యోగి, అఖిల్ వంటి చిత్రాలు ఫ్లాప్ కానీ.. వి.వి. వినాయక్ ఓపెన్ కామెంట్స్!

ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, పరాజయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వల్ల ఏ నిర్మాత, పంపిణీదారుడు నష్టపోకూడదనేది తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.

Post Published By: dialnews
Updated : 6 July 2026, 4:33 PM IST

ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఒక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, పరాజయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన వల్ల ఏ నిర్మాత, పంపిణీదారుడు నష్టపోకూడదనేది తన ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. భారీ ధరల వల్ల నష్టపోయిన ఒక సినిమా పంపిణీదారుల కోసం తానే స్వయంగా రంగంలోకి దిగి, తన రెమ్యునరేషన్ వదులుకొని 50 శాతం నష్టాన్ని పూడ్చినట్లు తెలిపారు.

యోగి, అఖిల్ వంటి చిత్రాలు ఫ్లాప్ అయినా, ఏ సినిమా కూడా పూర్తిగా డిజాస్టర్ కాలేదన్నారు. అఖిల్ సినిమా ఫ్లాప్ ముద్ర పడినా నైజాంలో 6 కోట్లు, వైజాగ్‌లో 2.5 కోట్ల వరకు వసూలు చేసిందని వినాయక్ వెల్లడించారు.

Published : 
  • 6 July 2026, 4:33 PM IST