రాజమౌళి డైరెక్షన్ లో మహేవ్ బాబు సినిమా మొదలైనప్పటి నుంచి అన్ని షాకులే తప్ప, సాఫీగా వచ్చే అప్ డేట్స్ లేవు.. ఇప్పుడు ఏకంగా రాజమౌలినే రంగంలోకి దిగి, అక్కడెక్కడో మెక్సికో జనాలకు మన వారణాసి టీజర్ చూపించేశాడు. మొన్నటి వరకు ఎక్స్ క్లూజివ్ గా వారణాసి విజువల్స్ ని మెక్సికో కామిక్స్ కాన్ లో ప్రదర్శిస్తారని ప్రచారం జరిగింది. తీరా చూస్తే సీన్ లోకి రాజమౌళి ఎంట్రీ ఇచ్చాడు. వారణాసి టీజర్ పేల్చాడు.. ఇది కనీసం గ్లింప్స్ కూడా కాదు.. ఏకంగా టీజర్... విచిత్రంఏంటంటే, టీజర్ విజువల్స్ బయటికి లీక్ కాకుండా రాజమౌలి టీం తీసుకున్న జాగ్రత్తలు మైండ్ బ్లాంక్ చేస్తున్నాయి... అదేంటో టీజర్ వేస్తారు.. అక్కడి జనాలకు చూపిస్తారు.. బయటికి రాకుండా ఆపేస్తారు.. ఎందుకుమెక్సికన్స్ కే ఈ స్పెషల్ బంపర్ ఆఫర్... ఇండియన్స్ కి వారణాసి వరాలు ఉండవా?
వారణాసి సినిమా ఎంత పాన్ వరల్డ్ మూవీ అయితే మాత్రం, ఇండియన్స్ మరీ ముఖ్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ రాజమౌళి ద్రుస్టిలో లెక్కకు రారా? ఎందుకని మెక్సికో జనాలకే వారణాసి ప్రివ్యూ వేసిచూపిస్తున్నాడు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు.. అంతలోనే ప్రివ్యూ అంటే అర్ధం ఉండదు.. కాని ఈ సినిమా టీజర్ ని, అలానే ఈమూవీ బిహైండ్ ద సీన్స్ అంటే, షూటింగ్ ఫుటేజ్ ని కూడా చూపించారని తెలుస్తోంది.ఇక్కడే కాదు, నెక్ట్స్ జర్మనీలో వారణాసి టీజర్ పేలబోతోంది. ఆతర్వాత కట్ చేస్తే కొరియాలో, ఆవెంటనే ఇటలీలో ఇది ఇప్పుడు లీకైన ప్రమోషన్ స్ట్రాటజీ.. ఇండియా తప్ప ప్రపంచ దేశాల్లోని చాలా వేదికల్లో వారణాసీ టీజర్ ని ఇలానే రివీల్ చేస్తారు.. రిలీజ్ చేస్తారు.. కాని అందులో ఒక్క ఫ్రేమ్ కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడతారు? అదేంటో చూడండని అదేదో దేశంలో జరిగే ఫిల్మ్ ఫెస్టివల్ లో రిలీజ్ చేస్తారు.. కాని ఆ టీజర్ విజువల్స్ ఇండియన్స్ మాత్రం చూడొద్దంటే ఎలా?
ఇదేం ప్రమోషనల్ స్ట్రాటజీ... అక్కడే రాజమౌళి విశ్వముదురుగా ఫోకస్ అవుతున్నాడు. వారణాసి మీద ఇండియాలో ప్రమోట్ చేయకున్నా, హైప్ వస్తుంది.. కాని నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, లాటిన్ అమెరికన్ కంట్రీస్,యూరప్. సౌత్ ఏసియా, ఆఫ్రికా దేశాల్లో ఈ సినిమా మీద హైప్ పెరగాలంటే, అక్కడ జరిగే ఫిల్మ్ ఫెస్టివలే దిక్కు.. అందుకే అక్కడ టీజర్ ని టెలికాస్ట్ చేస్తున్నారు.. మూవీ మేకింగ్ వీడియోలు, గ్రాఫిక్స్ కోసం టీం పడే కష్టాలు చూపిస్తున్నారు.అలా అయితే, ఇక్కడ భారతీయులకు కూడా టీజర్ వేసి బొమ్మ చూపించొచ్చు కదా, అన్న డౌట్ రావటం కామన్. కాని విదేశాల్లో ఇలా టీజర్ వచ్చి, దాని మీద అక్కడ హైప్ పెరిగితే, ఇండియాలో ఈ సినిమామీద క్యూరియాసిటి వందలు , వేలరెట్లు పెరుగుతుంది. అలాంటి టైంలో టీజర్ ని ఇక్కడ లాంచ్ చేస్తే, దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది.
అలా చేసేందుకే ఆగస్ట్ 15 వరకు వారణాసి టీజర్ ని ఇండియాలో తప్ప, వరల్డ్ వైడ్ గా మెక్సికోతోపాటు చాలా ఫిల్మ్ ఫెస్టివల్లో టెలికాస్ట్ చేయబోతున్నారు. కేవలం సినిమా ఎక్స్ పర్ట్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఫిల్మ్ మేకర్స్ కోసం మాత్రమే పావుగంట షో వేసి, అందులో రెండు నిమిషాల వారణాసి టీజర్, 5 నిమిషాల వరకు మేకింగ్ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు.. ఇక కనీసం ఐదు నిమిషాల వరకు మూవీ మీద దర్శక నిర్మాతల మాటలు వినిపించి, ఆతర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ రన్ చేస్తున్నారు.. ఇది మొత్తంగా మెక్సికోలో మాత్రమే ఎందుకు వారణాసి టీజర్ వచ్చింది.. ఇక్కడెందుకు ఫిల్మ్ టీం టీజర్ ని రివీల్ కాకుండా జాగ్రత్త పడుతుందనటానికి రీజన్.