దక్షిణాది సినీ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, కేవలం వెండితెరపైనే కాకుండా నిజ జీవితంలో కూడా చాలా స్పష్టమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి అని మరోసారి నిరూపించుకుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె, ప్రస్తుత సమాజంలో ప్రేమ మరియు బంధాలు ఎలా ఉండాలి అనే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బంధాలనేవి మన ఎదుగుదలకు తోడ్పడేవిగా ఉండాలి గానీ, మనల్ని బంధించేవిగా ఉండకూడదు" అని ఆమె చాలా లోతైన విషయాన్ని వెల్లడించింది తమన్నా. అంటే, ఒక బంధంలో ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ వ్యక్తిగతంగా ఎదగడానికి అవకాశం ఉండాలని ఆమె ఆశిస్తోంది.
ఎక్కడైతే ఇద్దరు వ్యక్తుల మధ్య పరస్పర గౌరవం ఉంటుందో, అక్కడే నిజమైన ప్రేమ చిగురిస్తుంది, ప్రతిఫలం ఆశించకుండా ప్రేమించడమే నిజమైన ప్రేమ అని ఆమె పేర్కొంది. నిస్వార్థమైన ప్రేమే అత్యంత స్వచ్ఛమైనది, ఏ ప్రేమ అయినా ఎటువంటి షరతులు లేనిదిగా ఉండాలి అని తమన్నా తన అభిప్రాయాన్ని వెల్లడించింది.నేటి కాలంలో చాలా మంది ప్రేమను కూడా ఒక వ్యాపారంలా చూస్తుంటారని తమన్నా అభిప్రాయపడింది. "ప్రేమను ఎప్పుడూ ఒక లావాదేవీలా చూడకూడదు.
మనం అవతలి వాళ్లకు ఏదో ఇస్తున్నాం కనుక, వాళ్ల నుంచి తిరిగి ఏదో ఆశించడం ఎప్పటికీ ప్రేమ అనిపించుకోదు" అని ఆమె స్పష్టం చేసింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి కంటే, మనస్ఫూర్తిగా ఇచ్చే గుణమే ప్రేమకు పునాది కావాలని ఆమె మాటల సారాంశం.మొత్తానికి ప్రేమ మరియు బంధాల పట్ల తమన్నా చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా యువతకు ఆమె చెప్పిన 'నిస్వార్థమైన ప్రేమ' మరియు 'స్వేచ్ఛనిచ్చే బంధం' అనే అంశాలు బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.