కోలీవుడ్ ఇండస్ట్రీలో డిఫరెంట్ సినిమాలతో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు హీరో విశాల్. ప్రస్తుతం వరుస షూటింగ్స్‌తో బిజీగా ఉన్న విశాల్.. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమిళనాడు రాజకీయాలు, దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. నేను ఇటీవల విజయ్‌ని కలిసినప్పుడు ఆయన మునుపటిలాగే చాలా నార్మల్‌గా ఉన్నారు. నేనాయన దగ్గరకు వెళ్లేటప్పుడు ఎలాంటి పూలగుత్తి కూడా తీసుకెళ్లలేదు, ఎందుకంటే నేను సాధారణంగా బుకేలు కొనను. విజయ్ కూడా అస్సలు మారలేదు, కేవలం ఆయన హోదా మాత్రమే మారింది అని విశాల్ అన్నారు.
ఎంత పెద్ద పొజిషన్‌కి వెళ్లినా విజయ్ సింప్లిసిటీ అలాగే ఉందని విశాల్ కొనియాడారు. సినిమా హీరోలకు ఫ్యాన్స్ ఉండటం సహజం. కానీ రాజకీయం అంటే కేవలం సినిమాల క్రేజ్ మాత్రమే పనిచేస్తుందా? అనే ప్రశ్నకు విశాల్ క్లారిటీ ఇచ్చారు. జనాలు విజయ్‌ని నమ్మడానికి కారణం ఆయన ఒక పెద్ద హీరో అని మాత్రమే కాదు, సమాజంలో ఒక బలమైన మార్పు రావాలని కోరుకోవడమే. విజయ్ ప్రజలతో మాట్లాడే తీరు, కనెక్ట్ అయ్యే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ముఖ్యంగా ఫస్ట్ టైమ్ ఓటర్లు ఈ కొత్త మార్పు కోసం విజయ్ వైపు మొగ్గు చూపుతున్నారని విశాల్ వెల్లడించారు. ఎలక్షన్ ప్రచారంలో విజయ్ చేసిన ప్రసంగం గురించి విశాల్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు.
ప్రచార చివరి రోజు విజయ్ మాట్లాడుతూ.."మీరు ఇంటికి వెళ్లి మీ అమ్మనాన్నలకు, తాతయ్య-అమ్మమ్మలకు, ఇంట్లో ఉన్న పెద్దవాళ్లందరికీ చెప్పండి.. దయచేసి ఒక్కసారి విజయ్‌కి ఓటు వేయమని అడగండి" అని విజ్ఞప్తి చేశారు.ఈ మాట జనాల్లోకి ఎంత బలంగా వెళ్లిందంటే.. ఒక జడ్జి గారు కూడా రికార్డుల్లో ఒక విషయం చెప్పారట! తాతయ్య అయిన ఆ జడ్జి గారు.. తన చిన్న మనవరాలు వచ్చి "తాతయ్యా టీవీకేకి ఓటు వెయ్యి" అని అడగడం వల్లే తాను ఓటు వేశానని చెప్పారట. విజయ్ మాటలు ఎంత పెద్ద ప్రభావాన్ని చూపాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని విశాల్ గుర్తు చేసుకున్నారు.మొత్తానికి హీరో విశాల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరి తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తారో కాలమే నిర్ణయించాలి అని సినీ క్రిటిక్స్ అభిప్రాయపడుతున్నారు.