విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం’.ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన టాలెంటెడ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి నటిస్తోంది. అయితే ఈ సినిమాలో వెంకటేష్ మరియు నారా రోహిత్ మధ్య వచ్చే ట్రాక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుందని సమాచారం. ముఖ్యంగా హైడ్ అండ్ సీక్ ట్రాక్ శైలిలో ఫుల్ ఎంటర్టైనింగ్గా ఈ సన్నివేశాలు సాగుతాయని తెలుస్తోంది.
అంతేకాకుండా, ఇంటర్వెల్ ఎపిసోడ్లో వచ్చే నారా రోహిత్ ఎంట్రీ ఊహించని విధంగా, ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. త్రివిక్రమ్ మార్క్ కామెడీ టైమింగ్‌తో పాటు బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్‌గా నిలవనున్నాయి. చిత్ర యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్‌లో వెంకటేష్ పాత్రను 'చిట్టిబాబు'గా పరిచయం చేయగా, కూతురు పాత్రతో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి.
త్రివిక్రమ్ డైలాగ్స్ ఈ చిత్రానికి ప్రాణం పోయనున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని అక్టోబర్ 2, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి వెంకీ - త్రివిక్రమ్ ఈసారూ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.