వారెవ్వా విరోష్…!

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాలతో మాయ చేసిన ఈ జంట,

Post Published By: dialnews
Updated : 21 March 2026, 8:15 PM IST

టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్నల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వెండితెరపై 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' వంటి చిత్రాలతో మాయ చేసిన ఈ జంట, బయట కూడా తరచుగా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా వీరిద్దరూ కలిసి చేసిన ఒక అద్భుతమైన పని ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఒక వైరల్ కిడ్ మరియు ఆమె కుటుంబాన్ని తమ ఇంటికి భోజనానికి ఆహ్వానించి, తమ ఉదారతను చాటుకున్నారు ఈ స్టార్ కపుల్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక చిన్నారికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

ఆ చిన్నారి అమాయకత్వం, మాట తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంది. ఈ క్రమంలోనే ఆ వైరల్ కిడ్ పై మన రౌడీ హీరో విజయ్ దేవరకొండ కన్ను పడింది. కేవలం వీడియోలు చూసి వదిలేయకుండా, ఆ చిన్నారి కుటుంబాన్ని స్వయంగా కలిసి అభినందించాలని విజయ్ మరియు రష్మిక నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే సదరు చిన్నారిని, ఆమె తల్లిదండ్రులను మరియు తోబుట్టువులను తమ నివాసానికి ఆహ్వానించారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో తుపాను సృష్టిస్తున్నాయి. ఈ ఫోటోలలో విజయ్ దేవరకొండ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండగా, రష్మిక ఎంతో సింపుల్‌గా, ట్రెడిషనల్ వైట్ డ్రెస్సులో మెరిసిపోతోంది.

సాధారణంగా సెలబ్రిటీలు ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కేవలం ఫోటోలకు ఫోజులిచ్చి పంపించేస్తుంటారు. కానీ ఇక్కడ సీన్ వెరీ డిఫరెంట్! విజయ్ మరియు రష్మిక ఆ కుటుంబంతో కలిసి భోజన టేబుల్ వద్ద కూర్చుని, కబుర్లు చెప్పుకుంటూ విందు ఆరగించారు. ఒక స్టార్ హీరో, హీరోయిన్ అన్న గర్వం ఏమాత్రం లేకుండా, ఆ కుటుంబంలో సభ్యుల్లా కలిసిపోవడం చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు."నిజమైన స్టార్‌డమ్ అంటే కేవలం సినిమాల్లో నటించడం కాదు, సామాన్యుల పట్ల ఇలాంటి ప్రేమను చూపించడం" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, ఇలా సోషల్ మీడియాలో ప్రతిభ చాటుకుంటున్న సామాన్యులను గుర్తించి, వారిని గౌరవించడం అనేది గొప్ప విషయం. విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల ఈ ఉదార స్వభావం మరోసారి వారిని వార్తల్లో నిలిచేలా చేసింది. వీరిద్దరూ త్వరలోనే కలిసి నటించిన రణబాలి సినిమా ఇంకొన్ని నెలల్లో విడుదలకానుంది.

Published : 
  • 21 March 2026, 8:15 PM IST