సూపర్ స్టార్ మహేశ్ బాబు తన కెరీర్ లో ఒక్క సారి కుర్చీ ని మడత పెడితే, యూ ట్యూబ్ పేలిపోయింది. ఆ పాట తూటాలా వరల్డ్ వైడ్ గా వైరలైంది. భాషరాకున్నా, అర్ధం కాకున్నా, వేరే రాష్ట్రాల వాళ్లు, ఆఖరికి యూరోపియన్లు కూడా కుర్చీని మడత పెట్టారు.. కట్ చేస్తే మళ్లీ సూపర్ స్టార్ మహేశ్ బాబు కుర్చీ మడట పెట్టాల్సిన టైం వచ్చింది. ఆల్రెడీ కుర్చీ కాదు, కుర్చీల వరుసలనే ఆర్డర్ ఇచ్చాడు దర్శక ధీరుడు రాజమౌళి. వారణాసి కోసం ఇప్పటి వరకు భారీ సాహసలు చేసిన మహేశ్ బాబు, ఇప్పుడు రిలాక్స్ అవుతన్నాడు. కాకపోతే ఇంట్లోకాదు, సెట్లో డాన్స్ వేస్తూ... వారణాసిలో 9 పాటలుంటే, అన్నీ కూడా మాంటేజ్ సాంగ్సే... ఒక్కటి తప్ప.. ఆ ఒక్కటే ఇప్పుడు కాశీలో షూట్ చేస్తున్నారు. కొంత దేవర సెట్లో షూట్ చేస్తున్నారు.. అయితే ఆ పాటే వారణాసికి గుండెలాంటిది... మాస్ కుర్చీ మడతపెట్టే సాంగ్ అది... ఎందుకంటే ఇదే ఇందులో ఒకే ఒక్క డాన్స్ నెంబర్... అది కూడా లీక్ అవుతోందా?
సూపర్ స్టార్ కుర్చీ మడత పెడితే, గుంటూరు కారంలో త్రివిక్రమ్ చేసినతప్పులన్నీ క్షమించేశేలా చేశాయి.. వీక్ స్క్రిప్ట్ , ఆగం ఆగం దర్శకత్వం.. కాని గుంటూరు కారంలో మహేశ్ పెర్పామెన్స్, డైలాగ్ డెలివరి మాత్రం నెక్ట్స్ లెవల్... కేవలం కథాలోపాలు, సూపర్ స్టార్ లాంటి కటౌట్ కి సరిగ్గా వాడుకోలేదనే కంప్లైంట్లు తప్ప, ఓవరాల్ గా మాత్రం గుంటూరు కారం, అదిరింది..అన్నీంటికి మించి కుర్చీని మడతపెట్టేలా మహేశ్ బాబు ఫుల్ జోష్ తో ఇరగదీసిన స్టెప్స్ వైరలయ్యాయి... ఆ పాట అంతకంతకూ వైరలైంది. అదేంటో త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేశ్ బాబు ఏ మూవీ చేసినా, అందులో తన డైలాగ్ డెలివరి ఎప్పడూ స్పెషలే.. ఇక డాన్స్ నెంబర్స్ కూడా అదిరిపోతాయి.. ఈ ఒక్క విషయంలో త్రివిక్రమ్ కి మాత్రం మహేశ్ బాబు ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పాలి.
కట్ చేస్తే ఇప్పుడు గుంటూరు కారంలో మహేశ్ కుర్చీ మడతపెడితే.. ఇప్పడు కాశీలో కుర్చీ మడత పెట్టాల్సి వస్తోంది. వారణాసితో కూడా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాస్ స్టెప్స్ తో దుమ్ముదులపబోతున్నాడు. అందుకు కాశీనే అడ్డా అయ్యింది. ఎప్పుడో మెగా స్టార్ చిరంజీవి ఇంద్రకోసం కాశీలో డాన్స్ వేశాడు. భం భం బోలే అంటూ కాశీ నేల మీద తీన్ మార్ వేశాడు.ఎగ్జాక్ట్ లొకేషన్ లో ఇప్పుడు వారణాసి సాంగ్ షూట్ చేస్తోంది ఫిల్మ్ టీం. కొంత పార్ట్ దేవర కోసం వేసిన సెట్ లో బ్లూ మ్యాట్ సెట్ లో ఈ పాట షూట్ చేస్తున్నారు. ఇంకొంత పార్ట్ కాశీలోని రియల్ లొకేషన్ లో షూట్ చేస్తున్నారు. వీటి విజువల్సే బయటికి లీక్ .
అంటే వారణాసి లో ఇప్పటి వరకు రెండు పాటలు రిలీజ్ అయితే, ఆరెండూ కూడా మాంటేజ్ సాంగ్స్ ని తేలింది. మిగతా 6 పాటలు కూడా మాంటేజ్ సాంగ్సే అని తెలుస్తోంది. కేవలం వారణాసిలో డాన్స్ స్టెప్పులతోఇరగదీసే ఏకైక సాంగ్ ఇదేఅవటంతో, చాలా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారు. మరో నాటు నాటు లా ఈ పాట పేలుతుందా? సూపర్ స్టార్ గతంలో కుర్చీ మడతపెట్టినట్టై ఫ్లోర్ ఊగిపోతుందా ? అన్న అంచనాలతో సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఆ తర్వాత బ్రేక్ ఇస్తే మహేశ్, అండ్ కో ఫ్యామిలీతో వెకేషన్ కి వెలతారని తెలుస్తోంది. ఆ గ్యాప్ తర్వాత రెండు షెడ్యూల్స్ లో ఆగస్ట్ లోగా షూటింగ్ ని పూర్తి చేయబోతోంది ఫిల్మ్ టీం. ఇక అప్పటి నుంచే ప్రమోషన్ తో అసలు ఆట అప్పుడు మొదలౌతుంది.