సిద్ధమైన ‘జననాయగన్’ 500 కోట్ల టార్గెట్…!

తమిళ సూపర్ స్టార్, కోట్లాది మంది అభిమానుల దళపతి విజయ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ఆయన తన సినీ ప్రస్థానానికి స్వస్తి పలికి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్’

Post Published By: dialnews
Updated : 7 May 2026, 9:55 AM IST

తమిళ సూపర్ స్టార్, కోట్లాది మంది అభిమానుల దళపతి విజయ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే చర్చ. ఆయన తన సినీ ప్రస్థానానికి స్వస్తి పలికి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన నటించిన ఆఖరి చిత్రం 'జన నాయగన్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా, కేవలం ఒక సినిమా మాత్రమే కాదు.. విజయ్ అభిమానులకు ఒక ఎమోషన్. నిజానికి ఈ చిత్రం ఎన్నికలకు ముందే విడుదల కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. అయితే, ప్రస్తుత రాజకీయ పరిణామాలు, ఎన్నికల ఫలితాల తర్వాత విజయ్ ఇమేజ్ ఒక్కసారిగా మారిపోయింది. తన హీరో ‘ముఖ్యమంత్రి’ కావాలని కోరుకున్న అభిమానులకు, ఇప్పుడు ఈ సినిమా ఒక వేడుకలా మారింది. ఒక హీరోగా కాకుండా, ఒక లీడర్‌గా విజయ్‌ను వెండితెరపై చూడాలని ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు.

గతంలో విజయ్ నటించిన ‘గోట్’ సినిమాపై అనేక విమర్శలు వచ్చాయి. 400 కోట్లు పెట్టి ఆ సినిమా తీయడం రిస్క్ అని చాలా మంది పెదవి విరిచారు. కానీ విజయ్ తన స్టార్‌డమ్‌తో వాటన్నింటినీ పటాపంచలు చేశారు. ఇప్పుడు ‘జన నాయగన్’ విషయంలో పరిస్థితి వేరుగా ఉంది. ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం, ఈ సినిమా కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, లాంగ్ రన్‌లో ఈ సినిమా కలెక్షన్లను ఊహించడం కూడా ఎవరి తరం కాదు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సృష్టించే విధ్వంసం మామూలుగా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఒక టాప్ ఫామ్‌లో ఉన్న హీరో, తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పడం అనేది భారతీయ చలనచిత్ర చరిత్రలో చాలా అరుదు. ‘జన నాయగన్’ విజయ్ కెరీర్‌లో ఆఖరి సినిమా కావడం వల్ల, దీనికి లభిస్తున్న క్రేజ్ వర్ణనాతీతం. గతంలో ఓటిటి డీల్స్, ఆన్లైన్ లో హల్చల్ చేసిన లీక్స్ కానీ ఇప్పుడు ఈ సినిమా హైప్‌ను ఏమాత్రం తగ్గించలేకపోయాయి. విజయ్ స్టార్‌డమ్‌ను తక్కువ అంచనా వేసిన వారికి ఆయన ఎప్పుడూ తన విజయాలతోనే సమాధానం చెబుతూ వచ్చారు. ఇప్పుడు ‘నాయకుడు’గా మారి వస్తున్న ఆయన, బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ రికార్డులను తిరగరాస్తారో చూడాలి.అనిరుధ్ సంగీతం అందించిన ఈ మూవీ విడుదలకు సంబంధించిన అప్డేట్స్ త్వరలోనే అఫీషియల్ గా వెల్లడికానున్నాయి.

Published : 
  • 7 May 2026, 9:55 AM IST