1400 కోట్ల భారీ బడ్జెట్ మూవీ వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ లో రాబోతోంది. వరల్డ్ వైడ్ గా 120 దేశాల్లో 100 కోట్ల మంది ని రీచ్ అయ్యేలా 30 భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.. సో సినిమా పాన్ వరల్డ్ మార్కెట్ ని షేక్ చేస్తే, భారతీయులందరు గర్వించాల్సిందే.. అలాంటి సినిమా మీద బురద చల్లటం మొదలైందా? మెక్సికోలో ఈ సినిమా ప్రమోషన్ కోసం రాజమౌళి వెళితే, ఖాలీ కుర్చీలు, కర్సైపోయిన 1400 కోట్లంటూ పుకార్లు పెంచారు. నిజంగా విజువల్స్ చూస్తుంటే, మెక్సికోలో వారణాసికి జీరో సపోర్టా అంటే అలాంటిదేం కనిపించట్లేదు. చూసే కోణం, చూపించే విషపు ద్రుక్కోనం అలా ఉంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు.. సినిమా రిలీజయ్యాక బాలేదంటే పర్లేదు.. అసలు అందులో ఏముందో తేలకముందే, బురద చల్లుతున్నారా? మెక్సికో లో వారణాసి ప్రమోషన్ ని డైల్యూట్ చేసేందుకు, వీడియోని కూడా వక్రీకరిస్తున్నారా? అసలు నిజం ఏంటి? ఈ మెక్సికో గోలేంటి?
సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమావస్తోందంటే, తన మీద యాంటీ ఫ్యాన్స్ బురద చల్లటం కామన్. ఇది ఎన్టీఆర్, ప్రభాస్ లకు కూడా కామన్ ఎఫెక్టే.. కౌంటర్ గా వీళ్ల ఫ్యాన్స్ ఎంత ఎటాక్ చేసినా, ఇవి వీళ్ల మూవీలు రిలీజ్ కి ముందు జరిగే తంతే.. పనికట్టుకుని ఇప్పుడు అలా మహేశ్ బాబు వారనాసి సినిమా మీద బురద చల్లుతున్నారు. అలాంటి ఇలాంటి బురద కాదు.. చాలా కాస్ట్ లీ బురదే చల్లుతున్నారు. సోషల్ మీడియాలో విషప్రచారం ఎలా ఉందంటే, అదిగో పులి అంటే ఇదుగో తోక అన్నంత సీరియగ్ గా రూమర్లు క్రియేట్ చేస్తున్నారు.ఇంతకి అసలు స్టోరీ ఏంటి? వారణాసి మూవీ ప్రమోషన్ లో భాగంగా మెక్సికో లో జరిగే కామిక్స్ కాన్ ఫెస్టివల్లో ఈ సినిమా విజువల్స్ కి అక్కడ ప్లే చేశారు. ఎక్స్ క్లూజివ్ విజువల్స్ అంటే, పరోక్షంగా వారణాసి అన్ ఎడిటెడ్ టీజరే అని తెలుస్తోంది. అంతేకాదు వారణాసి మేకింగ్ విజువల్స్, సెట్ కాస్ట్యూమ్ విజువల్స్, గ్రాఫిక్స్ టీం ఎలా కష్టపడుతోంది.
ఇలా మొత్తంగా వారణాసి బిహైండ్ ద సినిమా విజువ్స్ మెక్సికో కామిక్స్ కాన్ లో అక్కడి జనానికి చూిపస్తున్నారు.ఇక్కడ సమస్య ఏంటంటే, వారణాసి టీజర్ తో పాటు, బిహైండ్ ద సీన్స్ వీడియోలని స్క్రీన్ మీద టెలికాస్ట్ చేస్తున్నప్పుడు, ఆ థియేటర్ అంతా ఖాలీగా ఉందన్న ఫోటోలు, వీడియోలు బయటికొచ్చాయి... అవి చూసిన వాళ్లెవరికైనా, నిజమేకదా, థియేటర్స్ లో దోమలు, ఈగలు తప్ప జనాలులేరనిపించటం ఖాయం.. కాని రియాలిటీ వేరు. ఈ వీడియోలో చూపిస్తోంది వేరు.ఇక్కడ వారనాసి బీహైండ్ ద సినిమా వీడియోస్ వేస్తున్నప్పుడు ఫస్ట్ కొన్ని వరుసలో జనాలు లేరు. కేవలం పది వరుసలు వదిలేశాకే, ఆ పైనుంచి జనాలను అలో చేశఆరు. అంటే, ముందు కొన్ని వరుసల వరకు కుర్చీలను వదిలేసి, ఎవరూ కూర్చోకుండా చేసి, ఆపైనుండే కుర్చీలోంచే జనాలు కూర్చుని చూసేలా చేశారు. కారణం విజిబిలిటీ కోసం...ఒకవేల ముందు వరసలో కూడా జనాలుంటే, వాల్లు నిలుచుంటే అనవసరపు రచ్చని అలా చేశారట.
విచిత్రం ఏంటంటే, థియేటర్ కాలీగా ఉందని చూపించేందుకు ఎవరైతే సెల్ ఫోన్ లో వీడియోలు తీశారో, వాళ్లు కూర్చుంది కూడా ఆ ఖాలీ కుర్చీల వెనకే.. సో ఇలా వారణాసి మీద బురద చల్లటానికి, తప్పుడు కోణంలో లేంది ఉన్నట్టు చూపించే ప్రయత్నం జరుగుతోందని తేలిపోయింది. ఐనా వారణాసి పాన్ వరల్డ్ ట్రెండ్ సెట్ చేసే మూవీగా వస్తున్నప్పుడు, గర్వపడాల్సింది పోయి, మహేశ్ బాబుని టార్గెట్ చేయాలని, యాంటీ ఫ్యాన్స్ ఇలా చేయటం ఏంటనే కౌంటర్లు, కామెంట్లు పెరుగుతున్నాయి... ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ వీడియోలో కూడా వారణాసి మేకింగ్ విజువల్స్ తప్ప, టీజర్ తాలూకు సింగిల్ ఫ్రేమ్ కూడా లీక్ కాలేదు..కనీసం ఇలా అయినా వారనాసి టీజర్ లో ఏముందో చూద్దమనుకున్న బ్యాచ్ కి కూడా నిరాశే ఎదురైంది.. ఇది పెద్ద విచిత్రం.