బాలీవుడ్‌లో గత కొంతకాలంగా వినిపిస్తున్న మోస్ట్ ఇంట్రెస్టింగ్ రూమర్స్‌లో ఒకటి.. 'కాక్‌టెయిల్ 2' సినిమా. 2012లో దీపికా పదుకొణె, సైఫ్ అలీఖాన్, డయానా పెంటీ ప్రధాన పాత్రల్లో వచ్చిన 'కాక్‌టెయిల్' ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. యూత్‌ని విశేషంగా ఆకట్టుకున్న ఆ లవ్ స్టోరీకి ఇప్పుడు సీక్వెల్‌గా 'కాక్‌టెయిల్ 2' రూపకల్పన జరుగుతోంది. అయితే, ఈ సీక్వెల్ గురించి సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ ఒక షాకింగ్ న్యూస్ తెగ హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ఇద్దరూ స్వలింగ సంపర్కులుగా కనిపించబోతున్నారట.
ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం, హోమీ అదజానియా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఒక విభిన్నమైన ‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’ అని ప్రచారం జరుగుతోంది. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటిస్తుండగా, కృతి సనన్ మరియు రష్మిక మందన్న ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే సాధారణ త్రికోణ ప్రేమకథల్లా కాకుండా, ఇందులో కృతి, రష్మికల పాత్రల మధ్య ఉండే కెమిస్ట్రీ చాలా భిన్నంగా ఉండబోతోందని టాక్. వీరిద్దరూ ఒకరినొకరు ఇష్టపడే స్వలింగ ప్రేమికులుగా కనిపిస్తారనే ప్రచారం ఇండస్ట్రీలో గట్టిగా సాగుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రానప్పటికీ, వీరి పాత్రల గురించిన లీక్స్ మాత్రం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవలే ఈ చిత్ర బృందం ముంబైలో ఒక గ్రాండ్ మ్యూజికల్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో పాల్గొన్న రష్మిక మందన్న సినిమా గురించి, తోటి నటి కృతి సనన్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సినిమాలో కృతి సనన్ చాలా హాట్‌గా కనిపించడమే కాకుండా, అద్భుతమైన నటన కనబరిచిందని రష్మిక ప్రశంసించింది.
"‘కాక్‌టెయిల్ 2’ అనేది ఎవరూ ఊహించని ఒక విభిన్నమైన చిత్రం. ఈ సినిమాలో కృతి సనన్ స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది. ఆమె ఎంత అందంగా, హాట్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే, కానీ ఈ సినిమాలో అంతకుమించి కనిపించబోతోంది." అని రష్మిక పేర్కొంది. ఈ సినిమాలో హీరో షాహిద్ కపూర్, రష్మికల మధ్య వచ్చే సీన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. దీనిపై రష్మిక మాట్లాడుతూ.. "నాకు, షాహిద్ కపూర్‌కు మధ్య ఉండే కెమిస్ట్రీ సరికొత్త స్టైల్‌లో ఉంటుంది. ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ లవ్ స్టోరీని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇప్పటివరకు మీరు విన్నవి, చూసినవి చాలా తక్కువ. ముందు ముందు ఈ సినిమా నుంచి మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్స్ రాబోతున్నాయి. వాటి కోసం నేను కూడా మీలాగే ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను.
సినిమాలో ప్రతి సన్నివేశం ఒక అద్భుతంలా ఉంటుంది" అంటూ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఒకవైపు రష్మిక-షాహిద్ లవ్ ట్రాక్, మరోవైపు కృతి-రష్మికల మధ్య ఉండే బోల్డ్ లైన్.. ఇలా ఎన్నో సంచలన అంశాలతో ఈ సినిమా స్క్రిప్ట్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు వరుస సక్సెస్‌లతో దూసుకుపోతున్న రష్మిక మందన్న, ఇలాంటి ఒక ప్రయోగాత్మక పాత్రలో నటిస్తుందనే వార్త ఇటు సౌత్ ప్రేక్షకుల్లో కూడా విపరీతమైన క్యూరియాసిటీని పెంచుతోంది. 2012 నాటి 'కాక్‌టెయిల్' సినిమాకు పర్‌ఫెక్ట్ సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.