Allu arjun : పుష్ప 2 ఇప్పటికీ 100 మాత్రమే…

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) కి రికార్డులకి ఏదో అవినాభావ సంబంధం ఉందనుకుంటా. తన తొలి సినిమా గంగోత్రి (Gangotri) నుంచి తెలుగు చలన చిత్ర సీమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 May 2024, 10:37 AM IST

 

 

ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) కి రికార్డులకి ఏదో అవినాభావ సంబంధం ఉందనుకుంటా. తన తొలి సినిమా గంగోత్రి (Gangotri) నుంచి తెలుగు చలన చిత్ర సీమలో సరికొత్త రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. లేటెస్ట్ గా తన ఖాతాలో మరో భారీ రికార్డుని చేర్చుకున్నాడు.

బన్నీ అప్ కమింగ్ మూవీ పుష్ప 2 (Pushpa2) . ప్యాన్స్ తో పాటు ప్రేక్షకులు పుష్ప హంగామా చూడటం కోసం రీగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక కొన్ని రోజుల క్రితం పుష్ప 2 నుంచి సాంగ్ రిలీజ్ అయ్యింది. పుష్ప పుష్ప పుష్ప అనే లిరిక్ తో స్టార్ట్ అయ్యే ఆ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటి వరకు 100 మిలియన్స్ వ్యూస్ ని సాధించింది. అదే విధంగా 2.26 మిలియన్స్ లైక్స్ ని కూడా పొందింది. దీన్ని బట్టి పుష్ప మానియా ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక సెకండ్ సింగల్ రిలీజ్ కానుంది.మరి ఆ పాట ఎన్ని వ్యూస్ ని కొల్లగొడుతుందో చూడాలి.

రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా చేస్తుండగా ఫహాద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, సునీల్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్ 15, 2024 న వరల్డ్ వైడ్ గా విడుదల అవుతుండగా సుకుమార్ దర్శకుడు. బన్నీ సుక్కు కాంబోలో హ్యాట్రిక్ మూవీగా నిలవాలని యూనిట్ అహర్నిశలు శ్రమిస్తోంది. పార్ట్ వన్ ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నే ఇప్పుడు పార్ట్ టూ ని కూడా నిర్మిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ని అందిస్తున్నాడు.

Published : 
  • 29 May 2024, 10:37 AM IST