టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఒకరైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి గురించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. 'అల్లుడు శీను'తో ఎంట్రీ ఇచ్చి, మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, త్వరలోనే ఒక ఇంటివాడు కాబోతున్నాడనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. గతంలో బెల్లంకొండ శ్రీనివాస్ పేరు ఒక స్టార్ హీరోయిన్‌తో ముడిపడి వినిపించింది. కానీ ఆ వార్తలను ఆయన అప్పట్లోనే ఖండించారు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. ఈసారి పెళ్లి సంబంధం తన్ని తండ్రి బెల్లంకొండ సురేష్ స్వయంగా చూశారని తెలుస్తోంది. ఇది ఒక అరేంజ్డ్ మ్యారేజ్ అని, అమ్మాయి హైదరాబాద్‌కే చెందిన ఒక పెద్ద వ్యాపారవేత్త కూతురు అని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
కుటుంబ సభ్యుల మధ్య ఇప్పటికే చర్చలు ముగిశాయని, త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. గతంలో ఒక ఇంటర్వ్యూలో శ్రీనివాస్ తన పెళ్లి గురించి మాట్లాడుతూ.. "నాకు ఎలాంటి కండిషన్స్ లేవు, నా కుటుంబాన్ని ప్రేమించే అమ్మాయి అయితే చాలు" అని చెప్పారు.ఆ సమయంలో ఒక ప్రముఖ హీరోయిన్‌తో ఆయన డేటింగ్‌లో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ కేవలం ప్రచారమే అని, తాము కేవలం మంచి స్నేహితులమని ఆయన క్లారిటీ ఇచ్చారు.ఇప్పుడు వస్తున్న వార్తలు మాత్రం చాలా బలంగా ఉన్నాయి.
ఎందుకంటే కుటుంబ సభ్యులు కూడా దీనిపై సానుకూలంగా ఉన్నారట. పెళ్లి వార్తలపై శ్రీనివాస్ ఇప్పటివరకు నేరుగా స్పందించకపోయినా, తన సన్నిహితుల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఆయన ప్రస్తుతానికి తన కెరీర్‌పై ఫోకస్ చేస్తూనే, ఇంట్లో వారు చూసిన సంబంధానికి ఓకే చెప్పారని తెలుస్తోంది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. 2026 ద్వితీయార్థంలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ వివాహం జరగొచ్చని అంచనా.బెల్లంకొండ ఫ్యామిలీకి ఇండస్ట్రీలో మంచి సంబంధాలు ఉన్నాయి, కాబట్టి ఈ పెళ్లి వేడుక చాలా గ్రాండ్‌గా, టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో జరిగే అవకాశం ఉంది.డెస్టినేషన్ వెడ్డింగ్ చేస్తారా లేక హైదరాబాద్‌లోనే ఘనంగా నిర్వహిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.