వారాణాసి మూవీ, ఒకటికాదు రెండు కాదు 5 వేల కోట్ల నుంచి 10 వేలకోట్ల వసూళ్లు రాబడుతుందనే అంచనాల భారం మోస్తున్నసినిమా. 1400 కోట్ల పెట్టుబడి 10 వేల కోట్ల రాబడిగా మారాలంటే అదేం అంత ఈజీకాదు. ఇండియాతో పాటు ఫారన్ లో సెటిలైన ఇండియన్స్ చూస్తే 10 వేల కోట్లు వచ్చే చాన్స్ లేదు. అందుకోసం ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా నాలుగు నాటుబాంబులు సిద్దం చేసింది ఫిల్మ్ టీం.. వాటినే రాజమౌళి ఇప్పుడు అమెరికా, యూరప్, బ్రేజిల్, చైనాలో నాటేస్తున్నాడు. నాటు నాటు పాటతో మొదలైన గ్లోబల్ జర్నీ, వారణాసితో పీక్స్ కి చేరబోతోంది. ఇంతకి అమెరికా లోని తెల్లోల్లతో పాటు చైనీస్, బ్రెజీలియన్సు, అలానే యూరోపియన్స్ ని వారణాసి టీం ఎలా బుట్టలో వేసుకుంటోంది. ఈ నాలుగు ఏరియాలనే ఎందుకు టార్గెట్ చేసుకుంది?
త్రిబుల్ ఆర్ లో ఒక్క నాటు బాంబు పేలితే, గ్లోబ్ షేక్ అయ్యింది. ఆస్కార్ దక్కింది. ఆ గుర్తింపుని వాడుకుని, వారణాసిని వరల్డ్ వైడ్ గా సేల్ చేసేందుకు రాజమౌలి గ్లోబల్ స్కెచ్చే వేశాడు. అది కూడా వర్కవుట్ అయ్యేలా ఉంది. బాహుబలితో ఎలాగైతే కొత్త మార్కెట్ గేట్లు తెరిచాడో... అచ్చంగా అలానే వరల్డ్ వైడ్ గా వారణాసి దూసుకెళ్లేందుకు సరికొత్త మార్కెట్ గేట్లు బద్దలు కొట్టేలా ఉన్నాడు.వారణాసి నాలుగంటే నాలుగు నాటుబాంబులని నాటబోతోంది. ఒకటి అమెరికాలో, రెండు యూరప్ లో మూడు చైనాలో, నాలుగు ఎవరూ ఊహించని ప్రాంతం బ్రేజిల్.. అమెరికన్స్ కి ఇండియన్ మూవీస్ కొత్తకాదు.. యూరోపియన్స్ కి కూడా.. కాకపోతే వాళ్లు ఇంగ్లీష్ మూవీస్ చూసినట్టు ఒక ఇండియన్ సినిమాని చూపించాలంటే, కంటెంట్ లో హాలీవుడ్ మూవీల స్తాయిని అందుకోవాలి.
అందుకోసం, ఐమ్యాక్స్ కెమెరాతో షూటింగ్, భారీ గ్రాఫిక్స్, ఇండియానాజోన్స్ లాంటి పాత్రలు , ఏడువింతలున్నప్రాంతాల్లో షూటింగ్ ఇలా చాలా విశేషాలతో కథని నింపేస్తున్నాడు రాజమౌలి. ఐతే నాలుగంటే నాలుగు ఏరియాల్లో వారణాసి దూసుకెలితే చాలు, పాన్ వరల్డ్ గేట్లని రాజమౌలి, మహేశ్ బాబు కలిసి బద్దలుకొట్టినట్టౌతుంది.. అందులో మొదటి టార్గెట్ అమెరికా.. అక్కడ ఇంగ్లీష్ లో సినిమా ఆడియతే, కెనెడా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో పాటు వరల్డ్ వైడ్ గా వారణాసి రేంజ్ మారిపోతుంది.ఇక యూరప్ లో మన సినిమా వాళ్లకు బొమ్మ కనబడేలా చేస్తే, 33 దేశాల్లో 14 వేల థియేటర్స్ లో బాక్సాఫీస్ బద్దలౌతుంది.. మనకు కొత్త మార్కెట్ గేట్లు తెరుచుకున్నట్టౌతుంది. ఇక చైనా లో హిందీ సినిమాలకున్నంత డిమాండ్, మన మూవీలకు లేదు.
అదే బాహుబలి, త్రిబుల్ ఆర్ తో బ్రేక్ చేసే ప్రయత్నం జరిగింది. కాని వారనాసితో అంతకుమించేలా ప్రయత్నం చేస్తున్నారు. 80 వేల థియేటర్స్ చైన్ ఉన్న దేశంలో మన కుమార్కెట్ ఒక్కసారి ఓపెన్ అయితే, ఇక రాజమౌళి సినిమాలన్నీంటికి వేల థియేటర్లు అక్కడ వెల్ కమ్ చెప్పినట్టౌతుంది.ఇక ఈ లిస్ట్ లోలేని ఎవరూ ఊహించని మరో మార్కెట్ బ్రేజిల్.. అక్కడ థియేటర్స్ తక్కువే కావొచ్చు.. కాని లాటిన్ అమెరికా దేశాల్లో మనకు కొత్త మార్కెట్ గేట్లు తెరుచుకోవాలంటే బ్రేజిల్ లో మన బొమ్మ అదిరిపోవాలి.. అలా అయితే మెక్సికోలో కూడా మన సినీమాలు సునామీలు క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ లో ఎలాగూ రాజమౌలి ఫోకస్ చేశాడు. 120 దేశాలు, 100 కోట్ల మంది ఆడియన్స్ ని టార్గెట్ చేసి 30భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్న రాజమౌళి, అంతా అనుకున్నట్టు చేస్తే, ఇంతవరకు చైనీస్, జపనీస్, యూరోపియన్స్ కూడా చేయలేని పని చేసినవాడౌతాడు... హిస్టరీ క్రియేట్ చేసిన వాడౌతాడు.