ఇటీవల రణవీర్ సింగ్ ధురంధర్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసి.. నార్త్ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటిన జియో స్టూడియోస్, ఇప్పుడు నేచురల్ స్టార్ నాని సినిమాపై కన్నేసిందని బాలీవుడ్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ది ప్యారడైజ్ హిందీ థియేట్రికల్ రిలీజ్ హక్కుల కోసం జియో స్టూడియోస్ చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. అదే జరిగితే నాని కెరీర్లోనే ఇది ఒక భారీ డీల్ అవుతుందనడంలో సందేహం లేదు. ఇది నాని అభిమానులకు నిజంగా పండగ లాంటి వార్తే. ఎందుకంటే గతంలో నాని సినిమాలు హిందీలో రిలీజ్ అయినప్పటికీ ది ప్యారడైజ్ మాత్రం నానికి మొదటి పూర్తి స్థాయి సోలో హిందీ థియేట్రికల్ రిలీజ్ కాబోతోంది.
ఇప్పటివరకు డబ్బింగ్ సినిమాలతో.. లిమిటెడ్ రిలీజ్‌లతో సరిపెట్టుకున్న నాని... ఈ సినిమాతో డైరెక్ట్‌గా బాలీవుడ్ మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జియో లాంటి పెద్ద డిస్ట్రిబ్యూషన్ సంస్థ తోడైతే, సినిమా రీచ్ మామూలుగా ఉండదు. దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌ల నుండి సింగిల్ స్క్రీన్స్ వరకు నాని సినిమాను తీసుకెళ్లే అవకాశం వారికి ఉంది.అయితే, ఈ బాలీవుడ్ ఎంట్రీ అనేది నానికి ఏదో అకస్మాత్తుగా వచ్చిన ఆలోచన కాదు. దీని వెనుక ఒక బలమైన వ్యూహం ఉంది. దసరా సినిమా ప్రమోషన్ల సమయంలో నాని ఒక మాట చాలా స్పష్టంగా చెప్పాడు.. నాకు ఒకే సినిమాతో పాన్ ఇండియా స్టార్డమ్ అక్కర్లేదు. నా సినిమా సినిమాకు ఆడియన్స్ సంఖ్య పెరిగితే చాలు, అదే నాకు నిజమైన గ్రోత్ అని.
ఇప్పుడు ఆయన చేస్తున్నది కూడా అదే. తొందరపడి ఏదో ఒక సినిమాను హిందీలో రిలీజ్ చేయకుండా, సరైన సమయం కోసం వేచి చూస్తూ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ తన మార్కెట్‌ను నిర్మించుకున్నారు.నాని గ్రాఫ్ గమనిస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. దసరాతో నార్త్ ఆడియన్స్‌కు తనలోని మాస్ యాంగిల్ పరిచయం చేశాడు. ఆ తర్వాత వచ్చిన హాయ్ నాన్నతో అక్కడి ఫ్యామిలీ ఆడియన్స్‌కు, ఓటీటీ లవర్స్‌కు దగ్గరయ్యాడు. ఆ వెంటనే సరిపోదా శనివారంతో తన యూనిక్ యాక్షన్ స్టైల్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. ఇక రాబోయే హిట్ 3లోని అర్జున్ సర్కార్ పాత్రపై ఇప్పటికే నేషనల్ లెవెల్ హైప్ ఉంది. ఇలా 4 సినిమాలతో స్లోగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని, ఇప్పుడు 'ది ప్యారడైజ్'తో సిక్సర్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు.మొత్తానికి నాని స్లో అండ్ స్టెడీ ఫార్ములా ఇప్పుడు ఫలితాన్నిచ్చే దశకు చేరుకుంది. శ్రీకాంత్ ఓదెల క్రియేట్ చేస్తున్న వైలెంట్ & రా కంటెంట్‌కి జియో స్టూడియోస్ లాంటి బడా డిస్ట్రిబ్యూషన్ తోడైతే.. 'ది ప్యారడైజ్' బాక్సాఫీస్ దగ్గర రూల్ చేయడం ఖాయం. ఒక తెలుగు హీరో, కేవలం కంటెంట్‌ను నమ్ముకుని స్టెప్ బై స్టెప్ బాలీవుడ్ మార్కెట్‌ను ఎలా కొల్లగొట్టొచ్చో చెప్పడానికి నాని ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా నిలుస్తున్నాడు.