జూన్ 26 FINISH.. సూపర్ సర్ ప్రైజ్…!

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి విడుదల... త్వరలోనే తను పూర్తి స్వాతంత్రుడు కాబోతున్నాడు.. ఎవరినుంచంటే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ రాజమౌలి..

Post Published By: dialnews
Updated : 14 February 2026, 4:45 PM IST

సూపర్ స్టార్ మహేశ్ బాబుకి విడుదల... త్వరలోనే తను పూర్తి స్వాతంత్రుడు కాబోతున్నాడు.. ఎవరినుంచంటే మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ రాజమౌలి...ఔను తన చెరలోంచి బయటపడేందుకు టైం వచ్చింది. జూన్ కి ముహుర్తం కుదిరినట్టుంది. 1300 కోట్ల నుంచి అన్ లిమిటెడ్ వరకు బడ్జెట్ పెంచుకుంటూపోతున్న వారణాసి మూవీ షూటింగ్ జూన్ లో ఫినిష్ కాబోతోంది. ఇదే విషయం రాజమౌలి తేల్చాడు. ఆల్రెడీ వారణాసి మూవీ 50శాతనికి పైగా పూర్తైందనికూడా అన్నాడు. ఇక ఈనెల నుంచి జూన్ ఎండ్ వరకు పెండింగ్ 50శాతం షూటింగ్ పూర్తి చేస్తారట. క్లైమాక్స్ వదిలేస్తే, మిగతా పార్ట్ అంతా టాకీ పార్టే అవటంతో, పెండింగ్ షూటింగ్ కి మూడు, నాలుగు నెలలు సరిపోతాయని తెలుస్తోంది. ఇంతకి జూన్ లో షూటింగ్ పూర్తనే విషయాన్ని ఇప్పుడు ఉన్న ఫలంగా ఎందుకు తేల్చేస్తున్నాడు...? జూన్ కి వారనాసి పూర్తైతే మరి సూపర్ స్టార్ మహేశ్ బాబు ఎవరితో నెక్ట్స్ మూవీ చేసే ఛాన్స్ఉంది? తను ఆగి ఆలోచించి కొత్త ప్రాజెక్ట్ చేస్తాడా? అందుబాటులో ఉన్న టాప్ డైరెక్టర్ తో కలిసి షాక్ ఇస్తాడా?

1300 కోట్ల పైనే బడ్జెట్ తో రాజమౌలి తీస్తున్న వారణాసి సినిమా 50శాతం షూటింగ్ పూర్తిచేసుకుంది. ఈమాట దర్శక ధీరుడు రాజమౌలే తేల్చాడు. సో ఇట్స్ అఫీషయల్ నౌ... అంతకంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, రామాయణం ఘట్టానికి సంబంధించిన 25 నిమిషాల హెవీ సీన్ కూడా షూట్ చేసేశాడట. ఇదే విషయాన్ని యూఎస్ యూట్యూబర్ కి ఇచ్చిన ఇంటర్వూలో తేల్చాడు రాజమౌళి.ఈ లెక్కన సూపర్ స్టార్ మహేశ్ బాబు జూన్ తర్వాత పూర్తి స్వతంత్రుడు కాబోతున్నాడా? ఔను. జూన్ ఎండ్ లోగా వారణాసి షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టబోతున్నారు. అంటే వారనాసి పూర్తైనట్టే.. సో మహేవ్ బాబు ఇక కొత్త సినిమాకు కమిటవ్వొచ్చు.. ఇంతకి తనెవరితో కమిట్ కాబోతున్నాడు.. సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ ఒక కథ చెప్పాడు.. సుకుమార్ తో జేమ్స్ బాండ్ స్టైల్లో ఒక సినిమా అన్నారు.

ఆల్రెడీ కొరటాల శివ ఎన్టీఆర్ దేవర 2 డిలే అవుతుందంటే, సూపర్ స్టార్ డేట్లు పట్టేందుకు క్యూలో ఉన్నాడు.. ఇలా చాలా మంది మహేశ్ బాబు మీద కర్చీఫ్ వేసేందుకు రెడీ గానే ఉన్నారు. కాని మహేశ్ బాబు తొందరపడతాడా? లేదంటే ఆగి ఆలోచించి, ఎక్కుడ టైం తీసుకుంటాడా? ఎందుకంటే వారణాసి రిలీజ్ అయ్యాక మహేశ్ బాబు ఇమేజ్ ఇంటర్నేషనల్ గా ఎక్కడికో వెల్లిపోతుంది..కాబట్టి, దానికి తగ్గ కథని చేయాలంటే, ముందు వారనాసి రిలీజై వరల్డ్ వైడ్ గా రీసౌండ్ రావాలి.. దాన్ని బట్టే, తన నెక్ట్స్ మూవ్ ఎలా ఉండాలనేది మహేశ్ బాబు నిర్ణయం తీసుకోవచ్చు.. ఆలెక్కన 2027 మార్చ్ వరకు మహేశ్ బాబు ఏ నిర్ణయం తీసుకోడా అంటే, కనీసం అరడజన్ దర్శకులు, ఆల్రెడీ విన్న కొన్ని కథలు లైన్లో ఉన్నాయి.. వాటిలో ఏది డిసైడ్ అవ్వాలో, ఏది కమిటవ్వాలో మహేశ్ చేతిలోనే ఉంది.కాకపోతే, అది వారణాసి రిలీజ్ తర్వాతే నిర్ణయం తీసుకుంటాడా? ఏడాది టైం వేస్ట్ చేయటం ఎందుకని, ఈలోపు పాన ఇండియ కోసం, సేఫ్ ప్రాజెక్ట్ కమిటవుతాడా? ఇదే తేలాలి.. ఇది రెండు భాగల సినిమా కాదు కాబట్టి, వారణాసి తర్వాత, మహేశ్ రాజమౌళి జర్నీ టెంపరరీగా పూర్తైనట్టే... మళ్లీ కొలాబరేషన్ జరగాలంటే, సీక్వెలో, లేదంటే మరో ప్రాజెక్టే జక్కన్న టేకప్ చేయాలి.. అది తనతోనే ఉంటుందా లేదా అన్నది కథని బట్టే ఉంటుంది.. కాబట్టి జూన్ లో మహేశ్ బాబు టీం నుంచి సాలిడ్ ఎనౌన్స్ మెంట్ కి ఛాన్స్ ఉంది.

Published : 
  • 14 February 2026, 4:45 PM IST