దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిస్తున్న భారీ అడ్వెంచర్ యాక్షన్ సినిమా 'వారణాసి'. షూటింగ్‌కు చిన్న బ్రేక్ దొరకడంతో ఫ్రాన్స్ వెళ్లిన రాజమౌళి, అక్కడ జరిగిన ఒక మీడియా సమావేశంలో ఈ సినిమా కథ గురించి తొలిసారి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా అంతర్జాతీయ స్థాయిలో ఆఫ్రికా దట్టమైన అడవుల నుంచి అంటార్కిటికా మంచు వరకు సాగే భారీ అడ్వెంచర్ అయినప్పటికీ, కథకు ప్రధాన బలం మాత్రం 'తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్' అని రాజమౌళి స్పష్టం చేశారు.
ఈ ఎమోషన్ చుట్టూనే సినిమాలోని సాహసాలు, ప్రకృతి విపత్తులు, ఫాంటసీ అంశాలు, రామాయణానికి సంబంధించిన దేవుళ్ల రిఫరెన్సులు అన్నీ ముడిపడి ఉంటాయని ఆయన వివరించారు. బాహుబలి లాంటి సినిమాల తరహాలో ఈ సినిమాకు పార్ట్-1, పార్ట్-2 లాంటి సీక్వెల్స్ ఏమీ ఉండవని జక్కన్న క్లారిటీ ఇచ్చారు. కథను ఇతర భాగాలతో పొడిగించే ఆలోచన లేదని, ఇది కేవలం ఒకే సినిమాగా రాబోతుందని క్లారిటీ ఇచ్చారు. గ్లోబల్ స్థాయిలో రాబోతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, మలయాళ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.
'శ్రీ దుర్గా ఆర్ట్స్' సంస్థ ఈ ప్రాజెక్టును అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఇప్పటికే విడుదలైన 'వారణాసి' గ్లోబల్ టీజర్.. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌ను అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి పూర్తిగా కంప్లీట్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ఇంటర్నేషనల్ రేంజ్ విజువల్స్‌తో పాటు, మన ఇండియన్ ఎమోషన్స్‌ను కలిపి రాజమౌళి ఒక విజువల్ ట్రీట్ ఇవ్వబోతున్నారని ఈ తాజా అప్‌డేట్స్ ద్వారా అర్థమవుతోంది.