సీమ కథకు బాలరెడ్డి బామ్మర్ది.!

టాలీవుడ్ ఎప్పుడు ఏ కాంబినేషన్ అనౌన్స్ అయినా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంటుంది. కానీ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారంటే ఆ అంచనాలు వేరే లెవెల్‌లో ఉంటాయి. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ను సరిగ్గా మేళవించి సినిమా

Post Published By: dialnews
Updated : 19 August 2026, 6:45 PM IST

టాలీవుడ్ ఎప్పుడు ఏ కాంబినేషన్ అనౌన్స్ అయినా అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంటుంది. కానీ, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారంటే ఆ అంచనాలు వేరే లెవెల్‌లో ఉంటాయి. కామెడీ, యాక్షన్, ఫ్యామిలీ సెంటిమెంట్‌ను సరిగ్గా మేళవించి సినిమాలు తీయడంలో అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో టాలీవుడ్ మోస్ట్ లవబుల్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలిసి ఒక భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గురించి నెట్టింట, సినీ వర్గాల్లో ప్రతిరోజూ ఏదో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతూనే ఉంది. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఎక్సైట్‌మెంట్‌కి ఏమాత్రం తగ్గుకుండా అనిల్ రావిపూడి కూడా ఈ సినిమా విషయంలో సాలిడ్ ప్లానింగ్స్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన వెంకీ ఫస్ట్ లుక్‌కి ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.

ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రానికి సంబంధించి ఓ పవర్‌ఫుల్ అండ్ క్యాచ్ టైటిల్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమా బ్యాక్‌డ్రాప్ రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంగా ఉండబోతోందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సీమ బ్యాక్‌డ్రాప్‌లో అనిల్ రావిపూడి మార్క్ మార్క్ కామెడీ, పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయని టాక్.అందులో భాగంగానే కథకు సరిగ్గా సరిపోయే విధంగా ఒక ఫ్యాక్షన్ తరహా క్యాచీ టైటిల్‌ను మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం.. ఈ సినిమాకి ‘బాలరెడ్డి బామ్మర్ది’ అనే క్రేజీ టైటిల్‌ను పరిశీలిస్తున్నారట! ‘బాలరెడ్డి బామ్మర్ది’ అనే టైటిల్ వినడానికే చాలా ఆసక్తికరంగా, వినోదాత్మకంగా ఉండటంతో నందమూరి, దగ్గుబాటి అభిమానులు ఈ టైటిల్ పట్ల చాలా పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. అయితే ఈ టైటిల్‌పై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి యువ సంగీత తరంగం జి.వి. ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి జి.వి. ప్రకాష్ సంగీతం తోడైతే థియేటర్లలో పండగే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ చూడటానికి ఇరు హీరోల అభిమానులు సిద్ధంగా ఉన్నారు. మరి ‘బాలరెడ్డి బామ్మర్ది’ అనే టైటిల్‌నే మేకర్స్ ఫైనల్ చేస్తారో లేదో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

Published : 
  • 19 August 2026, 6:45 PM IST