ఆగస్టు 21న థియేటర్లలో ‘ఇరుముడి’ మోతమోగనున్న ‘మల్లెపూల పల్లకి’.!

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

Post Published By: dialnews
Updated : 18 August 2026, 5:30 PM IST

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఇరుముడి’ ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్, ‘మల్లెపూల పల్లకి’ పాట ఈ సినిమాపై మరింత హైప్‌ను క్రియేట్ చేశాయి.ఈ సినిమా విశేషాల గురించి చిత్ర యూనిట్ పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కూ చాలా ప్రాధాన్యం ఉంటుంది. నటి స్వాసిక పెర్ఫార్మన్స్ భయపెట్టేంత అద్భుతంగా ఉంటుందని, సాయికుమార్ గారిని ఒక సరికొత్త డిఫరెంట్ లుక్‌లో చూస్తారని తెలిపారు

. ప్రియా భవానీ శంకర్ ‘కావేరి’ పాత్రలో కేవలం కొన్ని సీన్లలోనే కనిపిస్తున్నప్పటికీ ఎక్సలెంట్ నటన కనబరిచారని, నక్షత్ర భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుందని చెప్పారు. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన అద్భుతమైన పాటలు, సూపర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సినిమాటోగ్రాఫర్ విష్ణు శర్మ, ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్, ఎడిటర్ ప్రవీణ్ పూడి ఈ చిత్రాన్ని తమ సొంత సినిమాగా భావించి ప్రాణం పెట్టి పనిచేశారని పేర్కొన్నారు.మొత్తానికి ‘ఇరుముడి’ ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక మంచి ఎమోషనల్ రైడ్‌లా ఉండబోతోందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేసింది.

Published : 
  • 18 August 2026, 5:30 PM IST