OTT 1000కోట్లు.. థియేటర్స్ 5000కోట్లు.. 50 కోట్ల అడుగులు..?

వారణాసి వరల్డ్ వైడ్ గా రిలీజై ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో కాని, ఓటీటీ రైట్స్ 1000 కోట్ల అన్న మాటతో, హిస్టరీనే క్రియేట్ అవుతోంది.

Post Published By: dialnews
Updated : 13 February 2026, 4:30 PM IST

వారణాసి వరల్డ్ వైడ్ గా రిలీజై ఎన్ని రికార్డులు బ్రేక్ చేస్తుందో కాని, ఓటీటీ రైట్స్ 1000 కోట్ల అన్న మాటతో, హిస్టరీనే క్రియేట్ అవుతోంది. ఐతే ఇప్పడు ఓటీటీ హక్కులకే 1000 కోట్లన్న మాట సెన్సేషన్ అవుతున్న వేల, థియేట్రికల్ రైట్స్ అంతకుమించి సెన్సేషన్ అయ్యేలా ఉన్నాయి. ఎంతుకంటే, గంపగుత్తగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ తాలూకు డీల్ ఓకే అయినట్టే కనిపిస్తోంది. ఎలాగైతే బాహుబలి రిలీజ్ టైంలో మార్కెటింగ్ స్ట్రాటజీ ఫాలో అయ్యాడో, అచ్చంగా అదే ప్లానింగ్ తో మైండ్ బ్లాంక్ చేస్తున్నాడు రాజమౌలి. రిలీజ్ కి 14 నెలల ముందే సగం పైనే ప్రీరిలీజ్ బిజినెస్ అయిపోయేలా చేస్తున్నాడు. మిగతాది ట్రైలర్ వచ్చాక జరగొచ్చు. అంటే మరో నాలుగు నెలల తర్వాత మిగతా 50 పర్సెంట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగేలా ఉంది. విచిత్రం ఏంటంటే సగం ప్రీరిలీజ్ బిజినెస్సే 5 వేల కోట్లను రీచ్ అయ్యింది. అంటే రిలీజ్ అయ్యాక పదివేలకోట్ల వసూళ్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేయటం కాదు, ప్రీరిలీజ్ బిజినెస్ తోనే పదివేలకోట్ల హిస్టరీని వారణాసి క్రియేట్ చేయబోతోందా? ఇది నిజంగా నిజమేనా?

వారణాసి మూవీ ఓటీటీ రైట్స్ 1000 కోట్లంటే అంతా నోరెళ్లబెట్టారు. ఉగాదికి అఫీషియల్ స్టేట్ మెంట్ ఫిల్మ్ టీం తో పాటు, నెట్ ఫ్లిక్స్ నుంచి కూడా రావొచ్చని తెలుస్తోంది. ఐతే ఇక్కడ ప్రశ్న అది కాదు... ఓటీటీ రైట్సే ఏకంగా 1000 కోట్లు పలికితే, ఇక థియేట్రికల్ రిలీజ్ కి ఎన్ని కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ అవుతుందనే ప్రశ్నకి మైండ్ బ్లాక్ అయ్యే సమాధానం దొరుకుతోందివారణాసి ఇంకా రిలీజ్ అవటానికి 14 నెలలకు పైనే టైం ఉంది. ఈలోపు ప్రమోషన్ లో ఎమోషన్ పెంచుతూనే, మరో వైపు షూటింగ్ కంటిన్యూ చేస్తున్నాడు రాజమౌళి. ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ తో ఓటీటీ డీల్ ఓకే అయినట్టుంది. ఇక ఈలోపే థియేట్రికల్ రైట్స్ ని సేల్ చేసేందుకు రంగం సిద్దమైనట్టుంది. ఇండియన్ ఫిల్మ్ ఇండ్ట్రీలో భూకంపం స్రుస్టించేంత పెద్ద నెంబరే వారణాసి థియేట్రికల్ బిజినెస్ కి దక్కేలా ఉంది.

ఆల్రెడీ కాన్సెప్ట్ గ్లిప్స్, పాటలతో ఈ మూవీ మీద ఇండియాలో భారీగా హైప్ క్రియేట్ అయ్యింది. వరల్డ్ ఆడియన్స్ అటెన్షన్ కోసం హాలీవుడ్ రిపోర్టర్లను రంగంలోకి దింపటం కూడా మొదలు పెట్టాడు రాజమౌలి. కాబట్టి భారీ అంచనాలున్న ఈసినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ కూడా మతిపోగొట్టే నెంబర్స్ తో జరొగొచ్చంటున్నారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం, ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ని 50శాతం వరకు సేల్ చేసినట్టే కనిపిస్తోంది.గత డిస్ట్రిబ్యూటర్లు, రాజమౌళి మీద నమ్మకం ఉన్న బ్యాచ్ ఆల్రెడీ ఈ సినిమా రైట్స్ని కనేశారట. నార్థ్ ఇండియా, తెలుగు, తమిళ నాడు, కర్ణాటక రైట్స్ సేల్ అయ్యాయి.. ఇక ఇది ఓవర్ సీస్ లా కాకుండా, వరల్డ్ సినిమా లా ప్రపంచ మార్కెట్ లోకి వెళుతోంది. కాబట్టి యూఎస్ కి, కెనెడా, ఆస్ట్రేలియా, యూరప్, ఆఫ్రికా, సౌత్ ఆసియా ఇలా ఒక్కో ఏరియా రైట్స్ కూడా సేల్ అవ్వాలి...

కాకపోతే అవి థియేట్రికల్ ట్రైలర్ వచ్చాక డీల్స్ జరగొచ్చు. మన సినిమా గురించి తెలియని మార్కెట్లో మూవీని ముందే సేల్ చేయాలంటే ఖచ్చితంగా ట్రైలర్ వచ్చి తీరాలి... కాబట్టఈలోపు 50శాతం ఏరియాల రైట్స్ ని సేల్ చేస్తూ 5000 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తి చేసినట్టుంది వారణాసి టీం. అంటే సగం ప్రీరిలీజ్ బిజినెస్సే దంగల్ ఆల్ టైం రికార్డ్ వసూల్లైన 2000 కోట్లకి డబుల్ కి మించి ఉంటే, ఇక వంద శాతం ప్రీరిలీజ్ బిజినెస్ పూర్తైతే ఏంటి పరిస్తితి..అక్కడే 10 వేల కోట్ల మాట వినిపిస్తోంది. 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్న వారణాసి ప్రిరిలీజ్ బిజనెస్సే 10 వేల కోట్లు దాటొచ్చని, ఏమాత్రం టాక్ బాగున్నా, ఆ నెంబర్ 15 వేలకోట్ల నుంచి 20 వేల కోట్ల వరకు బాక్సాఫీస్ లో రాబట్టొచ్చనే అంచనాలున్నాయి. వన్స్ ఓటీటీ రైట్స్ డీల్ అఫీషియల్ గా ఎనౌన్స్ అయ్యాక, మిగతా డీల్స్ మీద కూడా అఫీషియల్ స్టేట్ మెంట్స్ ఇచ్చి, మరింత హైప్ పెంచే అప్రోచ్ కి సిద్దమయ్యాడట రాజమౌళి.

Published : 
  • 13 February 2026, 4:30 PM IST