటే వెయ్యికోట్లకంటే వారణాసి రేంజ్ ఎక్కువని రాజమౌలి ఫీల్ అవుతుంటే, రామాయణం టీం మాత్రం 700 కోట్లు వద్దు, వెయ్యికోట్లైతే బెటర్ అంటోంది.
అక్కడే వారణాసి మరో మెట్టు ఎక్కవని కాన్ఫిడెన్స్ లెవల్లోనే తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే వారనాసి 1400 కోట్ల తో తీస్తే, హిందీ రామాయణం రెండు భాగాలుగా తీస్తున్నా టోటల్ బడ్జెట్ 4000 కోట్లు.. అలాచూసినా వారణాసికంటే ఎక్కువ బడ్జెట్టే... కాని వారణాసికంటే తక్కువ ఓటీటీ డీల్ 700 కోట్లు ఆఫర్ వస్తే, 1000 కోట్లు కావాలంటున్నారు. అదే నెంబర్ ని వారణాసి టీం ఎప్పుడో రిజెక్ట్ చేసింది. ఏకంగా 2 వేల కోట్లకు వారనాసిటీం ప్రిపేర్ అవుతోంది. అందులో భాగంగానే వారణాసిని రెండు భాగాలుగా చేయబోతోందని తెలస్తోంది.ఒక భాగంగా వారణాసిని 4 గంటల డ్యూరేషన్ తో తీసి, నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేస్తున్న 1000 కోట్లను తీసుకోవటం కంటే, ఇదే మూవీని రెండు భాగాలుగా ప్లాన్ చేస్తే ఒక్కో భాగానికి 1000కోట్లు అంటే, రెండు కలిపి 2 వేల కోట్లు రాబట్టొచ్చు.. ఇది చాలా తెలివైన నిర్ణయం.. 4 గంటల సినిమా చూపించి, దీనికి 1000 కోట్లు కాదు, 2 వే లకోట్ల ఓటీటీ ఆఫర్ కావాలని కోరితే, ఓటీటీ సంస్థలు కూడా వెనకడుగు వేయొచ్చు.. ఇదే మూవీని రెండు భాగాలు చేసి, వాల్లు ఇచ్చిన 1000 కోట్ల ఓటీటీ డీల్ కి ఒప్పుకుంటే, రెండు భాగాలకు రెండు వేల కోట్లు ఇక్కడి నుంచేవస్తాయి.. అంటే 1400 కోట్ల బడ్జెట్ పోను, మరో 600కోట్ల లాభం, ఓటీటీ స్తాయిలోనే వచ్చినట్టు..
ఇక అన్ని భాషల శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ అదనం. ఇక థియేట్రికల్ రైట్స్ దీనికి డబుల్ ఉండొచ్చు.. ఇదే జరిగితే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రే రాజమౌళి తిరగరాసినట్టు.. ఎందుకంటే ఇంతవరకు దంగల్ రికార్డు 2 వేల కోట్ల వసూల్లని ఏ మూవీ బ్రేక్ చేయలేదు.. కాని ఆ రికార్డుని ఓటీటీ డీల్ లెవల్లోనే వారణాసి బ్రేక్ చేస్తే బాలీవుడ్ వెన్నలో వనుకు రావాల్సిందే.. అందుకే హిందీ రామాయణానికి 700 కోట్ల ఓటీటీ డీల్ రాగానే, ఆ సినిమా హైలెట్ అవ్వాల్సిందిపోయి, వారణాసి గొప్పతనం ఎలివేట్ అవుతోంది.. ఇది కదా కథలో సాలిడ్ ట్విస్ట్ అంటే.