రష్మిక – విజయ్ పెళ్లి లోకేషన్ కు, మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే..!

టాలీవుడ్ స్టార్ జంట రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లి అనగానే నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చేసింది. టాలీవుడ్ లో గత పదేళ్ళలో ఏ పెళ్లికి లేని హైప్ ఈ పెళ్ళికి నేషనల్ మీడియా ఇచ్చింది

Post Published By: dialnews
Updated : 19 February 2026, 9:20 PM IST

టాలీవుడ్ స్టార్ జంట రష్మిక మందన్న - విజయ్ దేవరకొండ పెళ్లి అనగానే నేషనల్ వైడ్ గా క్రేజ్ వచ్చేసింది. టాలీవుడ్ లో గత పదేళ్ళలో ఏ పెళ్లికి లేని హైప్ ఈ పెళ్ళికి నేషనల్ మీడియా ఇచ్చింది. ఉదయపూర్ లో ఈ నెల 2 జరగబోయే పెళ్ళికి సంబంధించి ప్రతీ వార్త కూడా నేషనల్ మీడియా ఫోకస్ చేస్తోంది. ఫోన్ లను అనుమతించని విషయం నుంచి.. నేడు పెళ్లి లొకేషన్ వరకు ఎన్నో విషయాలు బయటపెడుతోంది. లేటెస్ట్ గా వీరి పెళ్లి ఎక్కడ జరుగుతుందో కూడా ఓ ఛానల్ రివీల్ చేసింది.

ఉదయపూర్ అని అందరికీ తెలిసినా.. అది ఎక్కడో నేషనల్ మీడియా స్పెషాలిటీస్ తో సహా రివీల్ చేసేసింది. పెళ్లి జరిగే వేదిక, వేదిక వద్దకు అతిధులు వెళ్ళే వాహనాల వరకు ప్రతీ ఒక్కటీ బయటపెట్టింది. ఈ పెళ్లి ఉదయపూర్ శివార్లలోని ఒక హిల్ రిసార్ట్‌లో జరుగుతుందట. ఉదయపూర్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఆరావళి హిల్ రేంజ్ లో మ్యారేజ్ లొకేషన్ ను ఫిక్స్ చేసినట్టు నేషనల్ మీడియా తెలిపింది. ఆరావళి రేంజ్ లో ఐటీసీ హోటల్స్ ఆధ్వర్యంలో నడిచే ది మెమెంటోస్‌ రిసార్ట్ లో ఈ పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

పెళ్లి వద్దకు ఎవరూ రాకుండా ఉండేందుకు ఈ హిల్ రిసార్ట్ ను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలిపింది. రాఫెల్స్ ఉదయపూర్, ఫెయిర్మాంట్ హోటల్స్ కూడా వారి లిస్టులో ఉన్నాయని, ఈ లోకేషన్స్ అన్నీ కూడా నగరానికి దూరంగా ఉన్నాయని చెప్పింది. కొండలలో లేదా ఉదయ్ సాగర్ లేక్ పై ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. పెళ్లి జరుగుతుందని అంచనా వేస్తున్న, ది మెమెంటోస్ గురించి చూస్తే.. ఐటీసి హోటల్స్ వారి ఈ ఫేమస్ డెస్టినేషన్ కైలాష్‌పురి అనే గ్రామంలోని నాథ్‌ద్వారా మందిరం, పురాతన ఏక్లింగ్‌ జీ ఆలయం మధ్య ఓల్డ్ రోడ్ లో ఉందట.

హెలిప్యాడ్ ఉన్న హోటల్‌లో అతిధులు ల్యాండ్ అయ్యేందుకు హెలికాప్టర్ సర్వీస్ కూడా వాడుకోవచ్చని తెలిపింది. ఈ అల్ట్రా-లగ్జరీ హోటల్‌లో మొత్తం 117 సూట్‌లు, విల్లాలు ఉన్నాయట. ఇది కొండపై ఉండటంతో ఆరావళి రేంజ్ లోని ఇతర కొండలతో.. బ్యూటిఫుల్ లోకేషన్స్ చూసుకోవచ్చట. ఓ ఫేమస్ లేక్ కూడా ఇక్కడ ఉందని తెలిపింది. అంతే కాకుండా.. ఐదు రెస్టారెంట్లు, మూడు డైనింగ్ హాల్స్, వేడుకలు చేసుకునేందుకు ప్రత్యేక వేదికలు కూడా ఉన్నాయని నేషనల్ మీడియా తెలిపింది. వీరి పెళ్ళికి వెళ్ళే వారు ముందుగానే చేరుకునే విధంగా ఏర్పాటు చేసారు. ఫిబ్రవరి 24, 25 తేదీలలో జరిగే ప్రీ-వెడ్డింగ్ ఫంక్షన్లకు గెస్ట్ లు 23వ తేదీ నుంచి వెళ్ళే ఛాన్స్ ఉందని పేర్కొంది.

Published : 
  • 19 February 2026, 9:20 PM IST