హాలీవుడ్ ని షేక్ చేసిన అవతార్ మూవీ మేకర్ జేమ్స్ కామెరున్ ఎంట్రీ ఎప్పుడు... ఏదో త్రిబుల్ ఆర్ ఆస్కార్ రేసులో ఉన్నప్పుడు, అనుకోకుండా కలిసి రాజమౌళిని తెగపొగిడేశాడు కామెరున్. కట్ చేస్తే వారణాసి టీజర్ లాంచ్ కి తానే వస్తాడన్నారు. కాని అవతార్ 3 వ సీక్వెల్ రిజల్ల్ రివర్స్ అవటంతో, సీనే మారింది. జేమ్స్ కామెరున్ లేకుండానే, వారణాసి కాన్సెప్ట్ గ్లింప్స్ లాంచ్ చేశారు. ఇప్పుడు టీజర్ లేదంటే, ట్రైలర్ లాంచ్ కి రంగం సిద్దమౌతోందా? అంటే జేమ్స్ కామెరున్ రాక కన్ఫామ్ అయ్యిందా? మొన్నటి వరకు అమెరికాలోనే తన చేతుల మీదుగా ఈటీజర్ రానుందన్నారు. సీన్ చూస్తే కామెరున్ రాకకోసం రాజమౌళి టీం ఏదో ప్రయత్నాలు చేస్తున్న ప్రచారం మొదలైంది.. ఇంతకి ఏం జరగబోతోంది?
సూపర్ స్టార్ మహేశ్ బాబుకో సం వారణాసిలో హాలీవుడ్ లేడీ ప్రియాంక చోప్రా వచ్చింది. ఇప్పుడు ఇదే మూవీ కోసం సీన్ లోకి అవతార్ మేకర్ జేమ్స్ కామేరున్ రాబోతున్నాడు. ఇక క్వంటిన్ టొరెంటిన్ తో కూడా ఏదో గట్టిగానే వారనాసి ప్రమోషన్ కోసం ప్లాన్ చేయిస్తున్నట్టున్నాడు రాజమౌళి. ఐతే ఇవన్నీ ఎప్పుడు జరగబోతున్నాయి. ఎంత సేపు అప్పుడు, ఇప్పుడంటూ ప్రచారమేతప్ప, ఇంతవరకు వాళ్లొచ్చింది లేదు..ఐతే వినాయక చవితికి వారణాసి టీజర్ ని లాంచ్ చేసేందుకు రాజమౌళి టీం ప్లాన్ చేయటం వెనక, జేమ్స్ కామెరున్ పర్మీషన్ ఉందని తెలుస్తోంది. ముందు తను అమెరికాలోనే ఈ టీజర్ లాంచ్ ని ప్లాన్ చేశాడట. అందుకే ఓకే చెప్పిన ఫిల్మ్ టీం. టీజర్ ని తన హోమ్ టౌన్ లోనే జేమ్స్ కామెరున్ తో లాంచ్ చేయింది. 2 వారాల గ్యాప్ లో ట్రైలర్ ని ఇండియాలో అది వారణాసిలో లాంచ్ చేయించాలనుకుంటున్నారని తెలుస్తోంది.
ఈరెండు విషయాల్లో జేమ్స్ కామెరున్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. మొన్నంటే కాన్సెప్ట్ గ్లింప్స్ రిలీజ్ విషయంలో అవతార్ 3 ప్రమోషన్ అడ్డొచ్చింది. ఆతర్వాతైనా వస్తాడనుకుంటే, అవతార్ 3 ఫ్లాపైంది.. అందుకే జేమ్స్ కామెరున్ ని వారణాసి కాన్సెప్ట్ గ్లింప్స్ లాంచ్ కి తీసుకు రాలేకపోయారట. కాని టీజర్ తన ఇంట్లో, ట్రైలర్ ని కాశీలో లాంచ్ చేయటం ఆల్ మోస్ట్ ఫైనల్ అయినట్టే..జులై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ మూడునెలల్లో రెండు వారాల గ్యాప్ ఉండేల రెండు డేట్లు ఫిక్స్ చేసుకుని వారణాసి టీజర్, ట్రైలర్ లాంచ్ చేయాలనేది ఇనీషియల్ గా వేసిన ప్లాన్. వినాయక చవితితో టీజర్ సందడి మొదలయ్యే అవకాశం ఉంది. ఐతే ఏదైనా అఫీషియల్ గా డేట్లు ఎనౌన్స్ చేసే వరకు కన్పామ్ చేసుకోలేం.. ఐతే జేమ్స్ కామెరున్ వెసులు బాటు చూసుకుని, ఫిల్మ్ టీం ఈ టీజర్ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసే ఛాన్స్ఉంది.ఇక హాలీవుడ్ లో పల్ఫ్ ఫిక్షన్ లాంటి ఎన్నో క్లాసిక్స్ తీసిన క్వంటిన్ టొరింటినో ని కూడా రంగోలోకి దింపాలనుకుటున్నాడట రాజమౌలి. బాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మకి ఎలాగైతే ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంటుందో, అలానే హాలీవుడ్ లో క్వంటిన్ టొరొంటినోకి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాంటి దర్శకుడి సాయం తీసుకుని వారణాసిని యూఎస్ లో ప్రమోట్ చేస్తే వారణాసి ప్రాజెక్ట్ రీచ్ పెరుగుతుంది. అందుకే రాజమౌళి వరుసగా హాలీవుడ్ దర్శకులను టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తున్నాడు.