జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు జపాన్‌లో ఉన్న క్రేజ్, అక్కడ జరిగిన కలెక్షన్ల గురించి వింటూంటే, గూస్ బంప్స్ రాకమానదు.జపాన్‌లో ఎన్టీఆర్ నటించిన 'RRR' 'దేవర' సినిమాలకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం "తెలుగు సినిమా ఖండంతరాలు దాటింది.. కానీ జపాన్ దేశంలో మన తారక్ రేంజ్ వేరే లెవెల్‌లో ఉంది." జపాన్‌లో రజనీకాంత్ 'ముత్తు' సినిమా తర్వాత ఆ స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న ఏకైక హీరో తారక్. కేవలం యాక్షన్ మాత్రమే కాదు, తారక్ డ్యాన్స్, ఎనర్జీకి జపనీస్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR జపాన్ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. సుమారు 130 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి, జపాన్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది.కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటనకు అక్కడి ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా 'నాటు నాటు' సాంగ్‌కి జపనీస్ ఫ్యాన్స్ చేసిన డ్యాన్స్ వీడియోలు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మార్చి 2025లో జపాన్‌లో విడుదలైన 'దేవర' అక్కడ సంచలనం సృష్టించింది.
జపాన్‌లో మొదటి రోజు ఫుట్‌ఫాల్స్ పరంగా 'బాహుబలి 2' రికార్డును కూడా దేవర అధిగమించింది. తొలిరోజే దాదాపు 1.55K పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. తారక్ స్వయంగా జపాన్ వెళ్లి అక్కడి మీడియాతో, అభిమానులతో ముచ్చటించడం సినిమా బిజినెస్‌కు పెద్ద ప్లస్ అయ్యింది.ఒక జపనీస్ లేడీ ఫ్యాన్, తారక్ మీద ఉన్న ఇష్టంతో ఏకంగా తెలుగు నేర్చుకుని, ఆయనతో తెలుగులో మాట్లాడిన వీడియో ఈ మధ్య బాగా వైరల్ అయ్యింది. జపాన్ అభిమానులు దేవర కటౌట్లకు పూల మాలలు వేయడం, హారతులు ఇవ్వడం వంటి "తెలుగు ఫ్యాన్ కల్చర్"ను ఫాలో అవుతుండటం విశేషం. ఇప్పుడు జపాన్ మార్కెట్ ఎన్టీఆర్ సినిమాలకు ఒక 'అడ్డా'గా మారింది. అందుకే ఆయన తదుపరి సినిమాల ఓవర్సీస్ బిజినెస్‌లో జపాన్ రైట్స్ భారీ ధరకు అమ్ముడవుతున్నాయి."గ్లోబల్ స్టార్‌గా ఎన్టీఆర్ ఎదుగుదలకు జపాన్ మార్కెట్ ఒక నిదర్శనం.