జస్ట్ ఇమాజిన్ వారణాసి మూవీ చూస్తుంటే, సడన్ గా ఒక పాట తూటాలా పేలితే ఎలా ఉంటుంది... అందులో కనీసం పదివేల మంది డాన్సర్లు సింక్రనైజేషన్ తో స్టెప్పేస్తే ఇంకెలా ఉంటుంది. ఏదో గ్రాఫిక్స్ లో వందమంది డాన్సర్లను వెయ్యిగా, పదివేలుగా మారిస్తే తెలిసిపోతుంది. అలాకాకుండా, ఒరిజినల్ గానే పదివేల మంది డాన్సర్లతో ఒక పాట తూటాలా ఊపేస్తే ఎలా ఉంటుంది.. అది కూడా అండర్ వాటర్ లో... త్రిబుల్ లో కూడా దోస్తి సాంగ్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ అండర్ వాటర్ లో నడుస్తూ ఒకరిని ఇంకొకరు కలుస్తారు... కాని వారణాసి పాటలో పదివేల మంది డాన్సర్లతో చేస్తున్న పాట అలా కాదని తెలుస్తోంది. అవతార్ వేఫ్ వాటర్ లో అండ్ ర్ వాటర్ వరల్డ్ ని నెక్ట్స్ లెవల్లోచూపించాడు జేమ్స్ కామెరున్... ఇప్పడు అలాంటి టెక్నాలజీ వారణాసిలో వాడుతున్నారా? ఆ ఒక్క పాటకే, మేకింగ్ నుంచి, పోస్ట్ ప్రొడక్షన్ వరకు 100 కోట్ల వరకు ఖర్చయ్యేలా ఉందా? హాలీవుడ్ మార్కెట్ దిమ్మతిరగాలంటే ఇలాంటివేవో విచిత్రాలు లేందే, మన పాటలు వాళ్లకి ఎక్కవా?
త్రిబుల్ ఆర్ మూవీలో దోస్తీ సాంగ్ గుర్తుందా..? అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరు నీటి అడుగునా నడుచుకుంటూ వచ్చి, ఒకరి చేయి ఒకరు పట్టుకునే షాట్... టీజర్ నుంచి ట్రైలర్ వరకు ఈ షాట్ కి అప్పట్లో భారీ స్పందనే వచ్చింది.. కాని ఇద్దరు స్టార్లు అండర్ వాటర్ లో ఇలాంటి షాట్ చేసేందుకు కనీసం రెండు మూడు ఇరోజులు ఆక్సీజన్ పెట్టుకుని ప్రాక్టీస్ చేయాల్సి వచ్చిందట.చిన్న పాటి స్మిమ్మిగ్ ఫూల్ లే అలా సెట్ చేసి, ఆ షాట్ తీశారు.. ఇద్దరు నటులు ఇలా అండ్ వాటర్ లో నడిచే సీన్ కే ఇంత కష్టపడితే..కనీసం పదివేల మంది, అండ్ వాటర్ లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది..? అయినా పదివేల మంది అండర్ వాటర్ లో డాన్స్ చేస్తుంటే, కెమెరాతో క్యాప్చర్ చేయొచ్చా.. చేసినా ఆడియన్స్ కి నిజంగా అండర్ వాటర్ లో పది వేల మంది డాన్స్ చేస్తున్నరన్న అనుభూతి కలుగుతుందా?అస్సలు డౌట్లొద్దు.. సమ్మర్ వల్ల నీటి కొరత పెరగటంతో, ఆర్టీఫీషియల్ గా సెట్ వేసి నది ని క్రియేట్ చేద్దామన్నా రాజమౌలికి ఇక్కడ అది కుదర్లేదు. దీంతో వారణాసిలోనే గంగా ఒడ్డునే కొన్ని సీన్లు తీశాడు. ఇప్పుడు హైద్రబాద్ లో భారీ సాంగ్ షూటింగ్ కి రెడీ అయ్యాడు. ఒకరిద్దరు కాదు, ఏకంగా 10 వేల మంది డాన్సర్లు ఈ సాంగ్ లో డాన్స్ చేయబోతున్నారు.
