ఓల్డ్ ఫైర్ స్టిల్ బర్న్స్ అని అంటారు. అంటే బూడిద కింద నిప్పు అన్నమాట. ప్రేమ కూడా అలాంటిదే. ప్రేమ తర్వాత పుట్టే ద్వేషం.... ప్రతీకారం నిత్యం రగులుతూనే ఉంటాయి. సమంత నాగచైతన్య చూస్తే అది నిజం అనిపిస్తుంది. సమంత ప్రతికరంకొన్నిసార్లు నాగచైతన్యని దాటి అతని కొత్త భార్య శోభితపై కూడావెళ్తూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడల్లా సమంత నాగచైతన్య ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే చేస్తున్నారు.సమంత, నాగచైతన్య విడిపోయి ఐదేళ్లయినా ట్రోలింగ్ మాత్రం ఆగడం లేదు. నాగచైతన్య శోభిత ధూళిపాళ్లను సమంత రాజ్ నిడియోరును పెళ్లాడినా.. సామ్ మాత్రం చైతును వదిలపెట్టడం లేదు ఇన్‌డైరెక్ట్‌గా ఎటాక్ చేస్తూనే ఉంది.'మా ఇంటి బంగారం' ఈవెంట్లో రిలేషన్షిప్ గురించి సామ్ చేసిన వ్యాఖ్యలు శోభితాను వుద్దేశించి అన్నవే నని టాక్ నడుస్తోంది. దీంతో చైతు, సామ్ ఫ్యాన్స్ వార్ మరోసారి తెరపైకి వచ్చింది. మీరు పర్ఫెక్ట్ గా లేకుండా వచ్చి దాన్ని ఫిల్ చేస్తారని అనుకుంటే తప్పులు జరుగుతాయి.
మాటలు స్వయంగా సమంత చెప్పినవి. సమంత ఈ మాటలు శోభితాని ఉద్దేశించి చేసినవేనని కొందరి వాదన. అతడు లేకుంటే నా లైఫ్ ఫుల్ ఫీల్ అవ్వదు అన్న శోభిత మాటలను కౌంటర్ చేస్తూ సమంత అన్నట్లుగా సోషల్ మీడియాలో ఫాన్స్ మధ్య వార్ నడుస్తోంది. సమంత ఇంకా చైతుపై కోపంగానే ఉంది. అందుకే శోభితను అడ్డం పెట్టుకుని చైతును పగ సాధిస్తోంది . స్వీయ అనుభవంతో సామ్ అలా మాట్లాడిందా?సమంత , చైతు విడిపోయారు. కానీ ఎవరి జీవితం వాళ్లదని ఫ్యాన్స్ ఫీలవడం లేదు. సమంత, శోభిత మాటల్లో నిగూఢ అర్థాలను వెలికి తీసి మరీ కౌంటర్స్ ఇస్తున్నారు. మా ఇంటి బంగారం థ్యాంక్స్ మీట్లో సామ్ చాలా రోజుల తర్వాత ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపించింది. అడిగిన ప్రశ్నలన్నింటికీ తడుముకోకుండా ఆన్సర్ ఇచ్చేసింది. రిలేషన్ షిప్లో వున్న అమ్మాయిలకు మీరు ఇచ్చే సలహా ఏంటని అడిగితే.. 'మీరు పర్ఫెక్ట్గా లేకుండా ఎవరో వచ్చి మీ జీవితాన్ని ఫిల్ చేస్తారని అనుకుంటే తప్పులు జరుగుతాయని పేర్కొంది. శోభిత ధూళిపాళ్లకు తగలడానికే సామ్ ఇలా మాట్లాడిండంటూ చైతు ఫ్యాన్స్ సమంతపై మండిపడుతున్నారు.
