టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రొడ్యూసర్ నాగవంశీ స్టేట్‌మెంట్స్ అంటే ఒక రేంజ్ క్రేజ్ ఉంటుంది. ఆయన ఒక సినిమా గురించి ధీమాగా మాట్లాడారంటే అందులో మేటర్ ఉన్నట్టే.. ఈసారి తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమా గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.వైవిధ్యమైన పాత్రలతో మన తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కోలీవుడ్ స్టార్ సూర్య. ప్రేమలు' సినిమాతో కుర్రకారు మనసు దోచుకున్న క్రేజీ బ్యూటీ మమితా బైజు.తొలిప్రేమ', ధనుష్‌తో 'సార్' వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందించిన వెంకీ అట్లూరి. వీళ్ళందరి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రాన్ని ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ చాలా అట్టహాసంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన ప్రొడ్యూసర్ నాగవంశీ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు.సితార బ్యానర్‌లో వచ్చే సినిమాలను మా ఆస్థాన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి స్పెషల్ స్క్రీనింగ్ వేసి చూపిస్తుంటాం. ఇప్పటివరకు ఆయన చూసి, 'సినిమా చాలా బాగుంది' అని మెచ్చుకున్న ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అవ్వలేదు. 'విశ్వనాథ్ అండ్ సన్స్' సినిమాను కూడా ఆయనకు చూపించాం, ఆయనకు సినిమా విపరీతంగా నచ్చింది." అనినాగవంశీ, సూర్య ఫ్యాన్స్‌కి, తెలుగు ఆడియన్స్‌కి ఒక రకమైన "హిట్ గ్యారెంటీ భరోసా" ఇచ్చినట్లయ్యింది. 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్‌కు ఒక ఫ్యామిలీ సినిమా నచ్చిందంటే అందులో ఖచ్చితంగా మంచి ఎమోషన్స్, కనెక్టింగ్ సీన్స్ ఉంటాయనడంలో సందేహం లేదు.
సూర్య మాస్ రోల్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా బాగా పండిస్తారు. ఈ సినిమాలో ఆయన లుక్, యాక్టింగ్ ప్రెజెన్స్ చాలా కొత్తగా ఉండబోతున్నాయి.మొత్తానికి సూర్య క్రేజ్, వెంకీ అట్లూరి టేకింగ్, నాగవంశీ కాన్ఫిడెన్స్, దానికి తోడు త్రివిక్రమ్ గారి జడ్జిమెంట్.. ఇవన్నీ చూస్తుంటే 'విశ్వనాథ్ అండ్ సన్స్' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించేలాగే కనిపిస్తోంది.నాగవంశీ చెప్పిన "త్రివిక్రమ్ సెంటిమెంట్" ఎంతవరకు నిజమవుతుందో, సూర్య తెలుగు ప్రేక్షకులను ఏ రేంజ్‌లో మెప్పిస్తారో తెలియాలంటే ఈ 14వ తేదీ వరకు ఆగాల్సిందే.