ఉస్తాద్ భగత్ సింగ్ ఇక్కడ.. ధురంధర్ 2 అయితే నాకేంటి.. ఆంధ్రా, తెలంగాణ పవన్ కళ్యాణ్ అడ్డా..!

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి పవర్ స్టార్ తుఫాను సృష్టించేందుకు రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.

Post Published By: dialnews
Updated : 4 February 2026, 3:18 PM IST

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరోసారి పవర్ స్టార్ తుఫాను సృష్టించేందుకు రంగం సిద్ధమైంది. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ మార్చి 26న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అధికారికంగా డేట్ ఇంకా ప్రకటించకపోయినా కూడా దాదాపు అదే తేదీకి రావడం ఖాయం. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. గతంలో గబ్బర్ సింగ్‌తో పవన్‌ను సరికొత్త మాస్ అవతార్‌లో చూపించిన హరీష్ శంకర్.. ఈసారి ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ ప్రేక్షకులను ఏకకాలంలో మెప్పించేలా ఒక కంప్లీట్ ఎంటర్‌టైనర్‌ను సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం. ఇప్పటికే విడుదలైన దేఖ్‌లేంగే సాలా పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ ఒక్క పాట పవన్ ఫ్యాన్స్‌ను మునుపెన్నడూ లేని విధంగా ఏకం చేసింది. గతంలో గబ్బర్ సింగ్ బ్లాక్‌బస్టర్ విజయంలో DSP సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంత కీలక పాత్ర పోషించాయో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు దేవి సిద్ధమయ్యాడు.

రీసెంట్‌గా విడుదలైన OG సినిమా సక్సెస్‌లో థమన్ సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఒక వెన్నెముకలా నిలిచింది. పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్‌ను థమన్ ఎలివేట్ చేసిన తీరు ఇప్పటికీ హాట్ టాపిక్‌గానే ఉంది. ఇప్పుడు ఆ బెంచ్‌మార్క్‌ను దాటాల్సిన బాధ్యత DSP పై ఉంది. గబ్బర్ సింగ్ రేంజ్ హిస్టీరియాను క్రియేట్ చేయడంలో తన మార్క్ పవర్ ఫుల్ BGM తో DSP తన బెస్ట్ ఇస్తాడని ఫ్యాన్స్ అండ్ మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఎంతటి పోటీ ఉన్నా పవన్ కళ్యాణ్ స్టామినా ముందు నిలవలేదనేది ట్రేడ్ వర్గాల మాట. ఈసారి ఏకంగా ధురంధర్ 2 వంటి భారీ సినిమా పోటీలో ఉన్నా సరే.. పవన్ వెనకడుగు వేయడం లేదు. ఎవరొచ్చినా సరే ఆంధ్రా, తెలంగాణ పూర్తిగా కళ్యాణ్ అడ్డా అంతే.. తగ్గేదే లే అనే కాన్ఫిడెన్స్ పవన్ వర్గంలో స్పష్టంగా కనిపిస్తోంది.

పవన్ మాస్ ఇమేజ్, పొలిటికల్ క్రేజ్ కలగలిపి ఈ రెండు రాష్ట్రాల్లో బాక్సాఫీస్ రికార్డులు బద్దలవడం ఖాయంగా కనిపిస్తోంది. ధురంధర్ 2 మార్చి 19న రాబోతుంది. ఆ సినిమా దెబ్బకు చాలా సినిమాలు వాయిదా పడ్డాయి. దానిపై అంచనాలు పీక్స్‌లో ఉండటంతో.. అందరూ తప్పుకుంటున్న వేళ.. పవన్ మాత్రం ధైర్యంగా ముందడుగేస్తున్నాడు. అయినా పవన్ కళ్యాణ్ సినిమా వస్తే.. అక్కడ ధురంధర్ 2 ఉన్నా జంకేదేం లేదు. ఏపీ, తెలంగాణ వరకు మాకు పవన్ కళ్యాణ్ అది పెద్ద ధురంధర్ అంటున్నారు బయ్యర్లు. మొత్తంగా చూస్తే, హరీష్ శంకర్ రాసిన పదునైన డైలాగులు, పవన్ కళ్యాణ్ స్వాగ్, DSP ఎనర్జిటిక్ మ్యూజిక్ కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా కాబోతోంది. మార్చి 26న థియేటర్లలో పండగ వాతావరణం నెలకొనడం ఖాయం. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడానికి ఉస్తాద్ గన్ లోడ్ చేసుకుని వస్తున్నాడు.. ఇక వేట మొదలే.

Published : 
  • 4 February 2026, 3:18 PM IST