Megastar Chiranjeevi took the audience to the fantasy world with the films 'Jagadekaveerudu Athilokasundari and Anji'.
‘జగదేకవీరుడు అతిలోకసుందరి, అంజి‘ చిత్రాలతో ప్రేక్షకుల్ని ఫాంటసీ వరల్డ్ లోకి తీసుకెళ్లాడు మెగాస్టార్ చిరంజీవి. మళ్లీ దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘విశ్వంభర‘తో మళ్లీ అలాంటి జోనర్ లో మురిపించడానికి ముస్తాబవుతున్నాడు. వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. లేటెస్ట్ గా ఓ లెందీ షెడ్యూల్ మొదలుపెట్టుకుంది టీమ్. ఈ షెడ్యూల్ తో దాదాపు షూటింగ్ ఫినిష్ అవుతుందని ఫిల్మ్ నగర్ టాక్.
ముల్లోకాలకు సంబంధించిన కథ కావడంతో ఈ చిత్రంలో ఐదారుగురు హీరోయిన్లు ఉంటారనే ప్రచారం ఆమధ్య జోరుగా సాగింది. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్లు కాదు.. చిరంజీవి చెల్లెళ్లు పాత్రలే ఎక్కువ ఉంటాయనేది ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో సర్క్యులేట్ అవుతోన్న న్యూస్. ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబు అనే పాత్రలో కనిపించబోతున్నాడట. చిరంజీవి పాత్రలో విభిన్నమైన షేడ్స్ ఉంటాయట. ఫన్నీగా ఉంటూనే ఎంతో రెస్పాన్సిబుల్ గానూ ఉంటుందట. ఒకవిధంగా చెప్పాలంటే చిరు ‘హిట్లర్‘ ఫార్ములానే ‘విశ్వంభర‘కి ఫాలో అవుతున్నాడట డైరెక్టర్ వశిష్ట.
‘హిట్లర్‘ చిత్రంలో చిరంజీవికి ఐదుగురు చెల్లెళ్లు ఉంటారు. ఒక మాస్ హీరోగా పీక్స్ లో ఉన్న మెగాస్టార్.. ఈ మూవీలో పండించిన సిస్టర్ సెంటిమెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘విశ్వంభర‘లో అలాంటి సిస్టర్ సెంటిమెంట్ హైలైట్ కానుందట. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెళ్లు పాత్రల్లో ఆషిక రంగనాథ్, సురభి , ఇషా చావ్లా, మీనాక్షి చౌదరి వంటి క్యూట్ బ్యూటీస్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ నటిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించింది టీమ్. త్వరలోనే మిగతా చెల్లెళ్ల పాత్రలపైనా హింట్ ఇవ్వనున్నారట.