రోహిత్ బాటలో రిషబ్ పంత్… బరువు తగ్గే పనిలో బిజీ…!

టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఐపీఎల్ 18వ సీజన్‌లో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇందులో భాగంగా బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన పంత్‌ బరువు తగ్గే విషయమై భారత స్టార్‌ ఆటగాడు

Post Published By: dialnews
Updated : 16 March 2026, 6:17 PM IST

టీమిండియా వికెట్‌కీపర్‌ రిషబ్‌ పంత్‌ ఐపీఎల్ 18వ సీజన్‌లో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నాడు. ఇందులో భాగంగా బరువు తగ్గే పనిలో పడ్డాడు. ఈ క్రమంలోనే ఫిట్‌నెస్‌పై దృష్టి సారించిన పంత్‌ బరువు తగ్గే విషయమై భారత స్టార్‌ ఆటగాడు రోహిత్‌ శర్మను అనుసరిస్తున్నాడు. గతంలో రోహిత్‌ శర్మ కూడా తన బరువు తగ్గే క్రమంలో కఠినమైన డైట్‌ పాటించాడు. తాజాగా పంత్‌ కూడా బరువు తగ్గేందుకు మిత ఆహారం మాత్రమే తీసుకుంటున్నాడు. ఇక పంత్‌ ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు . తాజాగా పంత్‌ వర్కౌట్స్‌కు సంబంధించిన వీడియోలను, ఫోటోలను లక్నో సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

ఒకవైపు గాయాలు, మరోవైపు ఫామ్‌లేమీ పంత్‌ను చాలా ఇబ్బందులకు గురి చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌ ద్వారా తిరిగి గాడిలో పడేందుకు టీమిండియా మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ సలహాలు తీసుకున్నాడు. ఈ సందర్భంగా యూవీ పంత్‌కు పలు సలహాలు, బ్యాటింగ్‌ నైపుణ్యానికి సంబంధించి మెలుకువలు అందించాడు.అయితే గతంలో సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మలు కూడా ఇదే తరహాలో ఫామ్‌ కోల్పోయినప్పుడు యూవీ ఇలాగే సాయం చేశాడు. 2025 ఐపీఎల్‌లో 27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసిన లక్నో యాజమాన్యం ఈ ఏడాది అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే.

టీ20 ప్రపంచకప్‌కు ముందు వికెట్‌కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కోసం బీసీసీఐ పంత్‌ను పరిగణలోకి తీసుకుంది. కానీ అనూహ్యంగా పంత్‌ గాయపడడంతో జితేశ్‌ శర్మ పేరు తెర మీదకు వచ్చింది. కానీ అతను కూడా గాయంతో బాధపడుతుండడంతో ఆ అవకాశం ఇషాన్‌ కిషన్‌ను వరించింది. గతేడాది ఐపీఎల్‌లో పంత్‌ లక్నో సూపర్‌జెయింట్స్‌ తరఫున 14 మ్యాచ్‌లాడి 269 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఒక అర్థసెంచరీ ఉన్నాయి. ఇక ఐపీఎల్‌ 18వ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌ తన తొలి మ్యాచ్‌ను ఏప్రిల్‌ 1న ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది.

Published : 
  • 16 March 2026, 6:17 PM IST