టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత జీవితంలో సరికొత్త వసంతం మొదలైనట్లు తెలుస్తోంది. సమంత స్వయంగా నిర్మించి, నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా నిన్న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం ఒక్క రోజులోనే ఈ సినిమా క్లీన్ బ్రేక్ ఈవెన్ సాధించి నిర్మాతగా సామ్‌కు పెద్ద సక్సెస్‌ను తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా నిర్వహించిన 'మా ఇంటి బంగారం' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత తన భర్త, ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి వైట్ కలర్ టీషర్ట్‌లో సందడి చేశారు.
అయితే, ఈ వేడుకకు సంబంధించిన వీడియోలలో సమంత బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తోందంటూ నెట్టింట ప్రెగ్నెన్సీ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న సమంత, గతేడాది డిసెంబర్లో రాజ్ నిడిమోరును వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఎప్పటి నుంచో ఒక అందమైన కుటుంబాన్ని ప్రారంభించాలనే బలమైన కోరిక ఉన్న సామ్.. త్వరలోనే తల్లి కాబోతుందనే సంకేతాలు రావడంతో అటు ఫ్యామిలీ మెంబర్స్, ఇటు అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే, ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతున్న ఈ ప్రెగ్నెన్సీ ప్రచారంపై సమంత అఫీషియల్‌గా స్పందించాల్సి ఉంది.