ఎన్టీఆర్ ని వేటాడే ఎన్టీఆర్.. డార్క్ జోనర్ కోసం వెయిటింగ్…!

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు తనని తానే వెంటాడబోతున్నాడు. తన వెంటే తాను పడబోతున్నాడు. అంటే విలన్ గా మల్లీ అవతారమెత్తే టైం వచ్చినట్టుంది.

Post Published By: dialnews
Updated : 4 February 2026, 4:30 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఇప్పుడు తనని తానే వెంటాడబోతున్నాడు. తన వెంటే తాను పడబోతున్నాడు. అంటే విలన్ గా మల్లీ అవతారమెత్తే టైం వచ్చినట్టుంది. ఆల్రెడీ టెంపర్ లో తను కాస్త నెగెటీవ్ షేడ్స్ ఉన్న రోల్ వేస్తే, జైలవకుశలో అయితే ఆల్ మోస్ట్ ఒకపాత్రలో విలనిజం చూపించాడు. కట్ చేస్తే ఇప్పుడు పూర్తి స్థాయి విలన్ గా మారే టైం వచ్చినట్టుంది. అంటే మరో హీరో మూవీలో ఎన్టీఆర్ విలన్ గా కనిపిస్తాడా అంటే, కానేకాదు.. డ్రాగన్ మూవీ సమ్మర్ లోగా పూర్తవుతుందనుకుంటే, దసరా వరకు షూటింగ్ కంటీన్యూ అయ్యేలా ఉంది. దేవర సీక్వెల్, గాడ్ ఆఫ్ వార్ కూడా లైన్లో ఉన్నాయి... ఎగ్జాక్ట్ గా ఇలాంటి టైంలో, ఎన్నడూ వేయని డార్క్ రోల్ కి మ్యాన్ ఆఫ్ మాసెస్ రెడీ అవటం ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే అంశమే.. అలాని తను డ్రాగన్ లేదంటే, దేవర2, కాదంటే గాడ్ ఆఫ్ వార్ లో విలనిజం చూపించట్లేదు.. ఇవేవి కాని క్రేజీ ప్రాజెక్ట్ తో మైండ్ బెండ్ చేసే పాత్రలతో బిజీ కాబోతున్నాడు.. విచిత్రం ఏంటంటే, వరుసగా 5 వ సినిమాలో కూడా తను డ్యూయెల్ రోల్ వేయటం వెరైటీ... ఇంతకి ఎన్టీఆర్ పాన్ ఇండియా సినిమాలేవైనా సోలో అప్పియరెన్స్ ఉండదా? డబుల్ లేదంటే ట్రిబుల్ ధామాకాలేనా?

ఎన్టీఆర్ టెంపర్ లో నెగెటీవ్ షేడ్స్ ఉన్న కరెప్ట్ పోలీస్ గా కనిపించినా, చివర్లో కదిలించేలా మారిపోతాడు. జైలవకుశలో మూడు పాత్రలేసి అందులో ఒకటి ప్యూర్ విలన్ అనుకుంటే, క్లైమాక్స్ రాగానే, అన్నగా అన్ని తానై త్యాగం చేస్తాడు.. ఎలాచూసినా ఇప్పటి వరకు ఎన్టీఆర్ పూర్తి స్థాయి విలన్ రోల్ వేయలేదు. తనో పాన్ ఇండియా స్టారే కావొచ్చు.. కాని చాలా సార్లు నెగెటీవ్ షేడ్స్ ఉన్న రోల్స్ లో ప్రయోగం చేసే ప్రయత్నాలు చేశాడు.కట్ చేస్తే వార్ 2 లో నెగెటీవ్ రోల్ అనుకుంటే, అది కాదని తేలింది. అయితే తన కెరీర్ లో ఫస్ట్ టైం పూర్తి స్తాయి విలన్ రోల్ వేసే అవకాశం వచ్చినట్టుంది. కథ అలా కుదిరింది. అలాని తను మరో హీరో సినిమాలో విలన్ గా కనిపించట్లేదు. తన మూవీలో తనే హీరో, తనే విలన్... ఇది ఎప్పటి నుంచో ఎన్టీఆర్ కంటున్న కల... తాతలా అటు హీరోగా, ఇటు విలన్ గా కనిపించాలనేది తన డ్రీమ్ అని చాలా సార్లు చెప్పాడు.

దాన వీర శూరకర్ణ నుంచి రామాయణం వరకు, చాలా మూవీల్లో ఇటు హీరోగా, అటు రావణుడు లేదంటే మరొక పాత్ర వేస్తూ విలనిజం కూడా చూపించాడు విశ్వ విఖ్యాత నట సార్వ భౌమ ఎన్టీఆర్... ఇప్పడు తాతకు తగ్గ మనవడిగా, విలనిజాన్ని చూపించే డార్క్ పాత్రలో కనిపించబోతున్నాడు ఎన్టీఆర్. డ్రాగన్ లో డాన్ పాత్ర వేస్తున్న ఎన్టీఆర్, అందులోనే కాదు, దేవరలో కూడా నెగెటివ్ రోల్ వేయలేదు. సీక్వెల్ లో కూడా వేయట్లేదు..త్రివిక్రమ్ మేకింగ్ లో మ్యాన్ ఆఫ్ మాసెస్ చేయాల్సిన గాడ్ ఆఫ్ వార్ లోకూడా ఎన్టీఆర్ ది నెగెటీవ్ రోల్ కానే కాదు. ఓ వారియర్ గా తను కనిపించబోతున్నాడు. లార్డ్ సుబ్రహ్మణ్యుడి అంశగా తన పాత్ర ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఐతే ఇవేవి కాకుండా మరో మూవీలో మాత్రం పూర్తి డార్క్ రోల్ వేసేందుకు సిద్దమయ్యాడు ఎన్టీఆర్. అదే నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో చేసే ప్రాజెక్ట్.

తమిల డైరెక్టర్ నెల్సన్ దిలీప్ డాక్టర్, జైలర్ తో బాక్సాపీస్ ని షేక్ చేశాడు. మళ్లీ ఇప్పుడు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తో జైలర్ సీక్వెల్ జైలర్ 2 తీస్తున్నాడు. అన్నీంట్లో కామన్ గా కనిపించేది డార్క్ కామెడీనే.. అది నచ్చే తనకి ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చాడు. ఐతే, డార్క్ కామెడీ కి అదనంగా డార్క్ రోల్ ని కూడా యాడ్ చేస్తున్నాడు నెల్సన్ దిలీప్. ఓరకంగా తమిళ్ హీరో విక్రమ్ మూవీ ఇంకొకడులో, తనే హీరో, తనే విలన్ గా కనిపించినట్టు, మరో హీరో సూర్య తన మూవీ 24 లో తనే హీరో తనే విలన్ గా కనిపించినట్టు, నెల్సన్ దిలీప్ మూవీలో ఎన్టీఆర్ హీరోకమ్ విలన్ గా నటించబోతున్నాడట.సో ఓరకంగా ఇది తన కెరీర్ లో ఫస్ట్ టైం హీరోగా అలానే విలన్ గా వేస్తున్న సినిమా. అంతేకాదు దేవర లో డ్యూయెల్ రోల్ వేసిన ఎన్టీఆర్ డ్రాగన్ లో కూడా డబుల్ ఫోటోతోనే కనిపించబోతున్నాడు. ఇక గాడ్ ఆఫ్ వార్, దేవర సీక్వెల్ లో కూడా తనది డ్యూయెల్ రోలే. ఇక నెల్సన్ దిలీప్ మూవీలో, హీరోగా విలన్ గా తనే నటిస్తే, వరుసగా ఐదు మూవీల్లో డ్యూయెల్ రోల్ వేసిన స్టార్ గా కూడా తన ఎకౌంట్ లో రికార్డు చేరే ఛాన్స్ఉంది.

Published : 
  • 4 February 2026, 4:30 PM IST