వాలెంటైన్స్ డే సందర్భంగా వినబడే ఎన్నో రూమర్స్ లో హీరో ధనుష్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పెళ్లి ఒకటి. ఎంతో కాలంగా వీరి మధ్య ప్రేమ పరిగెడుతోందని, వాలెంటైన్స్ డే రోజున వీరు ఒక ఇంటివారు కాబోతున్నారని వినిపిస్తున్న వార్తలకు మృణాల్ ఠాకూర్ చెక్ పెట్టింది.
అసలు అంత సులభంగా ఇలాంటి వార్తలను ఎలా నమ్మేస్తారు అని అలక ప్రదర్శించింది ఈ సెన్సేషన్ హీరోయిన్. ఒక వైపు హీరో ధనుష్, మరోవైపు హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తమ సినీ కెరీర్లో నభూతో నభవిష్యతి అనే తీరుగ దూసుకెళ్తున్నారు.