అది కూడా సెట్లో కాదు, నీటి అడుగున.. అందుకోసమే భారీ వలయాకారంలో ఒక చెరువులాంటి స్విమ్మింగ్ ఫూల్ నే రెడీ చేశారట. ఒక్క పాట 100 కోట్ల ఖర్చుతో తెరకెక్కడం అంటే, నిజంగానే ఇది షాకింగ్ న్యూసే..కాని ఎందుకు ఆ పాటకోసం అంత ఖర్చుచేయాలి? ఎందుకు పదివేల మంది డాన్సర్లని వాడాలి..? గ్రాఫిక్స్ తో సరిపెట్టుకోవచ్చు కదా? ఐనా ఇంతవమంది నీటి అడుగున ఎంత సేపు డాన్స్ చేస్తారు? వాళ్ల సేఫ్టీ ఎలా? పది వేల మంది నీటి అడుగున డాన్స్ చేస్తే మాత్రం సినిమాచూసే ఆడియన్స్ కి ఇదంతా తెలుస్తుందా?ఈ డౌట్లన్నీంట్లో లాజిక్ ఉంది. కాని ఇక్కడే రాజమౌళి అవతార్ మ్యాజిక్ ని వాడుతున్నాడు. అవతార్ సీక్వెల్ వే ఆఫ్ వాటర్ లో ఇలానే అండర్ వాటర్ సీన్లు 40 పైనే ఉన్నాయి.చాలా యాక్షన్ పార్ట్ అండర్ వాటర్ లోనే తీశారు. అందుకోసం పెద్ద పెద్ద స్విమ్మింగ్ ఫూల్స్ పెట్టి, అందులో నటులకు ఆక్సీజన్ సప్లై నోటికి అందిస్తూనే, షూట్ చేశారు. కాకపోతే అక్కడ హీరోల ముఖాలతో పనిలేదు. వాళ్ల మోషన్ ని క్యాప్టర్ చేసి, అవతార్ పాత్రలకు వాడారు కాబట్టి, ఆక్సీజన్ మాస్కులు, వైర్లు, పైపులు ఇవేవి లెక్కలోకి రాలేదు.
కాని వారణాసి లో ఒకే ఒక్క ప్రెస్టీజియస్ డాన్స్ నెంబర్ అయినా, పాట కోసం 100 కోట్లు ఖర్చు చేసి, అవతార్ 2 టెక్నాలజీ వాడుతున్నారు. అండర్ వాటర్ లో పది వేల మంది డాన్సర్లు లేయర్ బై లేయర్, రౌండ సర్కిల్లో నిలుచుని డాన్స్ చేయటం, అది ఏకంగా ఐదు ఐమ్యాక్స్ కెమెరాలతో షూట్ చేస్తారట. ఎక్కడా ఈ పాటలో ఏఐని కాని గ్రాఫిక్స్ ని కాని వాడొద్దని.. ఇలాంటి రియలిస్టిక్ గా ఏమైనా చేస్తేనే, వరల్డ్ ఆడియన్స్ కి నచ్చుతుంది కాబట్టే, ఇలారిస్క్ చేస్తోందట రాజమౌళి టీం. నిజంగా ఇది మంచి ఆలోచనే అయినా, చాలా రిస్క్ తో కూడకున్నది.. ఇదే మేకింగ్ వీడియో రూపంలో అవతార్ 4 షూటింగ్ సెట్లో జేమ్స్ కామెరున్ చేతులు మీదుగా లాంచ్ చేయాలనేది కూడా రాజమౌళి ప్లానింగ్ అని తెలుస్తోంది. వారణాసిని వరల్డ్ సినిమాగామార్చేందుకు ఉన్న అన్ని దార్లు వాడేస్తున్నాడు రాజమౌళి.