తాతకల నెరవేరుస్తాడా..? ఈ జెనరేషన్ లో సెన్సేషన్..!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు అర్జెంట్ గా తన తాత రూట్లో నడిచే టైం వచ్చిందా? విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దారిలో, మనవడు ఎన్టీఆర్ జూనియర్ నిజంగా నడవబోతున్నాడు.

Post Published By: dialnews
Updated : 12 February 2026, 2:55 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు అర్జెంట్ గా తన తాత రూట్లో నడిచే టైం వచ్చిందా? విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ దారిలో, మనవడు ఎన్టీఆర్ జూనియర్ నిజంగా నడవబోతున్నాడు. గతంలోనే అలాంటి ప్రయత్నం యమదొంగలో చేశాడు. కాని ఇప్పుడు అసలు సిసలు టైం వచ్చినట్టుంది...పౌరాణికాల్లో మెరవాలన్న తన కలని, నిజం చేసే స్క్రిప్ట్ ఇంతవరకు తనకి దొరకలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా రాముడి అవతారం వేసిన ఎన్టీఆర్, యమదొంగలోనే యముడిగా కనిపించాడు. ఇప్పడు ఈ మాడ్రన్ జనరేషన్ లో, సడన్ గా మైథాలజీ ఎంచుకోవటానికి కారనం కూడా తాత దారిలో నడవాలన్న కలే.. దాన వీర శూర కర్ణ లాంటి సినిమా చేయాలని ఎన్టీఆర్ కి ఉన్నా, అలాంటి ప్రాజెక్ట్ రెడీ చేసే దర్శకుడెక్కడ.. లక్కీగా త్రివిక్రమ్ ప్లాన్ చేసిన గాడ్ ఆఫ్ వార్ తో తన కల నెరవేరేలా ఉంది. అందుకే మాటల మాంత్రికుడు వెన్నుపోటు పొడిచినా, తనంటే నచ్చకున్నా ఇలా ఎన్టీఆర్ లాండ్ ఆఫ్ వార్ గా మారిపోతున్నాడనే మాటే వినిపిస్తోంది. తాతకు తగ్గ మనవడనిపించుకునేందుకు 40ఏళ్లపైనే ఎన్టీఆర్ వేయిట్ చేయాల్సి వచ్చింది... సో ఇకనైనా తన కలనెరవేరుతుందా? గాడ్ ఆఫ్ వార్ నిజంగా తన కలని నిజం చేసే ప్రాజెక్టేనా?

విశ్వ విఖ్యాత నట సార్వభౌమ దివంగత నేత ఎన్టీఆర్ అంటే నాయకుడిగానే కాదు, నటుడిగా ఒక చరత్రి.. ఆస్థాయికి ఎదగటానికి తన వారసుల్లో ఒకడు బాలయ్యే ఎంతో కష్టపడితే, ఇక మనవడిగా ఎన్టీఆర్ పరిస్తితేంటి? నిజానికి తాత పోలికలతో పుట్టడమే కాదు, అలా పెర్ఫామెన్స్ తో దూసుకెళ్లటం ఎన్టీఆర్ కి దక్కిన వరం.కాని తాతలా తను పౌరాణికాలకు కింగ్ అనిపించుకోలేకపోయాడు. ఆ తరంలో పౌరాణికాలు, జానపదాలు వందకు 90శాతం వచ్చేవి. నడిచేవి.. కాని తరాలు మారటంతో, మూడో తరంలో వచ్చిన ఎన్టీఆర్ జూనియర్, కి అలాంటి కంటెంట్స్ ఎప్పుడూ పడలేదు.

శక్తిలో కొంత ట్రై చేశాడు. యమదొంగలో కొంతవరకు తాత దారిలో నడిచే ప్రయత్నం చేశాడు.కాని రాముడిగా, కృష్ణుడిగా, ఇలా దేవుడికి ప్రతిరూపంగా, కర్ణుడిగా, ధుర్యోధనుడిగా విలనిజానికి కేరాఫ్ అడ్రస్ గా ఇలా రెండు ధారుల్లో నడవటం ఎన్టీఆర్ కి కుదరలేదు. అలాంటి కంటెంట్ లు ఈ తరంలో మళ్లీ మళ్లీ రావటం కష్టం.. అందుకే నార్మల్ కథనే పౌరాణికంగా మర్చే ప్రయత్నం జైలవకుశలో కనిపించింది. అందులో తను రావణుడి ప్రతిరూపంగా కనిపించే ప్రయత్నం చేశాడు.నెగెటివ్ షేడ్స్ చూపించాడు. అయితే తాతకు తగ్గ మనవడు అనిపించుకోవాలంటే, ఎన్టీఆర్ స్థాయిలో కాకపోయినా అందులో కొంతవరకైనా రీచ్ అవ్వాలి.

అందుకోసం పౌరాణికాలు, జానపద సినిమాలు పడాలి... అలాంటి కథలు దొరకాలి.. అందుకే త్రివిక్రమ్ చెప్పిన మైథలాజికల్ మూవీ గాడ్ ఆఫ్ వార్ కి ఒప్పుకున్నాడు. గతంలో తనతో క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చినా, లైట్ తీసుకున్నాడు.బన్నీ కాంపౌండ్ కి త్రివిక్రమ్ చేరాడన్న ప్రచారం జరిగినా, మాటల మాంత్రికుడిని తను క్షమించి మళ్లీ ఆఫర్ ఇచ్చాడని కూడా ప్రచారం జరుగుతోంది. కేవలం మైథలాజికల్ మూవీలు చేయాలనే కాదు, గతంలో కూడా కొందరిని ఇలానే ఫర్ గీవ్ చేసిన సందర్భాలున్నాయనంటారు.. ఏదేమైనా గాడ్ ఆఫ్ వార్ కథ మాత్రం తాతకు తగ్గ మనవడు అనిపించుకునేంత, మైథలాజికల్ కంటెంట్ తో రాబోతోంది. అందుకే అల్లు అర్జున్ వద్దనుకున్న త్రివిక్రమ్ వెంట మళ్లీ పడేలా చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.

Published : 
  • 12 February 2026, 2:55 PM IST