Samantha Ruth Prabhu: మళ్లీ వార్తల్లోకి.. కేటిఆర్‌కి ఒక నమస్కారమంటోన్న సమంత

కేటిఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసాడు. జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని. పైగా ఆ పోస్ట్‌కి కొంత మంది జనంతో కలిసి చిరు నవ్వుతో ఉన్న తన పిక్‌ని కూడా పెట్టాడు కేటీఆర్. సమంత ఆ పిక్‌కి లైక్ కొట్టడమే కాకుండా నమస్తే ఎమోజిని కూడా పెట్టింది.

Post Published By: narender Thiru
Updated : 11 April 2024, 3:09 PM IST

Samantha Ruth Prabhu: సమంత అనే పేరు వింటే చాలు.. తెలుగు ప్రేక్షకులు తమ సొంత మనిషి అనే విధంగా భావిస్తారు. ఎలాంటి క్యారెక్టర్లో అయినా ఒదిగిపోయి నటించడం ఆమె స్పెషాలిటీ. అందుకే ఆమె తెలుగు నాట అగ్ర కథనాయకిగా కొనసాగుతూ వస్తుంది. ఇటీవలే మయోమైటీస్ అనే వ్యాధి నుంచి బయటపడి మళ్ళీ సినిమాల్లో బిజీ అవుతు వస్తుంది. తాజాగా ఆమె తెలంగాణ మాజీ మంత్రి కేటిఆర్‌కి ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్‌‌గా మారింది.

Geethanjali Malli Vachindi Review: ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ రివ్యూ.. భయపెట్టలేదు కానీ నవ్వించింది..!

కేటిఆర్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసాడు. జీవితం మిమ్మల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టినా చిరునవ్వుతో ఎదుర్కోవాలి అని. పైగా ఆ పోస్ట్‌కి కొంత మంది జనంతో కలిసి చిరు నవ్వుతో ఉన్న తన పిక్‌ని కూడా పెట్టాడు కేటీఆర్. సమంత ఆ పిక్‌కి లైక్ కొట్టడమే కాకుండా నమస్తే ఎమోజిని కూడా పెట్టింది. ఇప్పుడు ఇదంతా వైరల్‌గా మారింది. అయితే, నమస్తేకి అర్ధం ఏంటంటూ అందరు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. సమంత ప్రస్తుతం బాలీవుడ్‌లో సిటాడెల్, హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌లలో చేస్తుంది. త్వరలోనే అది విడుదల కాబోతుంది. వరుణ్ ధావన్ హీరోగా చేస్తుండగా రాజ్ అండ్ డికే దర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

ఇదిలా ఉంటే సమంత భర్తతో విడాకులు తీసుకోవడానికి టెలిఫోన్ ట్యాపింగ్ ఓ కారణం కావడం వివాదంగా మారింది. పైగా ఓ బడా నేత హస్తం ఉందన్న రూమర్లు వినిపించాయి. ఇలాంటి టైంలో కేటీఆర్ పోస్ట్‌కు సామ్ రియాక్ట్ అవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

Published : 
  • 11 April 2024, 3:09 PM IST