వారణాసి 2 కన్ఫామ్… break తర్వాత shock…!

సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలా విషయాల్లో రాజమౌలిని గెలిచాడు.. దర్శక ధీరుడు చేతిలో పడితే ఏ హీరో పనైనా మటాషే అంటారు. బ్రేకులుండవు... పాస్ట్ పోర్ట్ సీజ్ చేస్తాడు.. ఓరకంగా ఏళ్లకేళ్లు సెట్ కే పరిమితమవ్వాల్సి వస్తుంది.

Post Published By: dialnews
Updated : 19 April 2026, 7:30 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబు చాలా విషయాల్లో రాజమౌలిని గెలిచాడు.. దర్శక ధీరుడు చేతిలో పడితే ఏ హీరో పనైనా మటాషే అంటారు. బ్రేకులుండవు... పాస్ట్ పోర్ట్ సీజ్ చేస్తాడు.. ఓరకంగా ఏళ్లకేళ్లు సెట్ కే పరిమితమవ్వాల్సి వస్తుంది... కాని ఇవేవి సూపర్ స్టార్ మహేశ్ బాబుకి వర్తించేలా లేవు... ఎందుకంటే ఇప్పుడు మరోసారి సమ్మర్ వెకేషన్ కి 30 రోజుల బ్రేక్ తీసుకుంటున్నాడు మహేశ్. వారణాసి మూడో సాంగ్ షూట్ తర్వాత లాంగ్ గ్యాప్ ఇవ్వబోతోంది ఫిల్మ్ టీం. ఆగస్ట్ లోగా షూటింగ్ పూర్తవటం పక్కా.. కాని ఈ లోపు ఇంత పెద్ద బ్రేక్ తో ఫిల్మ్ టీం వెకేషన్ ప్లాన్ చేసుకోవటం కూడా కన్ఫామ్ అయ్యింది. ఇంతకి ఈ బ్రేక్ తర్వాత మహేశ్ బాబు ఎప్పుడు మళ్లీ వారణాసి షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. నెక్ట్స్ షెడ్యూల్ లో డైనోసార్ సాహసాల సీన్లు నిజంగా తెరకెక్కబోతున్నాయా? ఇంతకి డైనోసార్లకు వారణాసికి ఉన్న లింకేంటి?

వారణాసి రెండో భాగం ఉంటుందా? లేదా? ఆమధ్య రెండు భాగాలన్నారు. తర్వాత 4 గంటల ఒకే సినిమా అన్నాడు రాజమౌలి. కట్ చేస్తే రెండు భాగాలుగా వస్తే తప్ప ఒక భాగంగా తీయటం సాధ్యం కాదని రీసెంట్ గా ప్రచారం జరిగింది. ఇలాంటి ఐటంలో ఒక మాస్ నెంబర్ సాంగ్ షూటింగ్ తో బిజీ అయినా వారణాసి టీం, వచ్చేనెల మే 1 కి బ్రేక్ ఇచ్చేస్తోంది.మేడే నుంచి కనీసం 30నుంచి 35 రోజులు వారణాసి షూటింగ్ కి బ్రేక్... సూపర్ స్టార్ మహేవ్ బాబు తన ఫ్యామిలీతో వెనీస్ కి వెకేషన్ ప్లాన్ చేశాడు. రాజమౌళి అండ్ కో కూడా వెకేషన్ కి యూరప్ ట్రిప్ కి వెళ్లబోతున్నారు. ప్రియాంక చోప్రా ఎలాగూ యూఎస్ కే రిటర్న్ అవుతుంది... ఇదే ఇప్పుడు షాకింగ్ అంశం... మరీ 30రోజుల బ్రేకా? పాన్ వరల్డ్ మూవీ చేస్తూ ఇలా మాటి మాటికి బ్రేకులు, ఫ్యామిలీలతో స్టార్లు వెకేషన్లు ఎలా వెళ్లగలుగుతున్నారు.

రాజమౌళితో ఏ హీరో సినిమా చేసినా, సెట్ లో స్లేవ్ గా ఉండిపోవాల్సిందే అనేవాళ్లు.. కాని వారణాసి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మహేశ్ బాబు తన ఫ్యామిలీ తో కనీసం అరడజన్ కి పైనే వెకేషన్లకు వెల్లిఉండొచ్చు.. ఇప్పుడు మళ్లీ 30రోజుల బ్రేక్ కి ఫ్యామిలీతో విదేశాల్లో సేద తీరబోతున్నాడు.. అలా కలి సొచ్చిందా? లేదంటే మహేశ్ బాబు దారిలోకే రాజమౌళి వెళ్లాల్సి వచ్చిందా?ఈ డౌట్లు పక్కన పెడితే, వారణాసి రెండు భాగాల విషయం జూన్ ఫస్ట్ వీక్ తేలే ఛాన్స్ఉంది. ఒక భాగంగా తీస్తే అన్నిరకాలుగా గిట్టుబాటు కాకపోవటమే కాదు... కథ పరంగా కూడా లెంథీ మూవీని కట్ చేసి, తగ్గించి చూపించినట్టౌతుందనే అభిప్రాయముంది.. అందుకే వారణాసి గ్లోబ్ ట్రాటర్, టైం ట్రాటర్ గా విడగొట్టి రిలీజ్ చేస్తారనే విషయాన్ని ఆఫ్టర్ ద బ్రేక్ రివీల్ చేయబోతున్నారు.

మే ఎండాకాలం సెలవులని వారణాసి టీం ఎంజాయ్ చేశాక, జూన్ ఫస్ట్ వీక్ నుంచి మరో షెడ్యూల్ మొదలౌతుంది. సాంగ్ షూటింగ్ తర్వాత మొదలయ్యేది డైనోసార్లతో హీరో హాససాలు.. వారణాసిలో కొన్ని గుడుల మీద డైనోసార్ల శిలలు కనిపిస్తాయి... డైనోసార్ల కాలంలో మనిషే లేడు.. అలాంటప్పుడు అవెలా, 4 వేల ఏల్ల క్రితం కట్టిన గుడి మీద శిలల రూపంలో ఉన్నాయి...దాని సీక్రెటే వారణాసిలో చూడబోతున్నాం... టైం ట్రావెల్ ఇప్పటిదికాదనే కోణంలో కథ ఉండబోతోందట. డైనోసార్ల సినిమాలెన్నో చూడొచ్చు కాని, డైనోసార్ మీద స్వారి చేసిన హీరోగా మహేశ్ కి హిస్టరీ క్రియేట్ కాబోతోంది. జూన్ నుంచి ప్రీక్లైమాక్స్ సీన్స్ షూటింగ్ మొదలైకాబోతోంది. ఆగస్ట్ లోగా షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది.

Published : 
  • 19 April 2026, 7:30 PM IST