రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి సడన్ గా సందీప్ రెడ్డి వంగకి ఒక రిక్వెస్ట్ వెల్లిందా? ఎన్నడూ లేంది ప్రభాస్ లాంటి కటౌట్ ఒక దర్శకుడిని ఫేవర్ అడిగాడా? ఇందులో నిజంగానే నిజం ఉన్నట్టుంది. కాకపోతే అదేదో కథ కావాలనో, సినిమాకావలనో కాదు.. అసలు తన డేట్లకోసమే అంతా క్యూ కడుతున్న వేళ, తనకి దర్శకులని రిక్వెస్ట్ చేసే అవసరమేముంది.. కాకపోతే స్పిరిట్ సీక్వెల్ ఉండి తీరాలన్న కండీషన్ ని సడన్ గా సందీప్ రెడ్డి వంగ ముందుంచాడట రెబల్ స్టార్. అదే అంతుచిక్కట్లేదు.. ఫౌజీ మూవీ మొదలయ్యాక ఇక పూర్తికాబోతోందనగా, దీనికి సీక్వెల్ ఉండొచ్చని అప్పడు నిర్ణయం మార్చుకున్నాడు దర్శకుడు హను రాఘవపూడీ... సీన్ కట్ చేస్తే సందీప్ కూడా స్పిరిట్ 2 ప్లాన్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అంతటికి రెబల్ స్టారే కారణమంటున్నారు.. ఎందుకు? ఎందుకని స్పిరిట్ సీక్వెల్ విషయంలో ప్రభాస్ పట్టుబడుతున్నాడన్న ప్రచారం పెరిగింది?
రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ అసలు సిసలు యాక్షన్ సీక్వెన్స్ కి టైం అయ్యింది. ప్రజెంట్ కల్కీ సీక్వెల్ కల్కీ 2 షూటింగ్ నడుస్తోంది. తర్వాతే, స్పిరిట్ ఫైట్ సీన్ల షూటింగ్ మొదలౌతుంది. కనీసం 30 యాక్షన్ ఎపిసోడ్ లతో భారీ ఎత్తునే లాఠీ పట్టుకున్న బాహుబలిని చూపించే ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు సందప్ రెడ్డి వంగ..అయితే ఇది ఇక్కడితో ఆగట్లేదు.ముందుగ ఒకటే పార్ట్ గా అనుకున్నారు. కత కూడా ఒకే భాగం, ఇప్పుడు సీక్వెల్ కూడా ప్లానింగ్ జరిగేలా ఉంది. అలాని కథని రెండు గా విడగొట్టడం ఏం ఉండదట.. ఇప్పుడున్న స్పిరిట్ కి సీక్వెల్ గా మరో కథ కూడ రెడీ చేయమని ప్రభాస్ నుంచి సందీప్ కి రిక్వెస్ట్ వెళ్లిందని తెలుస్తోంది. దీంతో సందీప్ రెడ్డ వంగ గాల్లో తేలిపోతున్నట్టున్నాడని తెలుస్తోంది.
కారణం. ఎంత నచ్చితే స్పిరిట్ మూవీకి సీక్వెల్ కావాలని హీరోనుంచే రిక్వెస్ట్ వస్తుంది.. ఎంతగా తనకి పాత్రఎక్కితే ఇలా తనే మరో పార్ట్ ఉంటే బాగుంటుందని రెబల్ స్టార్అంటాడు.. దాని ఎఫెక్టో ఏంటో కాని సందీప్ రెడ్డి కూడా స్పిరిట్ సీక్వెల్ విషయంలో సీరియస్ గా నేనిర్ణయం తీసుకున్నాడట. స్పిరిట్ తర్వాత యానిమల్ 2, ఆతర్వాత స్పిరిట్ 2 ఉండొచ్చని తెలుస్తోంది.నిజానికి స్పిరిట్ లానే ఫౌజీ కూడా ఎలాంటి సీక్వెల్ ఐడియా లేకుండా మొదలైంది. కాని 80శాతం షూటింగ్ అయ్యాకే, దీనికి సీక్వెల్ ప్లాన్ చేసి ఆ ఐడియాను కూడా కన్ఫామ్ చేశాడు హను రాఘవపూడీ..ఓరకంగా ప్రభాస్ తో మరో సినిమా చేయాలన్నా,మరో కథ తనకి నచ్చాలన్నా, అదంత ఓకే అయ్యాక డేట్లు దొరకాలన్నా కుదిరేపనికాదు. అదే ఒకసారి కమిటైన కథకే, సీక్వెల్ అయితే చాలా వారకు రాయటం, తేలిక.. ప్రాజెక్ట్ కన్ఫామ్ చేసుకోవటం తేలిక.
సలార్ 2, కల్కీ 2 అంటే షూటింగ్ కి ముందే రెండు భాగాలతో ప్లాన్చేసిన ప్రాజెక్టులవి... కాని ఫౌజీ, స్పిరిట్ మాత్రం షూటింగ్ మొదలయ్యాకే రెండో భాగం ఐడియాను ముందుకు తీసుకొచ్చారు.. మొత్తానికి రెబల్ స్టార్ ఇప్పడుు కలిసొచ్చిన సలార్, కల్కీ సీక్వెల్స్ తోసేఫ్ జోన్ లో ఉండటమే కాదు, స్పిరిట్, ఫౌజీ ఏమాత్రం వర్కవుట్ అయినా మరో రెండు సేఫ్ ప్రాజెక్టులతో సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే.ఇక సలార్ 2 లో హీరో తన ఫ్రెండుతోనే తాను ఫైట్ చేయాల్సిన లైన్ తో రాబోతుంటే, కల్కీ 2 లో మాత్రం కర్ణుడి సాయం అన్న కాన్సెప్ట్ తో యాస్కిన్ అంతం స్టోరీ లైన్ తోరాబోతోంది. ఈ రెండూ కూడా ఓ పెన్ సీక్రెట్లే... కాని ఫౌజీ, స్పిరిట్ మొదటి భాగాలే రాలేదు కాబట్టి, సీక్వెల్స్ లైనేంటో ఎక్స్ పెక్ట్ చేయటం కూడా కష్టమే.