అమెరికాలో అందుకే ఏడ్చా…!

దగ్గుబాటి రానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రాణాపాయ స్థితి మరియు ఆ సమయంలో తాను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల గురించి మనసు విప్పి మాట్లాడి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు

Post Published By: dialnews
Updated : 21 February 2026, 2:20 PM IST

దగ్గుబాటి రానా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన ప్రాణాపాయ స్థితి మరియు ఆ సమయంలో తాను తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాల గురించి మనసు విప్పి మాట్లాడి తన అభిమానులకు షాక్ ఇచ్చాడు. 'బాహుబలి' సినిమాలో భల్లాలదేవగా ప్రపంచ గుర్తింపు పొందిన తర్వాత, రానా ఒక్కసారిగా కిడ్నీ వైఫల్యం మరియు గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొన్నారట. చికిత్స కోసం ఆయన అమెరికా వెళ్లారట. అక్కడ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనకు అత్యవసరంగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగాక ఆయన పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే, "బ్రతికి బయటపడటం" తప్ప ఆయనకు మరే ఇతర ఆలోచన లేకపోయిందిట.

ఈ ఇంటర్వ్యూలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఆయన నిజాయితీ. సర్జరీ తర్వాత రానా చాలా సన్నగా అయిపోయి.. మునుపటి కండలు తిరిగిన భల్లాలదేవ రూపం కాస్త పూర్తిగా మారిపోయిందట.ఇక, తాను సైన్ చేసిన కొన్ని సినిమాలకు తన ప్రస్తుత రూపం సెట్ అవ్వదని భావించిన రానా, ముఖ్యంగా ఒక భారీ రెజ్లర్ కథాంశంతో సాగే సినిమా కోసం ఆయన తీసుకున్న అడ్వాన్స్ మొత్తాన్ని, నిర్మాతల దగ్గరకు వెళ్లి స్వయంగా తానే తిరిగి ఇచ్చేశానని గుర్తుతెచ్చుకున్నాడు. ఆ సమయంలో సినిమా ఇమేజ్ కంటే తన ప్రాణం ముఖ్యం అని ఆయన గ్రహించాడటా. రానా సర్జరీ తర్వాత ఇండియాకు తిరిగి వచ్చే క్రమంలో జరిగిన ఒక సంఘటన ఆయనను భావోద్వేగానికి గురయ్యాడు.

విమానాశ్రయంలోని ఒక ఇమ్మిగ్రేషన్ ఆఫీసర్ తనను గుర్తుపట్టి, కింగ్ భల్లాలదేవ అని సంబోధించాడట. తనను తాను అద్దంలో చూసుకోవడానికే ఇబ్బంది పడుతున్న సమయంలో, ప్రపంచం తనను ఇంకా ఆ ఐకానిక్ పాత్రలోనే గుర్తుపెట్టుకుందని తెలియడం రానాకు చాలా ధైర్యాన్ని తెచ్చిపెట్టిందట. ప్రస్తుతం రానా పూర్తి ఆరోగ్యంతో ఉన్నాడు. అయితే సినిమాల విషయంలో చాలా సెలెక్టివ్‌గా వ్యవహరిస్తున్నాడు. వలం నటనకే పరిమితం కాకుండా టెక్నాలజీ, ప్రొడక్షన్ మరియు వెబ్ సిరీస్‌లపై కూడా దృష్టి పెడుతున్నాడు ఈ మల్టీ టాలెంటెడ్.

Published : 
  • 21 February 2026, 2:20 PM IST