రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న 'పెద్ది' సినిమాలో జాన్వీ కపూర్ పోషిస్తున్న పాత్ర పేరు 'అచ్చియమ్మ'. దేవర' సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అతిలోక సుందరి కూతురు జాన్వీ కపూర్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది'తో తన జెండాను పర్మినెంట్ గా పాతనుంది.ఉత్తరాంధ్ర నేపథ్యంలో పెద్ది కథ సాగుతుంది.జాన్వీ చేస్తున్న అచ్చియమ్మ అనే రోల్ కేవలం పేరు మాత్రమే కాదు, ఆ పాత్రలో ఉన్న మట్టి వాసనను, పల్లెటూరి స్వచ్ఛతను ప్రతిబింబిస్తుంది.
ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లలో జాన్వీ చాలా విభిన్నంగా కనిపిస్తోంది. మేకర్స్ ఈ పాత్రను "Our Peddi’s love with a firebrand attitude" అని అభివర్ణించారు. అంటే, ఈమె కేవలం వచ్చి వెళ్లే గ్లామర్ పాత్ర కాదు. చాలా ధైర్యవంతురాలైన, గట్టి మనస్తత్వం ఉన్న పల్లెటూరి అమ్మాయి. ఒక పోస్టర్‌లో ఆమె స్పీకర్లు ఉన్న జీపుపై నిలబడి జనాలకు అభివాదం చేస్తూ కనిపిస్తుంది. దీన్ని బట్టి ఆమె ఒక గ్రామీణ రాజకీయ నాయకురాలు కావచ్చు లేదా ఊరి జాతరల్లో ప్రదర్శనలు ఇచ్చే ఒక యాక్టివ్ పర్సన్ కావచ్చని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.
చాలామంది 'దేవర'లో జాన్వీ చేసిన 'తంగం' పాత్రతో దీన్ని పోలుస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఆమెకు చాలా పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇచ్చారు. ఈ సినిమాలో జాన్వీ పాత్రకు ఎమోషనల్ డెప్త్ ఎక్కువగా ఉంటుంది. నటనకు స్కోప్ ఉన్న పాత్ర అని ఇండస్ట్రీ టాక్. ఈ సినిమా కోసం జాన్వీ కపూర్ ప్రత్యేకంగా తెలుగు నేర్చుకోవడమే కాకుండా, మన సంప్రదాయ కట్టుబొట్టుపై ఫోకస్ చేసింది. మొత్తానికి, 'పెద్ది' సినిమాలో రామ్ చరణ్ 'రస్టిక్' లుక్ కి ధీటుగా జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' లుక్ ఉండబోతోంది. ఏప్రిల్ 30, 2026న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతుంది.