30 దాటాకే మూడుముళ్లు…!

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు 20 ఏళ్లకే పెళ్లిళ్లు అయిపోయేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కెరీర్ సెటిల్ అయ్యాక, 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు మన టాలీవుడ్ హీరోలు

Post Published By: dialnews
Updated : 27 February 2026, 3:00 PM IST

సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు 20 ఏళ్లకే పెళ్లిళ్లు అయిపోయేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. కెరీర్ సెటిల్ అయ్యాక, 30 ఏళ్లు దాటిన తర్వాతే పెళ్లి పీటలు ఎక్కుతున్నారు మన టాలీవుడ్ హీరోలు. రీసెంట్ గా పెళ్లి చేసుకున్న హీరోల నుండి, ఇంకా పెళ్లి కోసం వెయిట్ చేస్తున్న స్టార్స్ వరకు ఈ 30 దాటడమనేది మస్ట్ గా తయారయింది. ఈ లిస్టులో మొదటగా.. ఇంటెన్స్ లుక్స్ తో మెప్పించే రానా, తన 35వ ఏట మిహీకా బజాజ్ ని 2020లో వివాహం చేసుకున్నాడు. లవర్ బాయ్ నితిన్ కూడా 37 ఏళ్ల వయసులో శాలిని కందుకూరితో ఏడడుగులు వేశాడు.

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఒకరిగా ఉన్న శర్వానంద్, 39 ఏళ్ల వయసులో 2023లో రక్షితా రెడ్డిని పెళ్లి చేసుకుని అందరినీ సర్ ప్రైజ్ చేశాడు.మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 33 ఏళ్ల వయసులో లావణ్య త్రిపాఠిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి రీసెంట్ గా సెప్టెంబర్ 2025లో బాబు కూడా పుట్టారు, తనకి 'వాయువ్ తేజ్' అని పేరు పెట్టారు." అక్కినేని వారసుడు అఖిల్ వివాహం గురించి సోషల్ మీడియాలో భారీ ఎత్తున వార్తలు వచ్చాయి.

2025 చివరలో ఆయన వివాహం గ్రాండ్ గా జరగడం విశేషం. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. మెగా హీరో అల్లు శిరీష్ తన ప్రియురాలు నయనిక రెడ్డిని మార్చి 6, 2026న వివాహం చేసుకోబోతున్నారు. విచిత్రం ఏంటంటే, అదే రోజున తన అన్న అల్లు అర్జున్ పెళ్లి రోజు కూడా అవ్వడం విశేషం.‌ గత కొంతకాలంగా ఊరించిన విరోష్ కూడా ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక్కటయి, టాలీవుడ్ అభిమానులచే విషెస్ అందుకున్నారు.

Published : 
  • 27 February 2026, 3:00 PM IST