శేఖర్ మాస్టర్ మరో వివాదం.. ఆ అమ్మాయితో సంబంధం.. ఇదిగో క్లారిటీ..!
ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ పాటల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవుతున్నాడు శేఖర్ మాస్టర్. ఒకప్పుడు నేను నా డాన్స్ అన్నట్టు ఉన్న ఈయన.. ఎ
ఈ మధ్య ఎందుకో తెలియదు కానీ పాటల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతోనే ఫేమస్ అవుతున్నాడు శేఖర్ మాస్టర్. ఒకప్పుడు నేను నా డాన్స్ అన్నట్టు ఉన్న ఈయన.. ఎప్పుడు మాత్రం నేను నా వివాదాలు అంటున్నాడు. ముఖ్యంగా ఈయన కంపోజ్ చేస్తున్న కొన్ని స్టెప్స్ చాలా వరకు వైరల్ అవుతున్నాయి.. దాంతో పాటు వివాదం కూడా రేపుతున్నాయి. అందుకే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు శేఖర్ మాస్టర్ పేరు తెగ వినిపిస్తుంది. ఇప్పుడు కూడా ఈయన బాగా ట్రెండ్ అవుతున్నాడు. దానికి కారణం ఈయన కొరియోగ్రఫీ చేసిన పాటలు సూపర్ హిట్ కావడం కాదు.. ఒక డాన్సర్ కమ్ నటితో శేఖర్ మాస్టర్ కు సంబంధం ఉంది అంటూ సోషల్ మీడియాలో చాలా రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఢీ డాన్స్ షోతో పాటు.. కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసిన జాను అని డాన్సర్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఢీ షోలో ఈమె విన్నర్ గా కూడా నిలిచింది. దాంతో జానుకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.
దానికంటే ముందు ఈమె కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా చేసింది. అందులో కూడా ఆమెకు మంచి ఇమేజ్ వచ్చింది. ఇక ఢీ షో విన్నర్ అయిన తర్వాత జాను పేరు బాగా మార్మోగిపోయింది. ఇక ఈ షోలో ఆమె పర్ఫార్మెన్స్ ఇచ్చిన ప్రతిసారి శేఖర్ మాస్టర్ ఓ రేంజ్ లో ఆమెకు ప్రశంసలు కురిపించడంతో.. ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఆమెను కావాలనే శేఖర్ మాస్టర్ హైలైట్ చేస్తున్నాడని.. ఢీ షో గెలవడంలో కూడా ఈయన పాత్ర ఎక్కువగా ఉంది అంటూ ప్రచారం చేశారు. బయట ఎప్పుడైనా కలిసినప్పుడు కూడా ఇద్దరు క్లోజ్ గా ఉండడంతో.. నిజంగానే ఇద్దరి మధ్య ఏదో ఉంది అనేలా గట్టిగానే ప్రచారం జరిగింది. వీటన్నింటిపై ఎన్ని రోజులు ఇటు శేఖర్ మాస్టర్ కానీ.. అటు జాను గాని ఎప్పుడూ ఓపెన్ కాలేదు. దాంతో నిప్పు లేనిదే పొగ రాదు కదా అన్నట్టు ఈ ప్రచారం ఇంకా ఊపందుకుంది. ఇది ఇలాగే వదిలేస్తే ఇంకా పెద్దది అయ్యేలా ఉంది అని.. తాజాగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డాడు శేఖర్ మాస్టర్. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనపై సోషల్ మీడియాలో వచ్చే అన్ని విషయాలను గమనిస్తూ ఉంటానని చెప్పాడు.
తనకు డాన్స్ అనేది దైవమని.. అలాంటి తన కొరియోగ్రఫీ మీద ఎవరైనా చిన్నమాట అన్నా కూడా తాను తీసుకోలేనని చెప్పాడు. అయితే తన డాన్స్ స్టెప్స్ మీద వస్తున్న విమర్శలను జాగ్రత్తగా గమనిస్తున్న శేఖర్ మాస్టర్.. ఈ మధ్య స్టైల్ మార్చాడు. ఎలాంటి వివాదాస్పద స్టెప్పులు లేకుండా పాటలు కంపోజ్ చేస్తున్నాడు. కాకపోతే మునుపటిలా ఈయనకు స్టార్ హీరోలు ఛాన్స్ ఇవ్వడం లేదు, ఇక జాను విషయానికి వస్తే.. అమ్మాయితో తనకు ఎలాంటి సంబంధం లేదని.. ఢీ షోలో తను బాగా పెర్ఫార్మ్ చేసిందని.. అందుకే ప్రశంసలు ఇచ్చినట్టు తెలిపాడు శేఖర్. తమ ఇద్దరి మధ్య ఏదో ఉంది అంటూ సోషల్ మీడియాలో జరిగిన ప్రచారం చూసి బాధనిపించింది అని.. జడ్జి స్థానంలో తాను ఉన్నప్పుడు బాగా చేసిన వాళ్లను కచ్చితంగా ప్రోత్సహించాలి.. జాను విషయంలో తాను కూడా అదే చేశాను అని చెప్పాడు శేఖర్ మాస్టర్. అంతమాత్రానికే తమ ఇద్దరి మధ్య ఏదో ఉంది అని ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అంటున్నాడు ఆయన. తనకు కూడా ఒక కుటుంబం ఉందని.. ఈ వార్తలు అన్నీ చూస్తే బాధపడతారు అని చిన్న కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎలా అంటున్నాడు శేఖర్. ఏదేమైనా కూడా ఈయన జాను విషయం మీద చాలా రోజుల తర్వాత క్లారిటీ ఇచ్చాడు. ఇది ఇలాగే వదిలేస్తే ఇంకా దూరం వెళ్తుంది అనే విషయం శేఖర్ మాస్టర్ కు కూడా అర్థమైంది. అందుకే ఫుల్ స్టాప్ పెట్టేలా ఆన్సర్ ఇచ్చాడు. మరి ఇది ఇక్కడితో అయినా ఎండ్ అవుతుందా లేదా చూడాలి.











