లెజెండరీ సింగర్ ఇంట్లో తీవ్ర విషాదం…!
లెజెండరీ సింగర్ ఎస్.జానకి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె కొడుకు మురళి అకస్మాత్తుగా మరణించారు
లెజెండరీ సింగర్ ఎస్.జానకి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె కొడుకు మురళి అకస్మాత్తుగా మరణించారు. మురళి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న ఎస్. జానకి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ఎంతో గాఢమని.. మురళి ఆమెకు ఎంతో అండగా ఉండేవాడని వాళ్ల సన్నిహితులు చెబుతున్నారు.
తల్లి సినీ రంగంలో సింగర్‌గా ఎన్నో అద్భుతమైన పాటలు పాడి, లెజండరీ స్థానాన్ని సంపాదిస్తే.. కొడుకు మురళీ కృష్ణ భరత నాట్యంలో గొప్ప ప్రావీణ్యం సంపాదించారు. తన తల్లి పలుకుబడిని ఏనాడూ కూడా ఉపయోగించుకోలేదు మురళీ కృష్ణ. తన సొంత టాలెంట్ తోనే సినిమాల్లో అవకాశాలు సంపాదించారు. గతంలో ఆయన వినాయకుడు, మల్లెపువ్వు లాంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. చెన్నై కి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు మురళి. ఆయనకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. గత కొంతకాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న మురళీ కృష్ణ, నేడు చికిత్స పొందుతూ తుదిశ్వాసని విడిచారు.











