టాలీవుడ్లో ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ అండ్ క్రేజీ హీరోయిన్ ఎవరు అంటే అందరూ చెప్పే ఏకైక పేరు.. శ్రీలీల. తన నటనతో, అంతకు మించి అద్భుతమైన డాన్స్‌లతో కుర్రకారు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది ఈ బ్యూటీ. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా వేదికగా శ్రీలీల వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా ఆమె పెళ్లి మరియు డేటింగ్ రూమర్స్ గురించి రకరకాల వార్తలు తెగ హల్చల్ చేస్తున్నాయి. టీమిండియా యంగ్ క్రికెటర్ తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్లో ఉందంటూ వస్తున్న కథనాలపై తాజాగా ఆమె తల్లి స్వర్ణలత స్పందించారు. విషయంలో ఇంకొంచం డెప్త్ కి వెళ్తే, గత ఏడాది డిసెంబర్లో శ్రీలీల, తిలక్ వర్మ ఇద్దరూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, అలాగే వాంఖడే స్టేడియంలో జరిగిన ఒక టీ20 మ్యాచ్‌లో శ్రీలీల సందడి చేయడం వంటి సంఘటనలను ముడిపెడుతూ సోషల్ మీడియాలో గాసిప్స్ క్రియేట్ చేశారు.
ఈ సంఘటనలన్నీ చూసి వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. ఈ ప్రచారం కాస్తా ముదిరిపోవడంతో.. శ్రీలీల తల్లి స్వర్ణలత రంగంలోకి దిగి ఈ పుకార్లకు గట్టి చెక్ పెట్టారు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం మరియు నిరాధారం అని ఆమె స్పష్టం చేశారు.అసలు ఇలాంటి కట్టుకథలు ఎలా పుట్టిస్తారో మాకు అర్థం కావడం లేదు. ఈ వార్తల్లో అణువంత కూడా నిజం లేదు. శ్రీలీల పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది. ప్రస్తుతం ఆమె తన చదువు, యాక్టింగ్ కెరీర్‌తో ఎంతో బిజీగా గడుపుతోంది. ఆమెకు ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా.. నీట్-పీజీ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతోంది." అని స్వర్ణలత స్పష్టతనిచ్చారు. అంతేకాకుండా, తిరుమల దర్శనం మరియు వాంఖడే స్టేడియంలో మ్యాచ్ చూడటం వంటివి కేవలం యాదృచ్ఛికంగా జరిగినవే తప్ప, వాటి వెనుక ఎలాంటి ఉద్దేశపూర్వక ప్రణాళికలు లేవని ఆమె వెల్లడించారు.
ఇలాంటి చిన్న విషయాలను పట్టుకుని పెద్ద పెద్ద కథలు అల్లవద్దని మీడియాను, సోషల్ మీడియా నెటిజన్లను ఆమె కోరారు. రాబోయే మరో రెండు, మూడేళ్ల వరకు శ్రీలీల పెళ్లి లేదా ఇలాంటి వ్యక్తిగత విషయాల గురించి ఆలోచించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.చిత్రమైన విషయం ఏంటంటే.. శ్రీలీలపై ఇలాంటి రూమర్స్ రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో బాలీవుడ్ యంగ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్‌తో కూడా శ్రీలీల రిలేషన్లో ఉందంటూ బీ-టౌన్ మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. అప్పట్లో కూడా స్వర్ణలత ఈ వార్తలను తీవ్రంగా ఖండించారు. కార్తీక్ ఆర్యన్ తల్లి, తాను ఇద్దరం గైనకాలజిస్టులమని.. తమ మెడికల్ బ్యాక్‌గ్రౌండ్ కారణంగా వృత్తిపరంగా తాము కలుసుకుంటామని ఆమె వివరించారు. దురదృష్టవశాత్తూ ఆ పరిచయాన్ని తప్పుగా అర్థం చేసుకుని శ్రీలీల, కార్తీక్‌లకు రిలేషన్ ఉందంటూ వార్తలు రాయడం మొదలుపెట్టారని అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.