చైతూతో పెళ్లి సమయంలో శోభిత మాటలను ఆమెకే సమంత తిప్పికొట్టింది. 'అతడు లేకపోతే నా లైఫ్ ఫుల్‌ఫిల్ అవ్వదని శోభిత పేర్కొంది. శోభిత మాటలను ఇన్‌డైరెక్ట్‌గా సమంత ఖండిస్తూ.. ఎవరో వచ్చి ఫిల్ చేస్తారని అనుకుంటే.. తప్పులు జరుగుతాయిని కౌంటర్ ఇచ్చింది. ఇంకేముంది సామ్, చైతు మధ్య సోషల్ మీడియాలో కామెంట్స్ వార్ మొదలైంది. శోభిత ఒపీనియన్‌కు సామ్ కౌంటర్ అంటూ.. ఇద్దరి వీడియోలను పక్కపక్కనే పెట్టి సమంత ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.డోవోర్స్ తర్వాత చైతుటాపిక్ ఎప్పుడొచ్చినా.. కౌంటర్ ఇస్తూనే వుంది. ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్ వేసిందా? అనిపిస్తుంది. సిటాడెల్ ప్రమోషన్లో కోస్టార్ వరుణ్ ధావన్ మాట్లాడుతూ.. 'అవసరం లేకపోయినా...ఎక్కువ దేనికోసం ఖర్చుపెట్టారు' అని సామ్‌ను అడిగితే.. మాజీకి ఇచ్చిన ఖరీదైన కానుకలు అని బదులిచ్చింది. విడాకుల తర్వాత చైతుకు ఇచ్చిన బహుమతులకు వెలకడతావా అంటూ అప్పట్లో పెద్ద చర్చే జరిగింది.విడాకుల తర్వాత చైతు గతంలోకి వెళ్లి సామ్‌ను గుర్తుచేసుకుంది లేదు.
ఒకట్రెండు ఇంటర్వ్యూస్‌లో సామ్ టాపిక్ వచ్చినా.. 'ఇలా జరగాల్సింది కాదు..కానీ జరిగింది. గౌరవంగా విడిపోయామని మాత్రమే చెబుతాడు చైతు. సమంతలా ఏదో ఒకటి మాట్లాడేసి.. కాంట్రవర్సీ చేసే వ్యక్తిత్వం చైతుది కాదంటారు అభిమానులు.సామ్‌తో జీవితం గురించి చైతు ఇంతవరకు ఒక్క కామెంట్ కూడా చేయలేదు. అయితే.. సామ్ మాత్రం.. అప్పుడప్పుడు సెటైర్స్ విసురుతూ వుంటుంది. కరణ్‌జోహార్ షోలో చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. నేను.. మాజీ ఒకే గదిలో వుంటే.. పక్కన కత్తులు వుండకపోవడం మంచిదని చెప్పింది. విడిపోయిన తర్వాత చైతు అంటే ఎంత కోపంగా వుందో చెప్పకనే చెప్పింది సామ్. దగ్గర్లో కత్తులుంటే పొడిచేస్తానన్నంత కోపం సమంతలో వుందా? అంటూ చాలామంది ఆశ్చర్యపోయారు. ఇదంతా చూస్తుంటే.. గత జ్ఞాపకాలు సామ్‌ను ఇంకా వెంటాడుతూనే వున్నాయి. సామ్ లేటెస్ట్ కౌంటర్ చూస్తుంటే... టార్గెట్ మాత్రం చైతూనే. శోభితను అడ్డం పెట్టుకుని.. ఎక్స్ హస్బెండ్పై మాటలతో ప్రతీకారం తీర్చుకుంటుందని అక్కినేని ఫ్యాన్స్ వాపోతున్నారు. సామ్‌కు రాజ్‌తో పెళ్లయ్యేవరకు అక్కినేని ఫ్యాన్స్ సమంతను విపరీతంగా ట్రోలింగ్ చేశారు. సామ్ రెండో పెళ్లి తర్వాత ఆమె అభిమానులు చైతుతోపాటు శోభితను ఆడుకుంటున్నారు. ప్రేమ..పెళ్లి.. రిలేషన్.. జీవితం ఇలా ఏ టాపిక్ వచ్చినా.. వీళ్ల మాటలకున్న అర్థాలనే కాదు.. వీడియోలను కూడా బైటకు లాగడంతో ఇదొక ఫ్యాన్ వార్‌గా మారిపోయింది.